ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Hyderabad Metro: హైదరాబాద్ వాసులకు బిగ్ షాక్..!

ABN, Publish Date - Apr 07 , 2024 | 10:45 AM

భాగ్యనగర వాసులకు బిగ్ షాక్ ఇచ్చింది హైదరాబాద్ మెట్రో రైల్(Hyderabad Metro) సంస్థ. ప్రయాణికులకు ఇచ్చే రాయితీలను(Discount) రద్దు చేశారు మెట్రో రైల్ అధికారులు. రూ. 59 హాలిడే కార్డును(Metro Holiday Card) కూడా రద్దు చేశారు. ఈ నిర్ణయంతో ఎండలకు(Summer) కూల్ జర్నీ చేద్దామనకున్న ప్రయాణికులకు ఊహించని షాక్ తగిలినట్లయ్యింది.

Hyderabad Metro

హైదరాబాద్, ఏప్రిల్ 07: భాగ్యనగర వాసులకు బిగ్ షాక్ ఇచ్చింది హైదరాబాద్ మెట్రో రైల్(Hyderabad Metro) సంస్థ. ప్రయాణికులకు ఇచ్చే రాయితీలను(Discount) రద్దు చేశారు మెట్రో రైల్ అధికారులు. రూ. 59 హాలిడే కార్డును(Metro Holiday Card) కూడా రద్దు చేశారు. ఈ నిర్ణయంతో ఎండలకు(Summer) కూల్ జర్నీ చేద్దామనకున్న ప్రయాణికులకు ఊహించని షాక్ తగిలినట్లయ్యింది. సాధారణ రోజుల్లో ఉండే మెట్రో కార్డు కొంటే ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు.. రాత్రి 8 గంటల నుంచి అర్థరాత్రి వరకు ఇచ్చే 10 శాతం రాయితీని సైతం ఎత్తివేసింది. అయితే, ఎండల తీవ్రతతో మెట్రో రైలుకు డిమాండ్ పెరగడంతో రాయితీలు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు ప్రకటించారు. మెట్రో రైల్ అధికారుల నిర్ణయంపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రయాణికుల జేబులకు చిల్లులు పెట్టే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. రాయితీలను పునరుద్ధరించాలని కోరుతున్నారు.

రాజేంద్రనగర్‌లో భారీ అగ్ని ప్రమాదం..

ఇదిలాఉంటే.. హైదరాబాద్ శివారులోని రాజేంద్రనగర్‌లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. బండ్లగూడ రత్నదీప్ సెలెక్ట్ సూపర్ మార్కెట్‌లో మంటలు చెలరేగాయి. సూపర్ మార్కెట్‌లో మరమ్మత్తులు చేస్తుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలను చూసిన సిబ్బంది మార్కెట్ నుంచి బయటకు పరుగులు తీశారు. మంటలకు తోడు నల్లటి పొగ దట్టంగా వ్యాపించింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది.. ఘటనా స్థలానికి చేరుకుంది. రెండు ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలను ఆర్పుతున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Updated Date - Apr 07 , 2024 | 10:45 AM

Advertising
Advertising