ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Ponnam Prabhakar: ఆ వాహనాలపై నిఘా.. మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక ఆదేశాలు

ABN, Publish Date - Nov 19 , 2024 | 08:32 AM

తెలంగాణలో ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు ఇస్తున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. దీని ద్వారా వాహనదారులకు ఏడాదికి సుమారు రూ. లక్ష మిగులు తుందన్నారు. తెలంగాణలో కొత్త ఈవీ పాలసీ వస్తుందని ప్రకటించారు.

హైదరాబాద్: ఢిల్లీలో తీవ్ర కాలుష్యంతో పాఠశాలలు బంద్ చేసే పరిస్థితి ఏర్పడిందని.. తెలంగాణ ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని రవాణా , బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్, తెలంగాణలో ఢిల్లీలాంటి పరిస్థితి రావద్దని ఈవీ పాలసీ తెచ్చామని తెలిపారు. ఇవాళ(మంగళవారం) మంత్రి పొన్నం ప్రభాకర్ ఓ ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ ఎలక్ట్రిక్ వాహనాలను విసృతంగా ప్రజలు వాడేలా ఈ పాలసీ ఉందని అన్నారు. ఈవీ వాహనాలపై రోడ్డు టాక్స్ రిజిస్ట్రేషన్ ఫీజు వందశాతం మినహాయింపు ఇస్తున్నామని వివరించారు. ఇప్పటికే స్క్రాప్ పాలసీ తీసుకొచ్చామని గుర్తుచేశారు. కాలుష్యాన్ని తగ్గించాలంటే ప్రజలు 15 సంవత్సరాలు దాటిన వాహనాలు స్వచ్చందంగా స్క్రాప్ చేయించాలని సూచించారు. హైబ్రిడ్ వాహనాలపై కూడా పన్ను రాయితీపై ఆలోచిస్తున్నామని అన్నారు. ప్రజలు ఈవీ వాహనాలు కొనాలని సూచించారు. ఈ మేరకు రవాణా శాఖ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. కాలుష్యాన్ని వెదజల్లే వాహనాలపై కఠినంగా వ్యవహరించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు.


రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు...

కాగా.. తెలంగాణలో ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు ఇస్తున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. దీని ద్వారా వాహనదారులకు ఏడాదికి సుమారు రూ. లక్ష మిగులుతుందని ప్రకటించారు. తెలంగాణలో కొత్త ఈవీ పాలసీ అమల్లోకి వస్తుందని చెప్పారు. తెలంగాణ రాష్ట్రాన్ని కాలుష్య రహితంగా చేయడం కోసం తమ ప్రభుత్వం చేపట్టిన వివరాలను ఈ సందర్భంగా వివరించారు.


కాలుష్య రహిత నగరంగా..

సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క నేతృత్వంలో హైదరాబాద్‌ను కాలుష్య రహిత నగరంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. అందులోభాగంగా రాష్ట్రంలో రవాణా శాఖ పరంగా మార్పులు, చేర్పులు తీసుకొచ్చి... ప్రజల్లో చైతన్య కలిగించే కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పారు. దేశ రాజధాని ఢిల్లీ మాదిరిగా హైదరాబాద్ మహానగరంలో కాలుష్య రహితంగా ఉంచేందుకు ఈవీ పాలసీ తీసుకొచ్చామని ఆయన స్పష్టం చేశారు.

జీవో నెంబర్ 41 ద్వారా..

గతంలో 2020 - 2030 ఎలక్ట్రిక్ వెహికిల్ (ఈవీ) పాలసీ తీసుకొచ్చారని చెప్పారు. జీవో నెంబర్ 41 ద్వారా 2026 డిసెంబర్ 31 వరకు ఇది అమల్లో ఉంటుందని ఆయన గుర్తు చేశారు. అయితే ఈ జీవో ద్వారా ఎలక్ట్రిక్ వాహనాల పాలసీ అమల్లోకి వస్తుందన్నారు. ఇక రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాలకు పరిమితి అనేది లేదని తెలిపారు. ఇక కాలుష్య రహిత నగరంగా హైదరాబాద్ మార్చాలని ప్రణాళికలు సైతం తీసుకు వచ్చామని గుర్తుచేశారు.


