ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

BRS: అధికారులను బలిపశువులను చేస్తున్నారు: కేటీఆర్

ABN, Publish Date - Dec 13 , 2024 | 10:07 AM

లగచర్ల విషయంలో రేవంత్ రెడ్డి తన కిరీటం పడిపోయినట్లు వ్యవహరిస్తున్నారని కల్వకుంట్ల తారక రామారావు విమర్శించారు. బేషజానికి పోకుండా లగచర్ల కేసులు ఎత్తేసి.. రైతులను విడుదల చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ (BRS Working President), మాజీ మంత్రి కేటీఆర్ (Ex Minister KTR) సోషల్ మీడియా (Social Media) ఎక్స్ (X) వేదికగా లగచర్ల ఘటనలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం (Revanth Reddy Govt.) తీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు (Comments) గుప్పించారు. ‘‘భూమి ఇయ్యను అన్నందుకు గిరిజన రైతులను జైలులో పెట్టడం ఒకేనట.. జైలులో వారిని చిత్రహింసలు పెట్టడం ఒకేనట.. వారి కుటుంబ సభ్యులను అర్ధరాత్రి ఇండ్ల మీద దాడి చేసి భయపెట్టడం, బెదిరించడం ఓకేనట.. నెల రోజులుగా వారికి చెయ్యని నేరానికి బెయిల్ కూడా రాకుండా అడ్డుపడటం ఒకేనట.. గుండె జబ్బుతో ఉన్న పేషెంటుకు బేడీలు వేయించటం కూడా ఒకేనట.. చేసే దరిద్రపు పనులు అన్ని రహస్యంగా చేయించి, ఇప్పుడు కెమెరాల ముందు దొరికిపోగానే అధికారులను బలిపశువులను చేస్తున్న రేవంత్ రెడ్డి, నీ నిజరూపం రాష్ట్రంలోని పేదలందరికి తెలిసిపోయింది.. ఇకనైనా క్షమాపణ చెప్పి కేసులు రద్దు చెయ్యి, రైతులను విడుదల చెయ్యి’’ అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.

కాగా లగచర్ల విషయంలో రేవంత్ రెడ్డి తన కిరీటం పడిపోయినట్లు వ్యవహరిస్తున్నారని కల్వకుంట్ల తారక రామారావు విమర్శించారు. బేషజానికి పోకుండా లగచర్ల కేసులు ఎత్తేసి.. రైతులను విడుదల చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఈగోకు పోవటంతో.. గిరిజన రైతుల ప్రాణాలకు మీదకొచ్చిందని అన్నారు. జైల్లో ఉన్న హీర్యానాయక్‌కు గుండెపోటు వస్తే.. కుటుంబ సభ్యులకు తెలియనీయకుండా ఉంచటం దారుణమని అన్నారు. గుండెపోటు వచ్చిన వ్యక్తిని అంబులెన్స్‌లో తీసుకురాకుండా.. బేడీలు వేసి ఆస్పత్రికి తీసుకురావటం అమాననీయమని చెప్పారు. తీవ్రవాదులకు మాత్రమే బేడీలు వేయాలన్న నిబంధన ఉందని.. రైతులకు కాదని ఆవేదన వ్యక్తం చేశారు. బేడీల అంశాన్ని గవర్నర్, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి పరిగణలోకి తీసుకోవాలని తెలిపారు.


ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ జోక్యం చేసుకుని .. కేసులు వాపస్ తీసుకునేలా రేవంత్‌రెడ్డిను మందలించాలని అన్నారు. లగచర్ల రైతులు జైల్లో మగ్గుంతుంటే.. రేవంత్ జైపూర్‌లో విందులు, వినోదాల్లో మునుగుతున్నారని ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి ప్రెస్టేజ్‌కి పోయి పట్నం నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేయించారని మండిపడ్డారు. అదానీ, అల్లుడు కోసం పేదల భూములను రేవంత్ రెడ్డి గుంజుకుంటున్నారని ఆరోపించారు.

రేవంత్ రెడ్డి అనే అహంకారితో గిరిజన, దళిత రైతులు నెల రోజుల నుంచి జైల్లో మగ్గుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. హీర్యానాయక్ , రాఘవేంద్ర, బసప్పకు అనే రైతుల ఆరోగ్యం క్షీణిస్తోందన్నారు. తనమీద దాడి జరగలేదని స్థానిక కలెక్టర్ హుందాగా వ్యవహరించారని చెప్పారు. రైతుల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని స్వయంగా కలెక్టర్ దాడి జరగలేదని చెబుతున్నారని అన్నారు. లగచర్ల రైతులను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం మానవీయకోణంలో నిర్ణయం తీసుకోవాలని కేటీఆర్ అన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం..

మహిళా హోంగార్డుపై హెడ్ కానిస్టేబుల్ దుశ్చర్య..

హైదరాబాద్ బేగంబజార్‌లో దారుణం..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Dec 13 , 2024 | 10:07 AM