TG Assembly: పదేళ్లు బీఆర్ఎస్ విధ్వంసం చేసింది: కోమటిరెడ్డి వెంకటరెడ్డి
ABN, Publish Date - Dec 18 , 2024 | 12:09 PM
హైదరాబాద్: బీఆర్ఎస్‌పై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. తెలంగాణలో పదేళ్లు బీఆర్ఎస్ పాలన విధ్వంసం చేసిందని, ఉప్పల్ ఫ్లై ఓవర్‌ను ఆరున్నర ఏళ్ళు అయినా పూర్తి చేయలేదని ఆరోపించారు.
హైదరాబాద్: బీఆర్ఎస్‌పై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Minister Komati Reddy) తీవ్రస్థాయిలో విమర్శలు (Comments) చేశారు. ఈ సందర్బంగా ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ.. తెలంగాణలో పదేళ్లు బీఆర్ఎస్ పాలన (BRS Govt.) విధ్వంసం (Destroying) చేసిందని, ఉప్పల్ ఫ్లై ఓవర్‌ను ఆరున్నర ఏళ్ళు అయినా పూర్తి చేయలేదని, ఏడు కిలోమీటర్లు పిల్లర్స్ లేసి స్లాబ్ వేయకుండా వదిలేశారని మంత్రి ఆరోపించారు. ఆనాడు పైసలు వచ్చే కాలేశ్వరం మీద తప్ప రోడ్లమీద బీఆర్ఎస్‌కు ధ్యాస లేదని విమర్శించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫామ్ హౌస్ కే అన్ని వైపుల నుంచి రూ. 700 కోట్లతో రోడ్లు వేసుకున్నారని విమర్శించారు.
విజయవాడ హైవేను సిక్స్ లైన్ రోడ్డుగా మార్చేందుకు డీపీఆర్ (DPR) సిద్ధమవుతోందని, అప్పుడు ప్రశాంత్ రెడ్డి మంత్రిగా పనిచేసి ఉంటే ఇప్పుడు మాకు పని ఉండేదా అని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రశ్నించారు. హరీష్ రావుకు దబాయించడం మాత్రమే తెలుసునని.. కూలిపోయే కాలేశ్వరం కట్టి కమిషన్ తీసుకోవడం తెలుసునని.. రూ. లక్ష కోట్లు విలువచేసే ఓఆర్ఆర్ (ORR)ను అమ్ముకున్నారని ఆరోపించారు. వచ్చే మార్చి నాటికి భూసేకరణ పూర్తి చేసి రీజినల్ రింగ్ రోడ్డు పనులు ప్రారంభిస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు.
సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ..
హైదరాబాద్ నుంచి బీజాపూర్ హైవే పనులు ఆగిపోయాయని దానిపై కోర్టు కేసు వికెట్ అయ్యిందా.. మంత్రి కోమటిరెడ్డి క్లారిటీ ఇవ్వాలని సబితా ఇంద్రారెడ్డి అన్నారు. అలాగే ఎప్పటినుంచి రోడ్డు పనులు ప్రారంభిస్తారో చెప్పాలని.. మంత్రికి అధికారులు తప్పుడు సమాచారం ఇస్తున్నారని సబితా ఇంద్రారెడ్డి అన్నారు.
సబితా ఇంద్రారెడ్డి వ్యాఖ్యలపై కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ.. పనులు ప్రారంభమయ్యాయని.. సభ్యులు వెళ్లి చూసుకోవచ్చునని చెప్పారు. ఒక్క మంచి పని చేయకుండా మమ్మల్ని విమర్శిస్తున్నారని, ఒకరోజు బేడీలు వేసుకుని అసెంబ్లీకి వస్తున్నారని.. బేడీలు పోలీసులు వేస్తారని మంత్రి కోమటిరెడ్డి ఎద్దేవా చేశారు.
చర్చకు సిద్ధం: హరీష్ రావు..
మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. మంత్రి చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయని, ఆ వ్యాఖ్యలను సభ రికార్డుల నుంచి తొలగించాలని కోరారు. తనపై చేసిన ఆరోపణలపై చర్చ పెడితే తాను సిద్ధమని అన్నారు. దీంతో మంత్రి శ్రీధర్‌బాబు జోక్యం చేసుకుని మాట్లాడుతూ..‘ సుద్దులు మాకు చెప్పడం కాదు వారి సహచర మంత్రికి కూడా చెప్పాలి.. వెంకట్ రెడ్డి కమీషన్ లిస్టు చదవమంటే నేను చదువుతాను’ అని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు.
రూ. పదివేల కోట్లు దోచుకున్న దొంగ..
మామ చాటు అల్లుడిగా రూ. పదివేల కోట్లు దోచుకున్న దొంగ హరీష్ రావు అని.. ఆ అవినీతిని మేము నిరూపిస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. తన రాజకీయ జీవితంలో అవినీతి మచ్చలేదని అన్నారు.
హరీష్ రావు హాట్ కామెంట్స్
మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలపై హరీష్ రావు హాట్ కామెంట్స్ చేశారు. కొంతమంది సభ్యులు డ్రింక్ చేసి సభకు వస్తున్నారని, సభలోకి వచ్చి ఏం మాట్లాడుతున్నారో వారికే తెలియడం లేదని అన్నారు. అసెంబ్లీ బయట డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు పెట్టాలని హరీష్ రావు అన్నారు.
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. హరీష్ రావు సమ సమాజం తలదించుకునేలా మాట్లాడారని, ఆయన మాట్లాడింది అభ్యంతరకరమైన పదమని అన్నారు. హరీష్ రావు సభకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
బీర్ల ఐలయ్య మాట్లాడుతూ.. హరీష్ రావుకు వారి మామ గుర్తుకు వచ్చినట్లు ఉందన్నారు. వారి మామ (కేసీఆర్) ఫామ్ హౌస్‌లో తాగి పడుకున్నారని, అందుకే సభకు రావడం లేదని అన్నారు. తెలంగాణ కోసం మంత్రి పదవి త్యాగం చేసిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గురించి మాట్లాడే అర్హత హరీష్ రావుకు లేదని బీర్ల ఐలయ్య అన్నారు.
హరీష్ రావు, బీర్ల ఐల్లయ్య మాట్లాడిన మాటలను రికార్డుల నుంచి తొలగిస్తున్నామని స్పీకర్ గడ్డం ప్రసాద్ ప్రకటించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
శిల్పా రవిపై రెచ్చి పోయిన పుష్పా ఫ్యాన్స్
హైదరాబాద్‌లో రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాలు..
నకరేకల్లు డబుల్ మర్డర్ కేసులో వీడిన మిస్టరీ
గౌతులచ్చన్న విగ్రహావిష్కరణలో వెలుగులోకి కొత్త నిజాలు
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated Date - Dec 18 , 2024 | 12:09 PM