ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Mallareddy: ఆదేశాలొస్తే.. మల్కాజిగిరి ఎంపీగా పోటీ చేస్తా!

ABN, Publish Date - Jan 04 , 2024 | 08:07 PM

పార్టీ అధిష్ఠానం ఆదేశిస్తే మల్కాజిగిరి లోక్‌సభ ఎన్నిక ( LokSabha Election )ల్లో పోటీ చేస్తానని మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి ( Mallareddy ) తెలిపారు. గురువారం నాడు తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ ( BRS ) వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీమంత్రి కల్వకుంట్ల తారక రామారావు( KTR )ను మల్లారెడ్డి కలిశారు. గతంలో మల్కాజిగిరి ఎంపీగా పనిచేశానని ఈసారి కూడా అవకాశం కల్పించాలని కేటీఆర్‌కు చెప్పానని మల్లారెడ్డి అన్నారు..

హైదరాబాద్ : బీఆర్ఎస్ అధిష్ఠానం ఆదేశిస్తే మల్కాజిగిరి లోక్‌సభ ఎన్నికల్లో (LokSabha Elections) పోటీ చేస్తానని మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి ( Mallareddy ) తెలిపారు. గురువారం నాడు తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ ( BRS ) వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీమంత్రి కల్వకుంట్ల తారక రామారావు(KTR)ను మల్లారెడ్డి కలిశారు. గతంలో మల్కాజిగిరి ఎంపీగా పనిచేశానని.. ఈసారి కూడా అవకాశం కల్పించాలని కేటీఆర్‌కు చెప్పానని అన్నారు. మల్కాజిగిరి లోక్‌సభ పరిధిలో అన్ని అసెంబ్లీనియోజకవర్గాలను బీఆర్ఎస్ పార్టీ గెలిచిందని చెప్పారు.

కాగా.. ఇప్పటికే మల్కాజిగిరి లోక్‌సభ టికెట్‌ను పలువురు నేతలు ఆశిస్తున్నారు. లోక్‌సభ ఎన్నికలపై బీఆర్ఎస్ ప్రత్యేక దృష్టి సారించింది. ఎంపీ స్థానాల్లో పట్టున్న నేతలను లోక్‌సభ బరిలో దింపేందుకు కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగానే ఆయా జిల్లాల్లో ఉన్న ఎంపీ స్థానాలకు సంబంధించి కీలక నేతలకు దిశానిర్దేశం చేస్తోంది. లోక్‌సభ ఎన్నికల్లో ఎంపీ స్థానాలను అత్యధికంగా గెలుచుకోవడమే లక్ష్యంగా బీఆర్ఎస్ హైకమాండ్ పలు ప్రణాళికలను రచిస్తోంది.

Updated Date - Jan 04 , 2024 | 08:36 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising