TS News: ఎన్‌కౌంటర్లపై మావోయిస్టుల ప్రెస్‌నోట్
ABN, Publish Date - May 16 , 2024 | 09:57 AM
Telangana: ఇటీవల జరిగిన ఎన్‌కౌంటర్లపై మావోయిస్ట్ దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ అధికార ప్రతినిధి వికల్ప్ పేరిట ప్రెస్‌నోట్ విడుదలైంది. జనవరి నుంచి దండకారణ్యలో ఎన్‌కౌంటర్, క్రాస్ ఫైరింగ్ పేరుతో 107 మందిని పోలీస్ బలగాలు హతమార్చారని తెలిపారు. ఇప్పటి వరకు 27 సంఘటనలను ఫోర్స్ క్లెయిమ్ చేయగా, వాటిలో 18 తప్పుడు ఎన్‌కౌంటర్లు అని పేర్కొన్నారు.
ఛత్తీస్‌గఢ్, మే 16: ఇటీవల జరిగిన ఎన్‌కౌంటర్లపై (Encounter) మావోయిస్ట్ దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ అధికార ప్రతినిధి వికల్ప్ పేరిట ప్రెస్‌నోట్ విడుదలైంది. జనవరి నుంచి దండకారణ్యలో ఎన్‌కౌంటర్, క్రాస్ ఫైరింగ్ పేరుతో 107 మందిని పోలీస్ బలగాలు హతమార్చారని తెలిపారు. ఇప్పటి వరకు 27 సంఘటనలను ఫోర్స్ క్లెయిమ్ చేయగా, వాటిలో 18 తప్పుడు ఎన్‌కౌంటర్లు అని పేర్కొన్నారు.
Andhra Pradesh: భార్యాబిడ్డలను హింసిస్తూ.. ఏజెంట్‌కు వీడియోకాల్
జనవరి నుంచి హత్య చేయబడిన 107 మందిలో, 40 - 45 మంది గ్రామస్తులను చంపారన్నారు. ప్రభుత్వంతో చర్చల కోసం బహిరంగ ప్రకటన మావోయిస్ట్ పార్టీ చేసినా ప్రభుత్వం నుంచి నేరుగా సమాధానం ఇవ్వడం లేదని మండిపడ్డారు. చర్చలకు అనుకూల వాతావరణం కల్పించి ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని అన్ని సంస్థలకు మావోయిస్ట్ దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ అధికార ప్రతినిధి వికల్ప్ విజ్ఞప్తి చేశారు.
ఇవి కూడా చదవండి...
YSRCP: టీడీపీకి ఓటేసిన కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి?
Read Latest Telangana News And Telugu News
Updated Date - May 16 , 2024 | 10:02 AM