ఈవీపై పూర్తి స్థాయి అవగాహన..

హైదరాబాద్‌లో కాలుష్య తీవ్రత 83 ఉంటే.. పఠాన్‌చెరువులో 72 ఉందన్నారు. ఆ క్రమంలో కాలుష్యాన్ని తగ్గించాలంటే ఈవీపై పూర్తి స్థాయి అవగాహన కల్పించాలని చెప్పారు. హైదరాబాద్‌లో ఇప్పుడున్న మూడు వేల బస్సులు స్థానంలో ఎలక్ట్రిక్ బస్సులు తేవాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. త్వరలో నగరంలో మొత్తం ఆర్టీసీ బస్సులు నడుస్తాయని చెప్పారు. అయితే మరికొంత ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రావాల్సి ఉందన్నారు. ఇప్పటి వరకు పరిమితి సంఖ్యలోనే ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగిస్తున్నారన్నారు. ఈవీ వాహనాలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలకు మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్జప్తి చేశారు. వాహనదారులు పొల్యూషన్ టెస్ట్ చేసుకునేలా అవగాహన కల్పించాలని తెలిపారు.


రోడ్డు అవేర్‌నెస్ పార్కులు..

దేశంలో లక్ష 50 వేల మంది రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్క తెలంగాణలో రోజుకు 20 మంది చనిపోతున్నారని చెప్పారు. రోడ్ సేఫ్టీపై గురువా రెడ్డి సంస్థ లైసెన్స్ ఇచ్చే ముందే అవగాహన కల్పించాలని నిర్ణయం తీసుకుందన్నారు. అలాగే యునిసెఫ్ ద్వారా స్కూళ్లలో రోడ్డు అవేర్‌నెస్ పార్కులు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. కొత్తగా నియమితులైన వారిని ఎన్‌ఫోర్స్‌మెంట్‌లో పెడుతున్నామన్నారు. రవాణా శాఖకు కొత్త లోగోతోపాటు కొత్త వాహనాలు సైతం వస్తున్నాయన్నారు. రవాణా శాఖలో అనేక సంస్కరణలు తీసుకొస్తున్నామని తెలిపారు. ఎలక్ట్రిక్ వాహనాలకు అనుగుణంగా చార్జింగ్ స్టేషన్స్ ఉంటున్నాయని తెలిపారు.

టాక్స్ మినహాయింపు..

ఎలక్ట్రిక్ వాహనాల కంపెనీలు చొరవ తీసుకొని చార్జీంగ్ స్టేషన్‌‌లు ఏర్పాటు చేయాలని సూచించారు. ఈవీ వాహనాలకు గతంలో 5 వేల వాహనాలకు టాక్స్ మినహాయింపు ఇచ్చారని గుర్తు చేశారు. ఇప్పటి వరకు లక్షా 70 వేల ఎలక్ట్రిక్ వాహనాలు రిజిస్ట్రేషన్ అయ్యాయన్నారు. ప్రస్తుతం రోజుకు ప్రతి వంద వాహనాల్లో 5 ఎలక్ట్రిక్ వాహనాల ఉంటున్నాయని చెప్పారు.

వచ్చే 10 రోజుల్లో రవాణా శాఖ, జీహెచ్ఎంసీ, హెచ్‌ఎండీఏ, హైదరాబాద్ పోలీస్‌లతో సమన్వయ సమావేశం ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. రవాణా శాఖ ప్రమోషన్లకు వ్యతిరేకం కాదన్నారు. ప్రమోషన్ల ప్రాసెస్ నడుస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు.

Updated Date - Nov 19 , 2024 | 08:38 AM