Seethakka: ములుగు మున్సిపాలిటీ బిల్లుకు ఆమోద ముద్ర వేయాలంటూ..
ABN, Publish Date - Sep 24 , 2024 | 12:54 PM
Telangana: ములుగు గ్రామపంచాయతీని మున్సిపాలిటీగా మారుస్తూ 2022లో అసెంబ్లీ పాస్ చేసిన బిల్లుకు ఆమోద ముద్ర వేయాలని గవర్నర్‌కు సీతక్క వినతి పత్రం సమర్పించారు. సాంకేతికపరమైన చిక్కులతో ములుగు మున్సిపాలిటీ బిల్లు ఇంతకాలం పెండింగ్లోనే ఉండిపోయింది.
హైదరాబాద్, సెప్టెంబర్ 24: తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో (Governor Jishnudev Varma) మంత్రి సీతక్క (Minister Seethakka) మంగళవారం రాజ్‌భవన్‌లో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ములుగు గ్రామపంచాయతీని మున్సిపాలిటీగా మారుస్తూ 2022లో అసెంబ్లీ పాస్ చేసిన బిల్లుకు ఆమోద ముద్ర వేయాలని గవర్నర్‌కు సీతక్క వినతి పత్రం సమర్పించారు. సాంకేతికపరమైన చిక్కులతో ములుగు మున్సిపాలిటీ బిల్లు ఇంతకాలం పెండింగ్లోనే ఉండిపోయిన విషయం తెలిసిందే.
Tirumala Laddu Controversy: పొన్నవోలు, ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలపై ఓ రేంజ్‌లో ఫైర్ అయిన పవన్
గత ప్రభుత్వ తప్పిదాలతో మున్సిపాలిటీకి ములుగు నోచుకోని పరిస్థితి. తెలంగాణ మున్సిపల్ చట్ట సవరణ బిల్లులోనే ములుగు మున్సిపాలిటీ అంశాన్ని గత ప్రభుత్వం చేర్చింది. అదే బిల్లులో జీహెచ్‌ఎంసీ చట్టానికి సవరణలు ప్రతిపాదించింది గత సర్కార్. దీంతో ములుగు మున్సిపాలిటీ బిల్లు గందరగోళంగా మారిపోయింది. సభ్యుల గందరగోళం నడుమ 2022లో బిల్లును అప్పటి ప్రభుత్వం పాస్ చేసింది.
R k Roja:ఇజ్జత్ పాయె.. రోజాకు దిమ్మతిరిగే పంచ్
అయితే న్యాయపరమైన, సాంకేతికపరమైన అంశాల నేపథ్యంలో బిల్లును గత గవర్నర్ తమిళి సై సౌందర్ రాజన్ రాష్ట్రపతి ఆమోదానికి పంపించారు. దీంతో ములుగు మున్సిపాలిటీ బిల్లు పెండింగ్‌లోనే ఉండిపోయింది. ఈ క్రమంలో బిల్లు వివరాలు గవర్నర్‌కు అందజేసిన మంత్రి సీతక్క.. ములుగుకు మున్సిపాలిటీ హోదా కల్పించే బిల్లుకు ఆమోద ముద్ర వేయాలని విజ్ఞప్తి చేశారు.
ఇవి కూడా చదవండి..
Pawan: దుర్గగుడికి పవన్.. మెట్లు శుభ్రం చేసిన డిప్యూటీ సీఎం
HYDRA: బ్యాంకు లోన్లపై హైడ్రా సంచలన నిర్ణయం
Read Latest Telangana News And Telugu News
Updated Date - Sep 24 , 2024 | 12:58 PM