TG NEWS: నకిలీ పత్రాలతో ల్యాండ్ కబ్జా... పోలీసుల అదుపులో సికింద్రాబాద్ సబ్ రిజిస్టర్
ABN, Publish Date - Oct 29 , 2024 | 03:21 PM
నకిలీ పత్రాలతో భూమిని రిజిస్ట్రేషన్ చేసిన సబ్ రిజిస్టర్ కటకటాల పాలయ్యారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆ పార్టీ నేతలు చెప్పినట్లుగా నడుచుకున్నందుకు గానూ సికింద్రాబాద్ సబ్ రిజిస్టర్ జ్యోతి ఇప్పుడు జైలు పాలయ్యారు. పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నారు. ఈ విచారణలో పలు కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే ఇదే కేసులో బీఆర్ఎస్ నేత పద్మాజా రెడ్డి జైలు పాలయ్యారు. ఈ కేసును సమగ్రంగా పోలీసులు విచారణ జరుపుతున్నారు.
హైదరాబాద్: సికింద్రాబాద్ సబ్ రిజిస్టర్ జ్యోతిని జీడిమెట్ల పోలీసులు అరెస్టు చేశారు. మేడ్చల్ కోర్టులో పోలీసులు ఇవాళ(మంగళవారం) హాజరుపరిచారు. సబ్ రిజిస్ట్రార్ జ్యోతికి 14 రోజుల పాటు మేడ్చల్ కోర్ట్ రిమాండ్ విధించింది. సుభాష్ నగర్‌లో 200 గజాల స్థలాన్ని నకిలీ పత్రాలతో బీఆర్ఎస్ నేత పద్మాజా రెడ్డి కబ్జా చేసింది. బీఆర్ఎస్ హయాంలో కుత్బుల్లాపూర్ సబ్ రిజిస్టర్‌గా జ్యోతి పనిచేసింది. నకిలీ పత్రాలతో ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేయడానికి పద్మజా రెడ్డికి సబ్ రిజిస్టర్ జ్యోతి సహకరించింది. కాగా ఇదే కేసులో ఇటీవల పద్మజా రెడ్డిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు పోలీసులు తరలించారు. తాజాగా ఈ కేసులో సికింద్రాబాద్ సబ్ రిజిస్టార్ జ్యోతిని పోలీసులు అరెస్ట్ చేసి ముమ్మరంగా దర్యాప్తు జరుపుతున్నారు.
కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పేరిట భారీ మోసం...
మరో సంఘటనలో.. కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పేరిట భారీ మోసానికి పాల్పడ్డారు. 15 మందికి డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పేరిట వేణుగోపాల్ దాస్ అనే కేటుగాడు కుచ్చు టోపీ పెట్టాడు. కేపీహెచ్‌బీ కాలనీలో 15 మంది బాధితులను నిందితుడు మోసం చేశాడు. ఒక్కొక్కరి దగ్గర నుంచి లక్షన్నర రూపాయల నుంచి రెండున్నర లక్షల రూపాయల దాకా నిందితుడు వేణుగోపాల్ బాధితుల దగ్గరి నుంచి వసూలు చేశాడు.
నకిలీ పత్రాలు, ఇళ్లకు సంబంధించిన నకిలీ తాళాలు బాధితులకు ఇచ్చి నిందితుడు బోల్తా కొట్టించాడు. తాళాలతో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల వద్దకు వెళ్లిన బాధితులకు భారీ షాక్ తగిలింది. అసలైన లబ్ధిదారులు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల దగ్గర ఉండటంతో బాధితులు విస్తుపోయారు. మోసపోయామని తెలుసుకొని లబోదిబోమంటూ కేపీహెచ్‌బీ పోలీసులను బాధితులు ఆశ్రయించారు. తమకు న్యాయం చేయాలని పోలీసులకు బాధితులు పిర్యాదు చేశారు. నిందితుడు వేణుగోపాల్‌ను వెంటనే అరెస్ట్ చేసి ఈ కేసును ముమ్మరంగా దర్యాప్తు జరిపించాలని బాధితులు పోలీసులను వేడుకున్నారు.
ఇవి కూడా చదవండి...
Harish Rao: ఇదీ.. తెలంగాణలో కాంగ్రెస్ తెచ్చిన అసలైన ‘మార్పు’
Babumohan: టీడీపీ గూటికి బాబుమోహన్
Read Latest Telangana News And Telugu News
Updated Date - Oct 29 , 2024 | 03:33 PM