KTR: తాగునీటి కష్టాలు కాంగ్రెస్ ప్రభుత్వం సృష్టించిన కృత్రిమ కొరత: కేటీఆర్
ABN, Publish Date - Apr 03 , 2024 | 11:06 AM
హైదరాబాద్: మంచినీళ్ల కోసం మహిళలు ఖాళీ బిందెలతో రోడ్లపై యుద్ధాలు చేస్తుంటే.. ముఖ్యమంత్రి లంకె బిందెలని చెప్పి మాట్లాడుతున్నారని.. అసమర్థ ప్రభుత్వం.. ముఖ్యమంత్రికి ధనవనరులను ఢిల్లీకి తరలించడంలో ఉన్న శ్రద్ధ.. జలవనరులను తరలించడంలో మాత్రం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు.
హైదరాబాద్: మంచినీళ్ల (Drinking Water) కోసం మహిళలు (Womens) ఖాళీ బిందెలతో రోడ్లపై యుద్ధాలు చేస్తుంటే.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) లంకె బిందెలని (Lanke Bindela) చెప్పి మాట్లాడుతున్నారని.. అసమర్థ ప్రభుత్వం.. ముఖ్యమంత్రికి ధనవనరులను ఢిల్లీ (Delhi)కి తరలించడంలో ఉన్న శ్రద్ధ.. జలవనరులను తరలించడంలో మాత్రం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ (BRS Working President), మాజీ మంత్రి కేటీఆర్ (Ex. Minster KTR) విమర్శించారు. ఈ సందర్భంగా బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పదేళ్ల తమ ప్రభుత్వంలో.. కేసీఆర్ (KCR) నాయత్వంలో తాగునీటి సమస్య లేకుండా చేశామన్నారు. మిషన్ భగీరథ (Mission Bhagiratha) నిర్వహణ కాంగ్రెస్ (Congress) ప్రభుత్వానికి తెలియదని, హైదరాబాద్‌లో పదేళ్లుగా తాగునీటి కష్టాలు లేవని ఆయన అన్నారు. ఇవాళ హైదరాబాద్‌లో ట్యాంకర్ల (Tankers) దందా జోరుగా నడుస్తోందన్నారు. నగరంలో మళ్లీ ఇన్వర్టర్లు, జనరేటర్లు వచ్చాయన్నారు. మారుమూల తండాల్లో తాగునీరు అందించిన ఘనత కేసీఆర్‌దేనన్నారు. ఎండాకాలం ఆరంభంలోనే తాగునీటి కష్టాలు మొదలయ్యాయని, తాగునీటి కష్టాలు కాంగ్రెస్ ప్రభుత్వం సృష్టించిన కృత్రిమ కొరత అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
Updated Date - Apr 03 , 2024 | 11:20 AM