Minister Tummala: రైతు రుణ మాఫీ చేయడంలో బ్యాంకర్లు చొరవ తీసుకోవాలి..
ABN, Publish Date - Aug 20 , 2024 | 03:31 PM
తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన రైతు రుణమాఫీ(Rythu Runa Mafi) కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో బ్యాంకర్లది కీలకపాత్ర అని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Tummala Nageswara Rao) అన్నారు. రైతుల ఖాతాల్లో తప్పులు సరిదిద్ది వారికి లబ్ధి చేకూరేలా చేయాల్సిన బాధ్యత బ్యాంకర్లపై ఉందని ఆయన చెప్పారు.
హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన రైతు రుణమాఫీ(Rythu Runa Mafi) కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో బ్యాంకర్లది కీలకపాత్ర అని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Tummala Nageswara Rao) అన్నారు. రైతుల ఖాతాల్లో తప్పులు సరిదిద్ది వారికి లబ్ధి చేకూరేలా చేయాల్సిన బాధ్యత బ్యాంకర్లపై ఉందని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశం(State Level Bankers Meet)లో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో కలిసి మంత్రి తుమ్మల పాల్గొన్నారు.
ఈ ఏడాది దేవుడి దయతో వర్షాలు పుష్కలంగా పడుతున్నాయని మంత్రి తుమ్మల అన్నారు. ఈ సంవత్సరం అధిక విస్తీర్ణంలో పంటలు సాగవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. కష్టకాలంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ పథకం కింద రూ.18వేల కోట్లు ఇప్పటికే విడుదల చేసిందని తుమ్మల చెప్పుకొచ్చారు. కొంత మంది రైతులకు ఇంకా మాఫీ కాలేదని, అందుకు రకరకాల కారణాలు ఉన్నాయని చెప్పారు. వాంటన్నింటినీ త్వరలోనే పరిష్కరించి రైతులకు తోడుగా నిలవాలని బ్యాంకర్లకు మంత్రి సూచించారు. నగదు జమ కాని రైతులు ఎలాంటి ఆందోళనకు గురి కావాల్సిన పని లేదని మంత్రి చెప్పుకొచ్చారు.
గ్రామస్థాయిలో పని చేసే బ్యాంకుల బ్రాంచ్ మేనేజర్లను రైతుల రుణ ఖాతాల్లో తప్పులు సరిదిద్దేలా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాల్సిందిగా బ్యాంకర్లను మంత్రి తుమ్మల కోరారు. రుణ మాఫీ చేయడంలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. రుణమాఫీ కార్యక్రమాన్ని సంపూర్ణంగా పూర్తి చేయడానికి సహకారం అందించాలని బాధ్యత బ్యాంకర్ల ఉందన్నారు. అంకెలు చదువుకోవడానికి ప్రతి మూడు నెలలకోసారి మీటింగులు, బ్యాంకర్ల సదస్సు నిర్వహించడంలో అర్థం లేదని తుమ్మల పేర్కొన్నారు. రైతులు, పేదలు, నిమ్నవర్గాల ప్రజలకు పథకాల ద్వారా ఆర్థిక ఫలాలు అందేలా చేయడంలో కీలకంగా వ్యవరించాలని మంత్రి తుమ్మల బ్యాంకర్లను కోరారు.
ఇవి కూడా చదవండి..
Bhatti Vikramarka: రాజీవ్ గాంధీ జయంతి వేడుకల్లో పాల్గొన్న డిప్యూటీ సీఎం
Bandi Sanjay: వాటి నుంచి డైవర్ట్ చేయడానికే విగ్రహాల లొల్లి...
Updated Date - Aug 20 , 2024 | 03:32 PM