Kunamneni: తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తితో సీపీఐని బలోపేతం చేస్తాం

ABN, Publish Date - Aug 22 , 2024 | 02:26 PM

బీఆర్ఎస్ సృష్టించిన సంకోభం నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం బయట పడలేక పోతుందని తెలంగాణ కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబ శివరావు అన్నారు. సీపీఐ తెలంగాణ రాష్ట్ర నిర్మాణ కౌన్సిల్ సమావేశాలు గురువారం నాడు నిర్వహించారు.

Kunamneni: తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తితో సీపీఐని బలోపేతం చేస్తాం

హనుమకొండ: బీఆర్ఎస్ సృష్టించిన సంకోభం నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం బయట పడలేక పోతుందని తెలంగాణ కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబ శివరావు అన్నారు. సీపీఐ తెలంగాణ రాష్ట్ర నిర్మాణ కౌన్సిల్ సమావేశాలు గురువారం నాడు నిర్వహించారు. ఈ సమావేశాలకు సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా, జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబ శివరావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తక్కళ్లపెల్లి శ్రీనివాస్ హాజరయ్యారు.


ఈ సందర్భంగా కూనంనేని సాంబ శివరావు మాట్లాడుతూ.. చైతన్య వంతంగా పార్టీని బలోపేతం చేయడానికి కౌన్సిల్ సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. డిసెంబర్ 25 నాటికి సీపీఐ వందేళ్లు పూర్తి చేసుకుంటుందని అన్నారు. బీఆర్ఎస్ సృష్టించిన సంకోభం నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం బయట పడలేక పోతుందని అన్నారు.


రుణమాఫీ వందశాతం అమలు కాలేదని ప్రజల నుంచి వినిపిస్తుందని చెప్పారు. ప్రజా వ్యతిరేకతను మూటకట్టుకోవద్దని కోరుకుంటున్నామని అన్నారు. బీఆర్‌ఎస్ పని అయిపోయిందని విమర్శించారు. బీజేపీని నిలువరించడంతో పాటు సీపీఐ బలోపేతం కోసం కృషి చేస్తున్నట్లు తెలిపారు. ప్రజల ఆకాంక్ష మేరకు పాలనా సాగని పక్షంలో పోరాటం చేస్తామని అన్నారు.

Updated Date - Aug 22 , 2024 | 02:35 PM

Advertising
Advertising
<