ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

TG Politics: ఆ లోగో మార్చాలి..కోదండరాం షాకింగ్ కామెంట్స్

ABN, Publish Date - May 30 , 2024 | 09:14 PM

తెలంగాణ ప్రభుత్వం ఆవిర్భావ వేడుకలు నిర్వహించడాన్ని తాము స్వాగతిస్తున్నామని జన సమితి అధ్యక్షుడు, ప్రోఫెసర్ కోదండ రాం (Kodandaram) తెలిపారు.మొట్ట మొదటి సారిగా తమను ఆవిర్భావంతో ఈ ప్రభుత్వం భాగస్వామ్యం చేస్తుందని చెప్పారు. గతంలో ఎప్పుడూ ఈ ఆహ్వానం దొరకలేదని అన్నారు.

Kodandaram

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ఆవిర్భావ వేడుకలు నిర్వహించడాన్ని తాము స్వాగతిస్తున్నామని జన సమితి అధ్యక్షుడు, ప్రోఫెసర్ కోదండ రాం (Kodandaram) తెలిపారు.మొట్ట మొదటి సారిగా తమను ఆవిర్భావంతో ఈ ప్రభుత్వం భాగస్వామ్యం చేస్తుందని చెప్పారు. గతంలో ఎప్పుడూ ఈ ఆహ్వానం దొరకలేదని అన్నారు.


గురువారం తెలంగాణ సచివాలయం మీడియా పాయింట్‌లో కోదండరాం మాట్లాడుతూ... తాము కోరుకున్న రాష్ట్ర గీతం, చిహ్నన్ని ప్రభుత్వం తీసుకువస్తుందని కొనియాడారు. జయ జయ హే తెలంగాణ పాట కొత్తగా రాసింది కాదని.. పాట రాసింది ఎవరు అనేది ముఖ్యం..పాడింది అనేది కాదన్నారు. చిహ్నంపై గత ప్రభుత్వం చర్చ జరిపి ఉంటే బాగుండేదన్నారు.


ఆ రోజు చిహ్నంపై అభ్యంతరాలు ఉన్నా ఏమి చేయలేని పరిస్థితి ఉందన్నారు. ప్రజల జీవన విధానం, సంకృతి ప్రతిభించించే విధంగా ఉండాలని చెప్పుకొచ్చారు. ఆనాడు మార్పులు చేర్పులు చేయాలని ఉన్నా జరగలేదన్నారు. లోగో మార్చితేనే బాగుంటుందని తన అభిప్రాయమని తెలిపారు. కట్టడాలు మాత్రమే చిహ్నం కాదని...కొత్త లోగోలో కూడా కట్టడాలు ఉంటాయని అనుకుంటున్నానని అన్నారు.ఛత్తీస్‌గడ్ లోగోలో కూడా కట్టడాలు ఉన్నాయన్నారు. ఉద్యమ కారుడు, మాజీ ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ను ప్రభుత్వం వేడుకలకు ఆహ్వానిస్తుందని కోదండరాం తెలిపారు.

Updated Date - May 30 , 2024 | 09:14 PM

Advertising
Advertising