ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

KA Paul: కొండా సురేఖపై కేసు నమోదు చేస్తాం : కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు

ABN, Publish Date - Oct 03 , 2024 | 11:57 AM

కొండా సురేఖ వ్యాఖ్యలపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీ వేదికగా ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా కొండా సురేఖపై కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కొండా సురేఖపై డిఫార్మేషన్ కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. కొండా సురేఖ రాజీనామా చేయాలని కేఏ పాల్ డిమాండ్ చేశారు.

ఢిల్లీ: నాగ చైతన్య-సమంత విడాకుల గురించి మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపాయి. సమంత- అక్కినేని కుటుంబాలు మంత్రి సురేఖ తీరును తప్పు పట్టారు. దాంతో కొండా సురేఖ వెనక్కి తగ్గి.. తాను చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నారు. అయితే ఈ విషయంపై రాజకీయ, సినీ ప్రమఖులు కొండా సురేఖ వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ స్పందించారు. ఢిల్లీ వేదికగా ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా కొండా సురేఖపై కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కొండా సురేఖపై డిఫార్మేషన్ కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. కొండా సురేఖ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఆమెను మంత్రి పదవి నుంచి తొలగించాలని సీఎం రేవంత్‌రెడ్డిని కోరారు. ‘‘మళ్లీ కేసీఆర్ మనకెందుకు. కేసీఆర్ ,కేటీఆర్‌లను ఇగా మర్చిపోండి. వాళ్లకు విశ్రాంతి ఇద్దాం. ప్రజాశాంతి పార్టీని గెలిపించుకుందాం’’ అని కేఏ పాల్ తెలిపారు.


క్షమాపణ చెబితే సరిపోతుందా..

‘‘కొండా సురేఖ చట్ట విరుద్ధంగా మాట్లాడారు. కొండా సురేఖకు గత ప్రభుత్వం కాల్ లిస్ట్ ఏమైనా దొరికిందా. తప్పు చేసి క్షమాపణ చెబితే సరిపోతుందా. తెలంగాణ డీజీపీ ఎందుకు కొండా సురేఖను అరెస్ట్ చేయలేదు. కొండా సురేఖను అరెస్ట్ చేయాలి. 72 గంటల సమయం ఇస్తున్నా. కాంగ్రెస్ పార్టీ నుంచి , పదవి నుంచి కొండా సురేఖను తొలగించాలి. మహిళల పట్ల చిత్తశుద్ధి లేకపోయినా కనీసం ఉన్నట్లైనా కాంగ్రెస్ పార్టీ వ్యవహరించాలి. సమంత, నాగార్జున కుటుంబానికి కొండా సురేఖ ఇంటికి వెళ్లి స్వారీ చెప్పాలి. కాంగ్రెస్ పార్టీకి గర్వం ఎక్కువ అయిపోయింది. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సీక్రెట్‌గా ఎందుకు అదానిని కలిశారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో యువత పోటీ చేసి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలి. ప్రజలు కేసీఆర్, కేటీఆర్‌ను మర్చిపోవాలి. ప్రజాశాంతి పార్టీకి అధికారం ఇవ్వాలి. కొండా సురేఖను అనర్హత వేటు వేయాలని కోర్టులో పిటిషన్ వేస్తా. తిరుపతి లడ్డూ వ్యవహరంపై సీబీఐ దర్యాప్తు జరపాలి. తిరుపతిని కేంద్ర పాలిత ప్రాంతం లేదా ప్రత్యేక రాష్ట్రం చేయాలి. లడ్డూ వివాదంపై రాజకీయ నాయకులు మాట్లాడకుండా ఆర్డర్ ఇవ్వాలని సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేశా. మధ్యాహ్నం 3:30గంటలకు కోర్టులో వాదనలు వినిపిస్తా. కొండా సురేఖతో రేవంత్ రెడ్డే మాట్లాడించాడేమో. హైడ్రాపై వస్తున్న వ్యతిరేకతను పక్కదారి పట్టించడానికి రేవంత్ రెడ్డే మాట్లాడించాడేమో అనిపిస్తుంది. దీనిపై విచారణ జరపాలి’’ అని కేఏ పాల్ అన్నారు.


మంత్రి కొండా సురేఖ ఏమన్నారంటే...

