HYDRA: బీజేపీ కార్పొరేటర్ అక్రమ నిర్మాణాలు కూల్చివేత.. ఉద్రిక్త వాతావరణం..
ABN, Publish Date - Aug 31 , 2024 | 12:10 PM
మైలార్‌దేవ్‌పల్లి బీజేపీ కార్పొరేటర్ తోకల శ్రీనివాస్ రెడ్డి అక్రమ కట్టడాలను హైడ్రా అధికారులు కూల్చివేశారు. అప్ప చెరువు ఎఫ్‌టీఎల్ నిర్మించిన షెడ్లు, ఇండస్ట్రీస్ నేలమట్టం చేశారు. భారీ పోలీస్ బందోబస్తు మధ్య అక్రమ నిర్మాణాలు తొలగించారు. అయితే కనీసం నోటీసులు ఇవ్వకుండానే అధికారులు కూల్చివేశారంటూ కార్పొరేటర్ శ్రీనివాస్ రెడ్డి ఆందోళనకు దిగారు.
హైదరాబాద్: నగరవ్యాప్తంగా హైడ్రా అధికారులు ఆక్రమణదారుల గుండెల్లో నిద్రపోతున్నారు. అక్రమ నిర్మాణాలు కనపడితే చాలు బుల్డోజర్లతో దూసుకెళ్తున్నారు. ఫిర్యాదు అందిన వెంటనే స్పందిస్తూ చర్యలు చేపడుతున్నారు. అయితే హైడ్రా విషయంలో తెలంగాణ వ్యాప్తంగా మిశ్రమ స్పందన వస్తోంది. కొంతమంది మంచి పని చేస్తున్నారంటూ ప్రశంసిస్తుంటే, మరికొంత మంది పేదల ఇళ్లు కూల్చివేస్తున్నారంటూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. బీజేపీ, బీఆర్ఎస్ నేతలు సైతం పేదల ఇళ్లు కూల్చవద్దంటూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. అయినా సొంత పార్టీ నేతలు, ప్రతిపక్ష నేతలు అనే తేడా లేకుండా చెరువుల పరిరక్షణే లక్ష్యంగా రేవంత్ రెడ్డి సర్కార్ ముందుకు వెళ్తోంది. ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్లల్లో ఎక్కడ కట్టడాలు కనిపించినా సరే కూల్చివేతలకు రంగం సిద్ధం చేస్తోంది.
తాజాగా మైలార్‌దేవ్‌పల్లి బీజేపీ కార్పొరేటర్ తోకల శ్రీనివాస్ రెడ్డి అక్రమ కట్టడాలను హైడ్రా అధికారులు కూల్చివేశారు. అప్ప చెరువు ఎఫ్‌టీఎల్ నిర్మించిన షెడ్లు, ఇండస్ట్రీస్ నేలమట్టం చేశారు. భారీ పోలీస్ బందోబస్తు మధ్య అక్రమ నిర్మాణాలు తొలగించారు. అయితే కనీసం నోటీసులు ఇవ్వకుండానే అధికారులు కూల్చివేశారంటూ కార్పొరేటర్ శ్రీనివాస్ రెడ్డి ఆందోళనకు దిగారు. కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందంటూ ఆయన మండిపడ్డారు. కనీసం నోటీసులు ఇవ్వకుండా ఎలా కూలుస్తారంటూ ఆయన నిరసనకు దిగడంతో స్థానికంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
మరోవైపు రంగారెడ్డి జిల్లా గగన్ పహాడ్ అక్రమ నిర్మాణాల కూల్చివేతల్లో ఉద్రిక్తత నెలకొంది. అక్రమ నిర్మాణాలు కూల్చివేస్తుండగా హైడ్రా అధికారులను స్థానికులు అడ్డుకున్నారు. ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఎలా కూల్చివేస్తారంటూ ఆందోళనకు దిగారు. ఏళ్ల తరబడి ఇక్కడే నివసిస్తున్నామని, ఇళ్లను కూల్చేందుకు తాము అంగీకరించమని ఆవేదన వ్యక్తం చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పలువురు స్థానికులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వారిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. భారీ బందోబస్తు నడుమ అక్రమ కట్టడాలు కూల్చివేశారు.
ఈ వార్తలు కూడా చదవండి:
TG Elections: స్థానిక సంస్థల ఎన్నికలపై నేడు రాజకీయ పార్టీలతో ఎస్ఈసీ భేటీ..
TG News: అర్ధరాత్రి పబ్బులు, బార్‌లల్లో దాడులు.. డ్రగ్ టెస్టులు నిర్వహించగా
Road Accident: బంజారాహిల్స్ రోడ్ నంబర్-2లో కారు బీభత్సం..
Updated Date - Aug 31 , 2024 | 12:11 PM