ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Youtuber Harsha Sai: హర్ష సాయి.. ఇక తప్పించుకోలేడు

ABN, Publish Date - Oct 05 , 2024 | 12:12 PM

ప్రముఖ యూట్యూబర్ హర్ష సాయి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. హర్ష సాయిపై లైంగిక ఆరోపణలు రావడంతో పోలీసులు కఠిన చర్యలు తీసుకున్నారు. ఇందులో భాగంగానే హర్ష సాయికి లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు.

Youtuber Harsha Sai

హైదరాబాద్: ప్రముఖ యూట్యూబర్ హర్ష సాయి (Youtuber Harsha Sai ) కేసులో నార్సింగ్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. అతను విదేశాలకు పారిపోకుండా లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు నార్సింగి పోలీసులు. హర్షసాయి విదేశాలకు పారిపోయేందుకు ప్రయత్నిస్తున్నాడంటూ బాధితురాలు ఇటీవల సైబరాబాద్ సీపీకి ఫిర్యాదు చేసింది. ఇప్పటికే ఆయనపై పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. హర్ష సాయిపై లైంగిక ఆరోపణలు రావడంతో పోలీసులు ఈచర్యలు చేపట్టారు. ‘‘ మెగా’’ సినిమా కాపీ రైట్స్ కోసం తనపై లైంగిక దాడికి పాల్పడ్డారని బాధితురాలు ఫిర్యాదు చేసింది. దీంతో అప్పటి నుంచి పరారీలో హర్ష సాయి ఉన్నాడు. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు.


కీలక ట్విస్ట్..

హర్ష సాయి కేసులో కీలక ట్విస్ట్ బయటపడింది. ‘‘ మెగా’’ సినిమాకు సంబంధించిన కాపీ రైట్స్ కోసం హర్ష సాయి ప్రయత్నించినట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు బాధితురాలు ప్రొడ్యూసర్‌గా వ్యవహరించగా.. కాపీ రైట్స్ విషయంపై ఇద్దరి మధ్య వివాదం నెలకొన్నట్లు సమాచారం. ఈ క్రమంలో బాధితురాలికి మత్తు మందు ఇచ్చి హర్ష సాయి అఘాయిత్యానికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. బాధితురాలి వీడియోలు హర్ష సాయి సీక్రెట్‌గా రికార్డు చేసినట్లు సమాచారం. మూవీ కాపీ రైట్స్ ఇవ్వకుంటే వీడియోలు బయట పెడతానని హర్ష సాయి బ్లాక్ మెయిల్‌కు పాల్పడినట్లు సమాచారం.


నార్సింగ్ పోలీస్‌స్టేషన్‌‌లో యువతి ఫిర్యాదు...

కాగా.. ఈ విషయంపైహర్షసాయిపై కేసు నమోదైంది. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి హర్ష మోసం చేశాడని ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అడ్వకేట్‌తో కలిసి నార్సింగ్ పోలీస్‌స్టేషన్‌కు వచ్చి మరీ యువతి ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు యూట్యూబర్‌పై కేసు నమోదు చేశారు. బాధితురాలి నుంచి నార్సింగ్ పోలీసులు కొన్ని ఆధారాలను సేకరించారు. మరికొన్ని ఆధారాలను సమర్పించాలని బాధితురాలిని పోలీసులు కోరారు. హర్షసాయి నుంచి, ఆయన ఫాలోవర్స్ నుంచి ప్రాణహాని ఉందంటూ బాధితురాలు చెప్పింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి తన వద్ద నుంచి రూ. 2 కోట్లు తీసుకున్నాడని ఫిర్యాదులో తెలిపింది.


బ్లాక్‌మెయిల్..

ప్రేమ, పెళ్లి పేరుతో లొంగదీసుకుని నగ్న వీడియోలు, నగ్న చిత్రాలను పెట్టుకుని బ్లాక్‌మెయిల్ చేశారని.. పలుమార్లు తనపైన అత్యాచారం చేశాడంటూ బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. అలాగే దాడి కూడా చేశాడని ఆమె వాపోయింది. కేసు నమోదు చేసిన పోలీసులు హర్ష సాయి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. యూట్యూబర్‌పై 328, 376(2)(n)354(B)(C) సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. హర్ష సాయితో పాటు ఆయన తండ్రి రాధాకృష్ణపై కూడా కేసు నమోదు చేశారు. అయితే హర్ష సాయి తండ్రి రాధాకృష్ణ కూడా అందుబాటులో లేకుండా పోయారు. వీరి కోసం పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు.


ఈ వార్తలు కూడా చదవండి...

Hyderabad: రాజేంద్రప్రసాద్ ఇంట విషాదం.. గుండెపోటుతో..

KBR Park: 7 వంతెనలు.. 7 సొరంగ మార్గాలు

Harish Rao,: దసరా తర్వాత ఢిల్లీలో ధర్నా

నా కుమారుల ఫామ్‌హౌ్‌సలు ఎక్కడున్నాయో చూపించాలి?

Read Latest Telangana News and National News

Updated Date - Oct 05 , 2024 | 01:02 PM