BRS: సభ హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చాం: కేటీఆర్
ABN, Publish Date - Dec 16 , 2024 | 01:41 PM
ఆర్‌బీఐ నివేదిక ప్రకారం రూ. 3.89 లక్షల కోట్లు అని స్పస్టత ఇచ్చిందని.. గతంలో సీఎంపై తాము ఉల్లంఘనా నోటీసు ఇచ్చామని కేటీఆర్ తెలిపారు. గతంలో నాదెండ్ల మనోహర్ ఉల్లంఘన నోటీసు అడ్మిట్ చేశారన్నారు.ఈ ప్రభుత్వం ఆర్ధిక విషయాల్లో ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని, ప్రజలకు స్పష్టత ఇవ్వాలని తాము కోరుతున్నామని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
హైదరాబాద్: శాసనసభను (Assembly) తప్పుదోవ పట్టిస్తున్నారని తాము సభ హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ (BRS Working President), మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామావు (Ex Minister KTR) తెలిపారు. సోమవారం ఆయన అసెంబ్లీ లాబీ వద్ద మీడియాతో చిట్ చాట్‌గా మాట్లాడారు. గతంలో సీఎం కిరణ్ కుమార్ రెడ్డిపై ఉల్లంఘన నోటీసు ఇస్తే చర్చకు వచ్చిందన్నారు. ప్రోటోకాల్ సమస్యలను స్పీకర్‌కు వివరించామని, లగచర్లపై చర్చకు తాము సభాపతిని అడిగామని.. బీఏసీలో కూడా ఈ అంశాన్ని లెవనెత్తుతామని చెప్పారు.
ఆర్‌బీఐ నివేదిక ప్రకారం రూ. 3.89 లక్షల కోట్లు అని స్పస్టత ఇచ్చిందని.. గతంలో సీఎంపై తాము ఉల్లంఘనా నోటీసు ఇచ్చామని కేటీఆర్ తెలిపారు. గతంలో నాదెండ్ల మనోహర్ ఉల్లంఘన నోటీసు అడ్మిట్ చేశారన్నారు.ఈ ప్రభుత్వం ఆర్ధిక విషయాల్లో ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని, ప్రజలకు స్పష్టత ఇవ్వాలని తాము కోరుతున్నామని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
కాగా కేటీఆర్ సోషల్ మీడియా ఎక్స్ వేదికగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కామెంట్స్ చేశారు. ‘‘ప్చ్.. కష్టం రేవంత్ రెడ్డి.. కేసీఆర్ ఆనవాళ్లను చేరిపేయడం నీ తరం కాదు..ఆయన నిర్మించిన ఇళ్ళకు సున్నాలు వేసి.. ఇందిరమ్మ ఇళ్లని ప్రజల కళ్లకు గంతలు కట్టలేవు.. గోసపడ్డ ప్రతి గుండెకు తెలుసు.. ప్రజల సొంతింటి కల నెరవేర్చేందుకు ఆయన పడ్డ తపన ప్రతి పేదవాడికి డబుల్ బెడ్ రూమ్ ఇల్లు…కేసీఆర్ కల.. ఎన్నాళ్లున్నా ఆ నిర్మాణాలకు మీరు కేవలం పెయింటర్లు మాత్రమే. ఎప్పటికీ మీరంతా సున్నాల వేసే సన్నాసి బ్యాచ్ మాత్రమే..’’ అంటూ కేటీఆర్ పేర్కొన్నారు.
నువ్వు జైలు జీవితం అనుభవించావని అందర్నీ జైలుకు పంపుతావా..
కాగా ‘బ్యాగు నిండా నోట్ల కట్టలతో పట్టుబడి జైలు జీవితం అనుభవించిన నీలాగే.. అందర్నీ జైలుకు పంపాలని అనుకుంటున్నావా రేవంత్ రెడ్డీ’ అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. తమ సంస్థ కార్యకలాపాల గురించి, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించిన పథకం ప్రభావాన్ని చెప్పినందుకు ఎల్ అండ్ టీ సీనియర్ ఎగ్జిక్యూటివ్‌ను జైలుకు పంపిస్తాననడం సీఎం స్థాయి వ్యక్తికి తగదని విమర్శించారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టిన సంస్థల అధిపతులను జైలుకు పంపుతానని రేవంత్ రెడ్డి బెదిరింపులకు పాల్పడుతున్నారని, ఇది సరైంది కాదని కేటీఆర్ ఆదివారం ‘ఎక్స్’ వేదికగా పేర్కొన్నారు. ఈ విషయంలో సీఎం చేసిన వ్యాఖ్యలు దిగజారుతున్న ఆయన మానసిక స్థితిని తెలియజేస్తున్నాయని వ్యాఖ్యానించారు. ‘ఇలాంటి నిర్లక్ష్య వ్యాఖ్యలతో పరిశ్రమలకు ఏ సందేశం పంపుతున్నారు? ఇదేనా రాహుల్ గాంధీ దేశంలో పెట్టుబడులను ఆకర్షించడానికి తమ పార్టీ ముఖ్యమంత్రులకు నేర్పించిన గొప్ప వ్యూహం?’ అని నిలదీశారు.
కేసీఆర్ పదేళ్ల పాలనలో పురోగమించిన తెలంగాణ... అనుభవరాహిత్యం, అసమర్థత, అవినీతి కలగలసిన రేవంత్ రెడ్డి పాలనలో అన్ని రంగాల్లో తిరోగమిస్తోందని ఆరోపించారు. రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి రవాణా శాఖ ఆదాయం ఒక ముఖ్యమైన సూచీ అని, ప్రజల ఆర్థిక పరిస్థితులు బాగుంటే బైకులు, కార్లే కాకుండా.. ఇతర భారీ వాహనాల అమ్మకాలు, రిజిస్ట్రేషన్లు వృద్ధిని చూపిస్తాయన్నారు. కానీ రాష్ట్రంలో రిజిస్ట్రేషన్లు తగ్గి, ఆదాయం తిరోగమనంలో ఉందన్నారు. పొరుగున ఉన్న అయిదు రాష్ట్రాల్లో ఈ ఏడాది రవాణా శాఖ ఆదాయంలో 8 శాతం నుంచి 32 శాతం వృద్ధి నమోదైతే... తెలంగాణలో గత ఏడాది కంటే తక్కువగా ఉండడం విఫల ప్రభుత్వ పనితీరుకు అద్దం పడుతోందన్నారు. పాలన గాలికొదిలేసి కక్ష సాధింపు చర్యలకే పూర్తి సమయం కేటాయిస్తే ఫలితాలు ఇలాకాక మరెలా ఉంటాయని కేటీఆర్ విమర్శించారు. కాగా, టీపీసీసీ అధ్యక్షుడు ప్రశ్నించాల్సింది మాజీ సీఎం కేసీఆర్‌ను కాదని, సీఎం రేవంత్‌రెడ్డి తప్పిదాలపై నిలదీయాలని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద పేర్కొన్నారు. ఆదివారం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ రేవంత్ రెడ్డికి రాసిన లేఖను కేసీఆర్‌కు పంపారనే అనుమానం కలుగుతోందన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
r. NTR: ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవాలు..
KC రెడ్డి ఫార్మసీ కాలేజీలో దారుణం..
జగన్ నిర్వాకం.. రైతుల కష్టాలు..
ABN Live..: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated Date - Dec 16 , 2024 | 01:41 PM