Kodandaram: బీఆర్ఎస్ నేతల ఆ కుట్రలను తిప్పికొట్టాలి
ABN, Publish Date - Feb 01 , 2024 | 10:10 PM
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని(Congress Govt) కూల్చాలన్న బీఆర్ఎస్ నేతల కుట్రలను ప్రజాస్వామ్యవాదులు తిప్పికొట్టాలని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం(Kodandaram) హెచ్చరించారు. డబ్బులతో బీఆర్ఎస్ రాజకీయాలను శాసించాలనుకుంటోందని ఆరోపించారు.
సంగారెడ్డి: కాంగ్రెస్ ప్రభుత్వాన్ని(Congress Govt) కూల్చాలన్న బీఆర్ఎస్ నేతల కుట్రలను ప్రజాస్వామ్యవాదులు తిప్పికొట్టాలని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం(Kodandaram) హెచ్చరించారు. గురువారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ... డబ్బులతో బీఆర్ఎస్ రాజకీయాలను శాసించాలనుకుంటోందని ఆరోపించారు. బీఆర్ఎస్ ఓడిపోయాక.. తెలంగాణ ప్రజలు స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకుంటున్నారని తెలిపారు. వాట్సాప్ ద్వారా కాకుండా ఇప్పుడు రెగ్యూలర్ ఫోన్ కాల్స్ మాట్లాడుకుంటున్నారన్నారు. బీఆర్ఎస్ ఓడాకే.. తెలంగాణ వచ్చిందన్నట్లు ఉందని ప్రజలు భావిస్తున్నారని తెలిపారు.
తెలంగాణ ఆవిర్భావ ఆకాంక్షలకు విరుద్ధంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవహరించిందని మండిపడ్డారు. ఆంధ్రా కాంట్రాక్టర్లతో కుమ్మక్కై తెలంగాణ వనరులను దోచుకున్నారని ధ్వజమెత్తారు. నియంతలకు మించిన నియంత కేసీఆర్‌ను పార్లమెంట్ ఎన్నికల్లో ఓడించాలని ప్రజలు నిర్ణయించుకున్నారని తెలిపారు. ప్రజాస్వామ్య పాలన రావాలనే ప్రజలు కాంగ్రెస్‌ను గెలిపించారని కోదండరాం తెలిపారు.
Updated Date - Feb 01 , 2024 | 10:10 PM