Malla Reddy: లంకె బిందెలు ఉంటే పంచుకుందామని కాంగ్రెస్ నాయకులు వచ్చారు
ABN , Publish Date - Feb 02 , 2024 | 02:03 PM
హైదరాబాద్: 30 ఏళ్ల నుంచి ఎంతో మంది లీడర్లను చూడవచ్చు కానీ తనలాంటి నాయకుణ్ణి చూడలేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లారెడ్డి అన్నారు. శుక్రవారం ఘట్కేసర్ మండలం, చౌదరి గూడలో మేడ్చల్ కృతజ్ఞత సభ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ..
హైదరాబాద్: 30 ఏళ్ల నుంచి ఎంతో మంది లీడర్లను చూడవచ్చు కానీ తనలాంటి నాయకుణ్ణి చూడలేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లారెడ్డి అన్నారు. శుక్రవారం ఘట్కేసర్ మండలం, చౌదరి గూడలో మేడ్చల్ కృతజ్ఞత సభ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. ఘట్కేసర్‌లో రైల్వే బ్రిడ్జికి మోక్షం కల్పించామన్నారు. కాంగ్రెస్ మోసపూరిత మాటలతో అధికారంలోకి వచ్చిందని, కేంద్రంలో అధికారంలోకి వస్తే అరు గ్యారేంటీలను అమలు చేస్తానని సీఎం రేవంత్ రెడ్డి అనడం సిగ్గు చేటన్నారు. భారత్ జోడో న్యాయ యాత్ర చోడో యాత్ర అయిందని ఎద్దేవా చేశారు. ఇండియా కూటమి నుంచి అందరూ వెళ్ళిపోయారన్నారు. రాష్ట్రంలో 46 వేల చెరువులు నిండు కుండలా ఉన్నాయని, అప్పు చేసి అయినా పేద ప్రజలకు ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి నిలబెట్టుకోవాలని సూచించారు. లంకె బిందెలు ఉంటే పంచుకుందామని కాంగ్రెస్ నాయకులు వచ్చారని, అభివృద్ధి చేసినవారిని బొంద పెడతా అంటారా? అని ఫైర్ అయ్యారు. కేసులకు భయపడేది లేదని, ప్రజలకు అండగా ఉంటానని మల్లారెడ్డి స్పష్టం చేశారు.
దేశంలోనే అతి పెద్ద నియోజక వర్గం మేడ్చల్ అని, కేసీఆర్ ఆశీర్వాదంతో మంత్రిని అయ్యానని, కరోనా సమయంలో ప్రజలందరినీ ఆడుకున్నామని మల్లారెడ్డి పేర్కొన్నారు. 61 గ్రామాల్లో సొంత నిధులతో రోడ్లు వేసామని, 125 ఆలయాలను నిర్మించామని, ఓటు అడుగక ముందే అన్ని హామీలు నెరవేర్చి ఓటు అడిగామని అన్నారు. మేడ్చల్ నియోజకవర్గం ప్రజలకు సేవ చేయడానికే తానున్నానని, రాజకీయాల కోసం, సినిమా డైలాగులు చెప్పడం లేదని మల్లారెడ్డి స్పష్టం చేశారు.