TS NEWS: ఆ నిధులను కూడా కల్వకుంట్ల కుటుంబం మింగేసింది: మందుల సామేలు
ABN, First Publish Date - 2024-02-06T18:16:30+05:30
మహాత్మా జ్యోతిరావు పూలే గురించి మాట్లాడే అర్హత బీఆర్ఎస్‌కు లేదని ఎమ్మెల్యే మందుల సామేలు(Mandula Samuel) అన్నారు. గులాబీ నేతలు ఒక చెప్పు చూపిస్తే.. తాము వెయ్యి చెప్పులు చూపిస్తామని హెచ్చరించారు.
హైదరాబాద్: మహాత్మా జ్యోతిరావు పూలే గురించి మాట్లాడే అర్హత బీఆర్ఎస్‌కు లేదని ఎమ్మెల్యే మందుల సామేలు(Mandula Samuel) అన్నారు. మంగళవారం నాడు గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ... గులాబీ నేతలు ఒక చెప్పు చూపిస్తే.. తాము వెయ్యి చెప్పులు చూపిస్తామని హెచ్చరించారు. బాల్క సుమన్ ఎవడో తెల్వదని విమర్శించారు. కల్వకుంట్ల కుటుంబ అరాచకాలకు ఎంతో మంది బలయ్యారని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి పల్లె జీవితం నుంచి, ప్రజల్లో నుంచి వచ్చిన నాయకుడని తెలిపారు. ప్రగతి భవన్ గడీలను కూల్చి ప్రజలు తమ సమస్యలను చెప్పుకుంటున్నారని అన్నారు.
అందెశ్రీ రాసిన గేయాన్ని తెలంగాణ రాష్ట్ర గీతంగా ఆమోదించిన ఘనత కాంగ్రెస్‌దని అన్నారు. సెప్టెంబర్ 17వ తేదీపై మాజీ సీఎం కేసీఆర్‌కు కనీస అవగాహన లేదని చెప్పారు. సబ్ ప్లాన్ కింద వచ్చిన నిధులన్నీ కేసీఆర్ కుటుంబం మింగేసిందని మండిపడ్డారు. కాంగ్రెస్‌పైనా ప్రజలకు విశ్వాసం పెరిగిందని తెలిపారు. కేసీఆర్ నియంత పాలనను ప్రజలు తొక్కి పాతరేశారని చెప్పారు. బీఆర్ఎస్ నేతలు చెప్పులు, చేతులు చూపించూడు మానుకోవాలని హెచ్చరించారు. తెలంగాణ కోసం జీవితాలను త్యాగం చేసిన చరిత్ర కాంగ్రెస్‌కు ఉందని ఎమ్మెల్యే మందుల సామేలు పేర్కొన్నారు.
Updated Date - 2024-02-06T18:16:31+05:30 IST