KTR: కేసీఆర్ అంటే నీళ్లు.. కాంగ్రెస్ అంటే కన్నీళ్లు..: కేటీఆర్
ABN, Publish Date - Apr 03 , 2024 | 12:26 PM
హైదరాబాద్: బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో తాగునీటి కష్టాలు లేవని.. కేసీఆర్ అంటే నీళ్లు.. కాంగ్రెస్ అంటే కన్నీళ్లని.. సాగునీరు లేక పల్లెలు, తాగు నీరు లేక పట్టణాలు తల్లడిల్లుతున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు.
హైదరాబాద్: బీఆర్ఎస్ ప్రభుత్వం (BRS Govt.) హయాంలో తాగునీటి కష్టాలు లేవని.. కేసీఆర్ (KCR) అంటే నీళ్లు.. కాంగ్రెస్ (Congress) అంటే కన్నీళ్లు అని.. సాగునీరు లేక పల్లెలు, తాగు నీరు లేక పట్టణాలు తల్లడిల్లుతున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ (BRS Working President), మాజీ మంత్రి కేటీఆర్ (Ex. Minster KTR) అన్నారు. ఈ సందర్బంగా బుధవారం ఆయన హైదరాబాద్‌నలో మీడియాతో మాట్లాడుతూ.. గొంతెండి ప్రజలు గొడవ చేస్తున్నారని, సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) మాత్రం గొంతు చించుకుని అబద్ధాలు చెబుతున్నారని విమర్శించారు. కేసీఆర్ జనగామ, నల్గొండ వెళ్లగానే గాయత్రి, నంది పంపు హౌజ్ ఎలా ప్రారంభం అయింది?.. ఇన్నాళ్లు ఆ నీటిని ఎందుకు దాచి పెట్టారు?.. పంటలు ఎండే పరిస్థితి ఎందుకు తెచ్చారు?.. కొట్టుకుపోయిందన్న కాళేశ్వరం నుంచి జల పరవళ్ళు ఎలా తొక్కాయి?.. ఇది కాలంతో వచ్చిన కరువు కాదని.. కాంగ్రెస్ తెచ్చిన కరువు అని అన్నారు.
ఓటు వేయలేదని హైదరాబాద్ ప్రజలపై సీఎం కక్ష కట్టారా? ఎందుకు హైదరాబాద్‌కు మంచి నీరు ఇవ్వడంలేదు?.. ట్యాంకర్‌లు ఎందుకు బుక్ చేసుకునే పరిస్థితి వచ్చింది? అని కేటీఆర్ ప్రశ్నించారు. హైదరాబాద్‌లో ఒక్క మార్చిలోనే 2 లక్షల 30 వేల ట్యాంకర్‌లు బుక్ చేసుకున్నారని, ఈ ట్యాంకర్‌లకు బిల్లులు ముఖ్యమంత్రి కడతారా? అని నిలదీశారు. ట్యాంకర్లను ఉచితంగా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నానన్నారు. కొండ పోచమ్మ, మల్లన్న సాగర్ నింపాలన్నారు. పాలన అనుభవం లేదని, నేర్చుకోవాలి అన్న జిజ్ఞాస కూడా లేదని విమర్శించారు. ఎవరు ఆత్మహత్యలు చేసుకుంటారో, ఎక్కడ పంటలు ఎండుతయో మేము చెబితే ఇక ప్రభుత్వం ఎందుకన్నారు. అయినా ఆత్మహత్యలు చేసుకున్న 218 రైతుల వివరాలు పంపిస్తామన్నారు. రేవంత్ రెడ్డి లీక్ వీరుడని.. ఫోన్ ట్యాపింగ్‌పై ఓపెన్‌గా మాట్లాడే దమ్ము లేదా? అని ప్రశ్నించారు.
హీరోయిన్‌లను బేదిరించాల్సిన కర్మ తనకు లేదని, తనపై మాట్లాడుతున్న మంత్రికి తలకాయ ఉందో లేదో తెలవదన్నారు. ఫోన్ ట్యాపింగ్‌లో అప్పటి అధికారులకు భాధ్యత లేదా? రవిగుప్తా, శివధర్ రెడ్డి, మహేందర్ రెడ్డి బాధ్యులు కాదా? ఒక్క కేసీఆర్ మాత్రమే బాధ్యుడా అని కేటీఆర్ ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్‌పై 2004 నుంచి విచారణ చేయాలని డిమాండ్ చేశారు. కడియం శ్రీహరి, దానం నాగేందర్ పదవులు ఊడటం గ్యారంటీ అని, స్టేషన్ ఘనపూర్, ఖైరతాబాద్‌లో ఉప ఎన్నికలు జరగడం ఖాయమని, పార్టీ మారిన వారిని మూడు మాసాల్లో డిస్ క్వాలీఫై చేయాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందన్నారు. స్పీకర్‌కు ఈ ఆదివారం వరకు సమయం ఇస్తున్నామని, ఈ లోపు తేల్చకపోతే హైకోర్టుకు వెళతామని కేటీఆర్ స్పష్టం చేశారు.
Updated Date - Apr 03 , 2024 | 12:30 PM