ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: వారిపై పోలీసులు అసభ్యకరంగా దాడి చేశారంటూ ఎన్‌హెచ్‌ఆర్‌సీకి ఫిర్యాదు..

ABN, Publish Date - Dec 09 , 2024 | 06:46 PM

హైదరాబాద్ కోఠిలోని డీఎంఈ కార్యాల‌యం వద్ద ఆశావర్కర్లపై పోలీసులు అసభ్యకరంగా ప్రవర్తించారంటూ జాతీయ మానవ హక్కుల కమిషన్‌(NHRC)కి ఫిర్యాదు అందింది. సుల్తాన్ బజార్ ఏసీపీ కె.శంకర్, సీఐ శ్రీనివాస్ చారిలపై ఎన్‌హెచ్‌ఆర్‌సీకి ప్రముఖ న్యాయవాది ఇమ్మినేని రామారావు ఫిర్యాదు చేశారు.

హైదరాబాద్: కోఠిలోని డీఎంఈ కార్యాల‌యం వద్ద ఆశావర్కర్లపై పోలీసులు అసభ్యకరంగా ప్రవర్తించారంటూ జాతీయ మానవ హక్కుల కమిషన్‌ (NHRC)కి ఫిర్యాదు అందింది. సుల్తాన్ బజార్ ఏసీపీ కె.శంకర్, సీఐ శ్రీనివాస్ చారిలపై ఎన్‌హెచ్‌ఆర్‌సీకి ప్రముఖ న్యాయవాది ఇమ్మినేని రామారావు ఫిర్యాదు చేశారు. జీతాలు పెంచాలంటూ నిరసన చేస్తున్న ఆశా కార్యకర్తలపై పోలీసులు పరిధి దాటి వ్యవహరించారంటూ ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. మహిళలపై అసభ్యకరంగా భౌతిక దాడి చేసి దారుణంగా కొట్టారని ఎన్‌హెచ్‌ఆర్‌సీ దృష్టికి తీసుకెళ్లారు. బాధ్యులైన పోలీసులపై చర్యలు తీసుకోవాలని న్యాయవాది రామారావు విజ్ఞప్తి చేశారు.


కాగా, తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల వేళ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు రూ. 18 వేలు ఫిక్స్‌డ్ జీతం ఇవ్వాల‌ని ఆశా కార్యకర్తలు ఇవాళ (సోమవారం) హైదరాబాద్ కోఠి డీఎంఈ కార్యాల‌యం వ‌ద్ద ఆందోళనకు దిగారు. ఈ నిరసన కాస్త తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నిరసన చేపట్టారు ఆశా కార్యకర్తలు. ఈ నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించారు. ఆందోళనకారులను నిలువరించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అనంతరం పెద్దఎత్తున తోపులాట జరిగింది. దీంతో ఇద్దరు కార్యకర్తలు సొమ్మసిల్లి పడిపోయారు. వారిని హుటాహుటిన ఉస్మానియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే సుల్తాన్ బ‌జార్ ఏసీపీ శంక‌ర్, సీఐ శ్రీనివాసాచారి తమ పట్ల అసభ్యంగా ప్రవర్తించారంటూ ఆశా వర్కర్ల ఆరోపించారు.


ఉస్మానియాలో చికిత్సపొందుతున్న బాధితులను బీఆర్ఎస్ మాజీ మంత్రులు గంగుల క‌మ‌లాక‌ర్, సత్యవతి రాథోడ్, పలువురు నేతలు ప‌రామ‌ర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని కోరారు. ఆశా కార్యకర్తలపై పోలీసుల దురుసు ప్రవర్తనను బీఆర్ఎస్ నేతలు ఖండించారు. బాధ్యులైన ఏసీపీ శంకర్, సీఐ శ్రీనివాస్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలోనే ఎన్‌హెచ్‌ఆర్‌సీని న్యాయవాది రామారావు ఆశ్రయించారు.

Updated Date - Dec 09 , 2024 | 07:46 PM