Big Alert: ఓటర్లకు బిగ్ అలర్ట్.. 15వ తేదీలోగా ఆ పని కంప్లీట్ చేయండి..!
ABN , Publish Date - Apr 05 , 2024 | 01:50 PM
ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో ఎన్నికల అధికారులు కీలక ప్రకటన చేశారు. పోస్టల్ బ్యాలెట్(Postal Ballot) కోసం ఏప్రిల్ 15వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని హైదరాబాద్(Hyderabad) పార్లమెంట్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఉద్యోగులకు సూచించారు. జీహెచ్‌ఎంసీ(GHMC) కార్యాలయంలోని పన్వార్ హాల్‌లో ఎసెన్షియల్ సర్వీసెస్..
హైదరాబాద్, ఏప్రిల్ 05: ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో ఎన్నికల అధికారులు కీలక ప్రకటన చేశారు. పోస్టల్ బ్యాలెట్(Postal Ballot) కోసం ఏప్రిల్ 15వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని హైదరాబాద్(Hyderabad) పార్లమెంట్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఉద్యోగులకు సూచించారు. జీహెచ్‌ఎంసీ(GHMC) కార్యాలయంలోని పన్వార్ హాల్‌లో ఎసెన్షియల్ సర్వీసెస్ (AVES) హెచ్‌ఓడీలతో పోస్టల్ బ్యాలెట్‌పై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఇండియన్ రైల్వేస్, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, దూరదర్శన్, ఆలిండియా రేడియో, విద్యుత్‌శాఖ, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమశాఖ, రాష్ట్ర రవాణా సంస్థ, ఆహారం, పౌరసరఫరాలశాఖ, ఎస్‌ఎన్‌ఎల్, అగ్నిమాపక సేవ ఉద్యోగులు, పోల్ డే కవరేజ్ కోసం ఈసీఐ ద్వారా అధికారం పొందిన మీడియా వ్యక్తులకు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకునే సౌకర్యం కల్పించినట్లు చెప్పారు. ఉద్యోగులు ఫారం-12డి నింపి సంబంధిత నోడల్ అధికారుల ద్వారా దరఖాస్తు చేసుకోవాలని, వాటిని ఏప్రిల్ 15లోగా సమర్పించాలన్నారు.
ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా సహకరించాలి..
పార్లమెంట్ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా రాజకీయ పార్టీల నాయకులు సహకరించాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో గురువారం వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఏఆర్‌ఓలతో నిర్వహించిన సమావేశంలో అయన మాట్లాడారు. ఏప్రిల్ 18 నుంచి 25 వరకు కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో హైదరాబాద్ లోక్‌సభ నియోజకవర్గానికి సంబంధించిన నామినేషన్లను స్వీకరిస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల ప్రవర్తనా నియామావళిని ఉల్లంఘిస్తే ప్రజాప్రాతినిధ్య చట్టం 1951 ప్రకారం చర్యలు తీసుకునే అవకాశం ఉందన్నారు.
ఇవికూడా చదవండి:
విజయవాడ రిటైనింగ్ వాల్‌పై అసలు వాస్తవాలు ఇవే.. బయటపెట్టిన టీడీపీ
ఇలా ఉన్నారేంట్రా బాబూ.. డబ్బులు కొట్టేసేందుకు ఏం చేశారో తెలుసా?