ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Phone Tapping: మొత్తం ఆయనే చేశారు.. ఫోన్ ట్యాపింగ్‌లో సంచలనం

ABN, Publish Date - Mar 29 , 2024 | 11:26 AM

ప్రణీతరావు ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇన్‌స్పెక్టర్ గట్టు మల్లు విచారణ ముగిసింది. నిన్నటి నుంచి ఇన్‌స్పెక్టర్ గట్టు మల్లును పోలీస్ అధికారులు విచారించారు. టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధా కిషన్ ఆదేశాలతో పనిచేశానని గట్టు మల్లు తెలిపారు. ఇప్పటికే ఈ కేసులో రాధా కిషన్‌ను పోలీసులు అరెస్టు చేశారు.

హైదరాబాద్: ప్రణీతరావు (Praneeth Rao) ఫోన్ ట్యాపింగ్ కేసు (Phone Tapping Case)లో ఇన్‌స్పెక్టర్ గట్టు మల్లు విచారణ ముగిసింది. నిన్నటి నుంచి ఇన్‌స్పెక్టర్ గట్టు మల్లును పోలీస్ అధికారులు విచారించారు. టాస్క్ ఫోర్స్ (Taskforce) మాజీ డీసీపీ రాధా కిషన్ ఆదేశాలతో పనిచేశానని గట్టు మల్లు తెలిపారు. ఇప్పటికే ఈ కేసులో రాధా కిషన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. తెలంగాణలో పెను సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో (Phone Tapping Case) తవ్వే కొద్దీ సంచలన విషయాలు బయటికొస్తున్నాయి. ఇప్పటికే దర్యాప్తులో కీలక విషయాలను రాబట్టిన ఉన్నతాధికారులు మరింత వేగం పెంచారు. ఈ కేసులో మరో ఇద్దర్ని.. పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఆ ఇద్దర్నీ పోలీసు అధికారులు విచారిస్తున్నారు. కాగా ఈ ఇద్దరు కూడా పోలీసు అధికారులే కావడం గమనార్హం.

Cancellation of trains: పలు రైళ్ల రద్దు.. మరికొన్ని దారి మళ్లింపు

బుధవారం రాత్రి అధికారులను అదుపులోనికి తీసుకున్న పోలీసులు.. లోతుగా విచారణ చేపడుతున్నారు. ముఖ్యంగా.. ఈ కేసులో నిందితుడైన ప్రణీత్‌రావుతో ఉన్న సంబంధాలపై దర్యాప్తు బృందం ఆరా తీస్తోంది. ఇవాళ అంతా విచారించి.. ఆ ఇద్దరు అధికారులను అరెస్ట్ చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. కాగా.. ప్రణీత్‌కు సహకరించిన ప్రతి ఒక్కర్నీ విచారించాలని దర్యాప్తు బృందం యోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు.. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై అధికార కాంగ్రెస్, ప్రతిపక్షాల మధ్య తీవ్ర స్థాయిలోనే మాటల యుద్ధం జరుగుతోంది. స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్రాంచ్‌(SIB) కేంద్రంగా సాగిన ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారం ఇప్పుడు శివారు కమిషనరేట్‌నూ తాకిన సంగతి తెలిసిందే. ఇప్పటికే హైదరాబాద్‌ టాస్క్‌ఫోర్స్‌ డీసీపీగా పనిచేసిన రాధాకిషన్‌రావు పేరు వెలుగులోకి రాగా.. తాజాగా శివారు కమిషనరేట్‌లో టాస్క్‌ఫోర్స్‌ మాదిరి విభాగానికి(ఎస్‌వోటీ) ఇన్‌చార్జిగా వ్యవహరించిన డీసీపీ పాత్రను దర్యాప్తు అధికారులు గుర్తించారు.

AP News: నెల్లూరులో విజయసాయిరెడ్డికి చేదు అనుభవం..

నాన్‌-క్యాడర్‌ అధికారే అయినా.. ఆయన ఆ కమిషనరేట్‌లో రియల్‌ ఎస్టేట్‌ పరంగా అత్యంత కీలకమైన దాదాపు అన్ని జోన్లకు డీసీపీగా పనిచేసినట్లు సమాచారం. సదరు అధికారి తన టీమ్‌తో కలిసి రూ.కోట్లలో అక్రమ వసూళ్లకు పాల్పడినట్లు పంజాగుట్ట పోలీసులు అనుమానిస్తున్నారు. రియల్‌ ఎస్టేట్‌ పరంగా కీలకమైన జోన్లు కావడంతో.. ప్రభుత్వ పెద్దలు చెప్పినట్లు భూదందాలు, సెటిల్‌మెంట్లు చేసి, విధేయతను చాటుకున్నారని సమాచారం. సదరు డీసీపీ గత ప్రభుత్వ పెద్దలకు సమీప బంధువు కావడంతో.. సీపీ స్థాయి అధికారి కూడా ఆయన చర్యలను పెద్దగా పట్టించుకునేవారు కాదని భావిస్తున్నారు. ఎస్‌ఐబీలో సేవలందించిన 15 మంది అధికారులు, సిబ్బందికి ఈ కేసుతో సంబంధాలున్నట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. వీరంతా ఏళ్ల తరబడి ఇంటెలిజెన్స్‌లో పాతుకుపోయినట్లు తెలుస్తోంది. కొందరైతే ఎస్పీ, డీఎస్పీ స్థాయిలో పదవీ విరమణ చేసినా.. ఓఎస్డీలుగా కొనసాగారు. ట్యాపింగ్‌ వ్యవహారంలో వీరు కూడా కీలక పాత్రధారులు అని తెలుస్తోంది. ఎస్‌ఐబీ కేంద్రంగా సాగిన ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారం పక్క రాష్ట్రాలను కూడా తాకినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. మరోవైపు.. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో బాధితులు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు.

TDP 42nd Foundation Day: టీడీపీ 42వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా చంద్రబాబు ట్వీట్..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Mar 29 , 2024 | 01:12 PM

Advertising
Advertising