ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: సన్నీ లియోన్ కోసం ఆశగా ఎదురు చూసిన యువకులు.. చివరికి జరిగింది ఇదే..

ABN, Publish Date - Dec 01 , 2024 | 12:56 PM

ప్రముఖ బాలీవుడ్ నటి సన్నీ లియోన్‌కు జూబ్లీహిల్స్ పోలీసులు షాక్ ఇచ్చారు. శనివారం రాత్రి జూబ్లీహిల్స్‌‌లోని ఇల్లీయూజన్‌ పబ్‌లో ఆమె డీజే ప్లే చేస్తూ లైవ్ ఫర్మార్మెన్స్ ఇవ్వాల్సి ఉండగా అందుకు పోలీసులు నిరాకరించారు.

Bollywood actress Sunny Leone

హైదరాబాద్: ప్రముఖ బాలీవుడ్ నటి సన్నీ లియోన్‌కు జూబ్లీహిల్స్ పోలీసులు షాక్ ఇచ్చారు. శనివారం రాత్రి జూబ్లీహిల్స్‌‌లోని ఇల్యూజన్ పబ్‌లో ఆమె డీజే ప్లే చేస్తూ లైవ్ ఫెర్ఫార్మెన్స్ ఇవ్వాల్సి ఉండగా అందుకు పోలీసులు నిరాకరించారు. పబ్ యజమానులు సన్నీ లియోన్‌తో వీకెండ్ లైవ్ ఫెర్ఫార్మెన్స్ ఏర్పాటు చేశారు. శనివారం రాత్రి 11 గంటల నుంచి 12:30 గంటల వరకూ పబ్‌లో ఆమె సందడి చేయాల్సి ఉంది. దీనికి భారీఎత్తున రేట్లు పెట్టి మరీ ఇల్యూజన్ పబ్ యజమానులు టికెట్లు విక్రయించారు.


సన్నీ లియోన్ సైతం శనివారం రాత్రి హైదరాబాద్ నగరానికి చేరుకుంది. అయితే ఆమె వస్తుందన్న వార్త తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. సన్నీ లియోన్ పబ్‌లో నృత్యాలు చేసేందుకు అనుమతి లేదంటూ తేల్చి చెప్పారు. ఓ వైపు భారీగా టికెట్లు విక్రయించడం, తమ అభిమాన తార వస్తుందన్న సమాచారంతో యువత భారీగా పబ్ వద్దకు చేరుకోవడంతో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే పబ్ యజమానులు మాత్రం అనుమతి కోసం విశ్వప్రయత్నాలు చేశారు. ఉన్నతాధికారులను సైతం కలిసి పరిష్మన్ ఇవ్వాలని కోరారు. అయితే వారి ప్రయత్నాలు విఫలం అయ్యాయి.


మరోవైపు పబ్ వద్దకు యువకులు భారీగా రావడంతో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. అనుమతి లేకపోయినా సన్నీ లియోన్‌ను తీసుకువస్తారేమో అనే అనుమానంతో రాత్రి ఒంట గంట వరకూ పహారా కాశారు. దీంతో అక్కడంతా ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. మరోవైపు ఈవెంట్ కోసం సన్నీ ఓ హోటల్‍లో ఎదురు చూస్తూ ఉంది. పోలీసులు భారీగా మోహరించడంతో చేసేదేమీ లేక పబ్ నిర్వాహకులు ప్రొగ్రామ్ క్యాన్సిల్ చేశారు. దీంతో వేల రూపాయలు వెచ్చించి టికెట్లు కొన్న యువత మెుత్తం తీవ్ర ఆవేదనకు గురయ్యారు. సన్నీ లైవ్ ఫెర్ఫార్మెన్స్ చూద్దామని వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్న వారి ఆశలు కాస్త అడియాశలుగా మారడంతో పబ్ యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి:

Egg Rate: సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్న కోడిగుడ్డు ధర.. ఒక్కో గుడ్డు ఎంతకు చేరిందంటే.

Telangana: తెలంగాణ మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ..

Updated Date - Dec 01 , 2024 | 01:49 PM