TG Police: పొగొట్టుకున్న మొబైల్స్ అందజేసిన లంగర్ హౌస్ పోలీసులు
ABN, Publish Date - Jul 06 , 2024 | 08:01 PM
లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలో చరవాణిలను పోగొట్టుకున్న వారికి లంగర్ హౌస్ పోలీసులు తిరిగి అప్పగించారు.
హైదరాబాద్: లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలో చరవాణిలను పోగొట్టుకున్న వారికి లంగర్ హౌస్ పోలీసులు తిరిగి అప్పగించారు. సౌత్ వెస్ట్ జోన్ డీసీపీ ఉదయ్ కుమార్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలో వివిధ సమయాల్లో వివిధ ప్రాంతాల్లో పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను వెతికి 45 మందికి తిరిగి సెల్ ఫోన్లను అందించినట్లు తెలిపారు.
అధునాతన టెక్నాలజీలతో ఈ ఫోన్లను రికవరీ చేసినట్లు డీసీపీ ఉదయ్ కుమార్ తెలిపారు. ఎవరైనా తమ చరవాణిలను పోగొట్టుకుంటే వెంటనే పోలీస్ స్టేషన్కు వచ్చి ఫిర్యాదు చేస్తే తిరిగి వారి మొబైళ్లను వారికి అప్పగిస్తామని ఆయన అన్నారు. ప్రజలను సెకండ్ హ్యాండ్లో తక్కువ రేటుకు ఎవరైనా రోడ్ల పైన ఫోన్లు అమ్ముతుంటే వాటిని కొనవద్దని ఆయన ప్రజలకు డీసీపీ ఉదయ్ కుమార్ రెడ్డి సూచించారు.
Updated Date - Jul 06 , 2024 | 08:01 PM