ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

KTR: తెలంగాణ అధికారిక చిహ్నం మార్పుపై కేటీఆర్ ఫైర్..

ABN, Publish Date - May 28 , 2024 | 05:59 PM

తెలంగాణ అధికారిక చిహ్నంపై రాష్ట్ర ప్రభుత్వం మార్పులు చేయడంపై ఎమ్మెల్యే, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. తెలంగాణ ఖ్యాతికి నిదర్శనమైన చార్మినార్, రామప్ప దేవాలయం, కాకతీయ తోరణంను రాష్ట్ర చిహ్నం నుంచి తొలగించడంపై ఆయన నిప్పులు చెరిగారు.

KTR

Hyderabad: తెలంగాణ అధికారిక చిహ్నంపై రాష్ట్ర ప్రభుత్వం మార్పులు చేయడంపై ఎమ్మెల్యే, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. తెలంగాణ ఖ్యాతికి నిదర్శనమైన చార్మినార్, రామప్ప దేవాలయం, కాకతీయ తోరణంను రాష్ట్ర చిహ్నం నుంచి తొలగించడంపై ఆయన నిప్పులు చెరిగారు. రాచరికపు గుర్తులు ఉన్నాయంటూ తొలగించారని, కానీ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లోనూ ఇలాంటి చిహ్నాలు ఉన్నాయన్నారు. వాటినీ తొలగిస్తారా? అంటూ సీఎం రేవంత్ రెడ్డిని కేటీఆర్ ప్రశ్నించారు.


సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ వరుస ప్రశ్నలు..

సీఎం రేవంత్ రెడ్డిది రెండు నాలుకలు వైఖరి అని, ఆయన మూర్ఖపు ఆలోచనలకు చిహ్నాల తొలగింపే నిదర్శమన్నారు. మీకు కాకతీయ కళాతోరణం, చార్మినార్ చిహ్నాలు అంటే ఎందుకంత కోపమని ప్రశ్నించారు. అవి రాచరికపు గుర్తులు కాదని, వెయ్యేళ్ల సాంస్కృతిక వైభవానికి చిహ్నాలన్నారు. వెలకట్టలేని తెలంగాణ అస్తిత్వానికి నిలువెత్తు ప్రతీకలు నిలిచాయన్నారు. కాకతీయ కళాప్రభల కాంతిరేఖ 'రామప్ప', గోల్కొండ నవాబుల గొప్ప వెలుగే 'చార్మినార్' అంటూ జయజయహే తెలంగాణ అధికారిక గీతంలో కీర్తించి, చిహ్నంలో మాత్రం అవమానిస్తారా? అంటూ ధ్వజమెత్తారు. "చార్మినార్ అంటే ఒక కట్టడం కాదు.. విశ్వనగరంగా ఎదిగిన హైదరాబాద్‌కు ఐకాన్, కాకతీయ కళాతోరణం ఒక నిర్మాణం కాదు.. సిరిసంపదలతో వెలుగొందిన తెలంగాణ నేలకు నిలువెత్తు సంతకం" అని కేటీఆర్ కొనియాడారు. తెలంగాణ అధికారిక చిహ్నం నుంచి వీటిని తొలగించడం అంటే రాష్ట్ర చరిత్రను చెరిపేయడం, నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల గుండెలను గాయపరచడమే అన్నారు.


కాంగ్రెస్ పాలిత రాష్ట్రం కర్ణాటక అధికారిక చిహ్నంలోనూ రాచరికపు గుర్తులున్నాయి, వాటినీ తొలగిస్తారా? భారత జాతీయ చిహ్నంలోనూ అశోకుడి స్థూపం నుంచి స్వీకరించిన మూడు సింహాలున్నాయి. జాతీయ పతాకంలోనూ దశాబ్దాలుగా ధర్మచక్రం ఉంది. వాటిపై మీ వైఖరేంటో చెప్పాలని డిమాండ్ చేశారు. కాకతీయుల కాలంలో నిర్మించిన చెరువులనూ పూడ్చేస్తారా?, ఒకప్పుడు రాచరికానికి చిహ్నంగా ఉన్న అసెంబ్లీనీ కూల్చేస్తారా? అంటూ మండిపడ్డారు. ఇవాళ తెలంగాణ గుర్తులు మారుస్తామంటున్నారు.. రేపు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ సరిహద్దులూ చెరిపేస్తారా?. పదేళ్లుగా ప్రభుత్వ అధికారిక చిహ్నంపై యావత్ తెలంగాణ సమాజం ఆమోద ముద్ర ఉంది. సబ్బండ వర్ణాల మనసు గెలుచుకున్న సంతకమూ ఉంది. రాజకీయ ఆనవాళ్లను తొలగించాలన్న కక్షతో రాష్ట్ర అధికారిక చిహ్నాన్ని చెరిపేస్తే సహించమన్నారు. పౌరుషానికి ప్రతీకైన ఓరుగల్లు సాక్షిగా మీ సంకుచిత నిర్ణయాలకు వ్యతిరేకంగా తెలంగాణ సమాజాన్ని ఏకం చేసి ప్రజా ఉద్యమాన్ని నిర్మిస్తామని కేటీఆర్ హెచ్చరించారు.

ఇది కూడా చదవండి:

Crime News: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం.. చిన్నారుల అమ్మకాల గుట్టురట్టు..

Updated Date - May 28 , 2024 | 05:59 PM

Advertising
Advertising