ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

MLC Kavitha: వడ్డీతో సహా చెల్లిస్తా.. కవిత మాస్ వార్నింగ్..

ABN, Publish Date - Aug 27 , 2024 | 09:49 PM

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బెయిల్‌పై విడుదలైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సంచలన కామెంట్స్ చేశారు. తనను ఇబ్బంది పెట్టిన వారిని వదిలే ప్రసక్తే లేదంటూ మాస్ వార్నింగ్ ఇచ్చారు. తనను, తన కుటుంబాన్ని ఇబ్బంది పెట్టిన వారికి వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తానంటూ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.

MLC Kavitha

న్యూఢిల్లీ, ఆగష్టు 27: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బెయిల్‌పై విడుదలైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సంచలన కామెంట్స్ చేశారు. తనను ఇబ్బంది పెట్టిన వారిని వదిలే ప్రసక్తే లేదంటూ మాస్ వార్నింగ్ ఇచ్చారు. తనను, తన కుటుంబాన్ని ఇబ్బంది పెట్టిన వారికి వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తానంటూ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఆ సమయం అతి త్వరలోనే రాబోతోందన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై సీబీఐ, ఈడీ నమోదు చేసిన కేసుల్లో బెయిల్ మంజూరు చేస్తూ సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పునిచ్చింది.


ఈ తీర్పు మేరకు కవిత మంగళవారం నాడు తీమార్ జైలు నుంచి విడుదలయ్యారు. కవిత భర్త, కుమారులు, కేటీఆర్, హరీష్ రావు సహా బీఆర్ఎస్ శ్రేణులు తీహార్ జైలు వద్దకు వచ్చి ఆమెకు ఘన స్వాగతం పలికారు. అయితే, జైలు నుంచి బయటకు రాగానే తన కొడుకు, భర్తను హత్తకుని కన్నీటి పర్యంతం అయ్యారు. చాలా రోజుల తరువాత తనయుడి దగ్గరికి రావడంతో భావోద్వేగానికి గురయ్యారు. ఇక జైలు నుంచి బయటకు వచ్చిన ఆమె.. తొలిసారి మీడియాతో మాట్లాడారు. చెమ్మగిల్లిన కళ్లతోనే మీడియా ముందుకు వచ్చిన ఆమె.. తనకు ఈ పరిస్థితి రావడానికి కారణమైన ఎవరినీ వదిలిపెట్టబోనని అన్నారు.


కవిత కామెంట్స్ యధావిధిగా..

‘నేను కేసీఆర్ బిడ్డను.. నేను తప్పు చేసే ప్రసక్తే లేదు. 18 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నాను. ఎన్నో ఎత్తుపల్లాలు చూశాను. ఇదీ అలాంటిదే. సాధారణంగానే నేను మొండిదాన్ని.. మంచిదాన్ని. కానీ, నన్ను అనవసరంగా జైలుకు పంపించి జగమొండిదాన్ని చేశారు. పిల్లల్ని వదిలి ఐదున్నర నెలలు ఉండటం తల్లిగా చాలా ఇబ్బందికరమైన విషయం. ఏ తప్పు చేయకున్నా నన్ను జైలుకు పంపారు. అనవసరంగా జగమొండిని చేశారు. నన్ను ఇబ్బంది పెట్టిన వాళ్లు తగిన మూల్యం చెల్లించుకుంటారు. ఆ సమయం అతి త్వరలోనే రాబోతోంది. ఇటువంటి కష్ట సమయంలో మా కుటుంబానికి వెన్నంట ఉన్న ప్రతి ఒక్కరికి పాదయాభివందనాన్ని తెలియజేస్తున్నాను.’ అని అన్నారు.


Also Read:

తీహాడ్ జైలు నుంచి కవిత విడుదల.. జైలు వెలుపల కోలాహలం

బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత

దేవాదాయ శాఖపై సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం

For More Telangana News and Telugu News..

Updated Date - Aug 27 , 2024 | 09:51 PM

Advertising
Advertising
<