మాజీ మంత్రి కేటీఆర్ తనకు క్షమాపణ చెప్పే వరకు వదిలిపెట్టనని మంత్రి కొండా సురేఖ తేల్చి చెప్పారు. ఇటీవల మెదక్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రి కొండా సురేఖకు ఎంపీ రఘునందన్ రావు నూలు పోగుల దండ వేశారు. దానిని బీఆర్ఎస్ సోషల్ మీడియా ట్రోల్ చేసింది. ఇదే అంశంపై మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావుపై కొండా సురేఖ మండిపడ్డారు. ఆ ఘటనపై హరీశ్ రావు స్పందిస్తూ క్షమాపణ చెప్పారు. కేటీఆర్- కొండా సురేఖ మధ్య జరుగుతోన్న మాటల యుద్ధంలో చైతన్య- సమంత పేర్లు రావడంతో దుమారం చెలరేగింది. సురేఖ క్షమాపణ చెప్పినప్పటికీ మీడియా ముందుకు వచ్చి సారీ చెప్పాలనే డిమాండ్ వస్తోంది.


నా విడాకులు వ్యక్తిగత విషయం: సమంత

నా విడాకులు వ్యక్తిగత విషయం, దాని గురించి ఊహాగానాలు చేయడం మానుకోండి.. నా పేరును మీ రాజకీయ పోరాటాలకు వాడకోకండి.. అంటూ మంత్రి కొండా సురేఖ (Konda Surekha)కు ప్రముఖ నటి సమంత స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. మాజీ మంత్రి కేటీఆర్‌ని ఉద్దేశిస్తూ అక్కినేని ఫ్యామిలీతో ముడిపెడితూ.. కొండా సురేఖ సమంత విడాకుల గురించి మాట్లాడిన విషయం తెలిసిందే. కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను కింగ్ నాగార్జున తీవ్రంగా ఖండిస్తూ.. అబద్దాలుగా కొట్టిపారేశారు. తాజాగా సమంత కూడా ఇన్‌స్టా వేదికగా మంత్రికి సమాధానమిచ్చింది. సమంత (Samantha) తన పోస్ట్‌లో ఏం చెప్పిందంటే...


ఈ ప్రయాణంలో చాలా ధైర్యం, బలం కావాలి...

‘‘స్త్రీగా ఉండటానికి, బయటకు వచ్చి పని చేయడానికి, స్త్రీలను ఆసరాగా భావించే ఆకర్షణీయమైన పరిశ్రమలో మనుగడ సాగించడానికి, ప్రేమలో పడటానికి మరియు ప్రేమలో నుంచి బయట పడటానికి, ఇంకా నిలబడి పోరాడటానికి.. వీటన్నింటికి చాలా ధైర్యం, బలం కావాలి. కొండా సురేఖ గారూ, ఈ ప్రయాణం నన్ను మార్చినందుకు గర్వపడుతున్నాను. దయచేసి దీనిని చిన్నచూపు చూడకండి’’ అని సమంత అన్నారు .


దయచేసి నా పేరును రాజకీయాలకు దూరంగా ఉంచాలి...

‘‘ఒక మంత్రిగా మీ మాటకు చాలా వ్యాల్యూ ఉంటుందని మీరు గ్రహించాలని ఆశిస్తున్నాను. వ్యక్తుల గోప్యత పట్ల బాధ్యతగా, గౌరవంగా ఉండాలని నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను. నా విడాకులు వ్యక్తిగత విషయం, దాని గురించి ఊహాగానాలు చేయడం మానుకోవాలని నేను అభ్యర్థిస్తున్నాను. విషయాలను ప్రైవేట్‌గా ఉంచాలనే మా ఎంపిక తప్పుగా సూచించడాన్ని ఆహ్వానించను. నా విడాకులు పరస్పర అంగీకారం, సామరస్యపూర్వకంగా జరిగాయి. ఇందులో ఎటువంటి రాజకీయ కుట్రకు ప్రమేయం లేదు. దయచేసి నా పేరును రాజకీయ పోరాటాలకు దూరంగా ఉంచగలరా? నేను ఎప్పుడూ రాజకీయాలకు అతీతంగా ఉంటాను, అలానే కొనసాగించాలనుకుంటున్నాను..’’ అంటూ సమంత పోస్ట్‌లో పేర్కొంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం


ఈ వార్తలు కూడా చదవండి...

Konda Surekha: విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ.. దిగొచ్చిన కొండా సురేఖ.. ఏమన్నారంటే

Hyderabad: కేసీఆర్‌, కేటీఆర్‌పై పోలీసులకు ఫిర్యాదు

KTR: ఈ దొంగ ఏడుపులు దేనికి?

Sridhar Babu: హైదరాబాద్‌లో ఆర్‌ఎక్స్‌ బెనిఫిట్స్‌ గ్లోబల్‌ కేపబిలిటీ సెంటర్‌

Read Latest Telangana News and Telugu News

Updated Date - Oct 03 , 2024 | 12:32 PM