ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Uttam Kumar: ‘మా ప్రభుత్వానికి వచ్చే ఇబ్బందేమీ లేదు’

ABN, Publish Date - May 10 , 2024 | 03:57 PM

Telangana: ‘‘ప్రభుత్వాన్ని కాపాడుకునే సత్తా మాకుంది. మేం 11 మందిమి మంచి టీమ్‌గా పని చేస్తున్నాం. మా ప్రభుత్వానికి వచ్చే ఇబ్బందేమీ లేదు. రేవంత్ సీఎంగా, భట్టి డిప్యూటీ సీఎంగా, మేం మంత్రులుగా కలిసి పనిచేస్తున్నాం. మేమంతా క్రికెట్ టీంలా పనిచేస్తున్నాం’’ అని మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారు. శుక్రవారం మీట్‌ ది ప్రెస్‌లో ఆయన మాట్లాడుతూ.. పార్లమెంట్ వ్యవస్థను మోదీ ప్రభుత్వం ధ్వంసం చేసిందని విమర్శించారు.

Minister Uttam Kumar Reddy

హైదరాబాద్, మే 10: ‘‘ప్రభుత్వాన్ని కాపాడుకునే సత్తా మాకుంది. మేం 11 మందిమి మంచి టీమ్‌గా పని చేస్తున్నాం. మా ప్రభుత్వానికి వచ్చే ఇబ్బందేమీ లేదు. రేవంత్ (CM Revanth Reddy) సీఎంగా, భట్టి (Deputy CM Bhatti Vikramarka) డిప్యూటీ సీఎంగా, మేం మంత్రులుగా కలిసి పనిచేస్తున్నాం. మేమంతా క్రికెట్ టీంలా పనిచేస్తున్నాం’’ అని మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి (Minister Uttam Kumar Reddy) అన్నారు. శుక్రవారం మీట్‌ ది ప్రెస్‌లో ఆయన మాట్లాడుతూ.. పార్లమెంట్ వ్యవస్థను మోదీ (PM Modi) ప్రభుత్వం ధ్వంసం చేసిందని విమర్శించారు. స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి పార్లమెంట్‌లో (Parliament) ఎక్కువ మంది ఎంపీలను సస్పెండ్ చేసింది బీజేపీ ప్రభుత్వమని.. బిల్లుల మీద కనీసం చర్చ కూడా చేయరన్నారు. దేశాన్ని బనానా రిపబ్లిక్‌గా మార్చారన్నారు. మరొకసారి మోదీ ప్రధాని అయితే పాకిస్థాన్, రష్యా, నార్త్ కొరియా లాగా దేశం తయారవుతుందని వ్యాఖ్యలు చేశారు.

Elections 2024: ఓటు వేస్తున్నారా.. ఇలా చేస్తే జైలే..!


ఈడీ, సీబీఐ, ఇన్కమ్ ట్యాక్స్ కేసులు ప్రతిపక్ష పార్టీల నేతల మీద పెడతారని మండిపడ్డారు. మరోసారి బీజేపీ వస్తే పార్లమెంటరీ డేమోక్రసీ ఉండదన్నారు. మోదీ ఇచ్చిన ఒక్క హామీని కూడా పూర్తిగా అమలు చేయలేదన్నారు. మోదీ ప్రభుత్వం ఎస్‌ఎస్‌పీకి చట్ట బద్దత కల్పిస్తామని చెప్పారని.. ఇప్పటి వరకు ఇవ్వలేదని విమర్శించారు. తెలంగాణలో కేంద్ర ప్రభుత్వ స్కీం కింద ఒక్క ఇళ్లు కూడా కట్టలేదన్నారు. అగ్నివీర్ దేశ రక్షణకు మంచిది కాదని తెలిపారు. ప్రధాన మంత్రిగా మోదీ దిగజారి మాట్లాడుతున్నారని విరుచుకుపడ్డారు.

AP Elections: రోజా నిజస్వరూపం పోసాని లీలలు బయటపెట్టిన కిరాక్ ఆర్పీ ..!


బీజేపీకి తెలంగాణలో ఓటు అడిగే నైతిక హక్కు లేదన్నారు. పార్లమెంట్ ఎన్నికల తరువాత బీఆర్ఎస్ ఉండదంటూ సంచలన కామెంట్స్ చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు సున్నా సీట్లు వస్తాయని అన్నారు. బీఆర్‌ఎస్ త్వరలోనే వీఆర్ఎస్ తీసుకుంటుందంటూ సెటైరికల్ కామెంట్స్ చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలను మోదీ ప్రభుత్వం ప్రైవేట్ దళారిలకు అమ్మిందని ఆరోపించారు. ఇరిగేషన్‌ను కేసీఆర్ సర్వ నాశనం చేశారన్నారు. కాళేశ్వరం విషయంలో జరిగిన తప్పులకు ప్రజలకు క్షమాపణ చెప్పాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు.


ఇవి కూడా చదవండి...

Lok Sabha Elections: వాళ్లెంత ఆడిపోసుకున్నా శక్తిమాత అనుగ్రహమే నన్ను కాపాడుతోంది: మోదీ

Hyderabad: మోదీ పాలనపై ప్రజలకు విశ్వాసం ఉంది..

Read Latest Telangana News And Telugu News

Updated Date - May 10 , 2024 | 04:01 PM

Advertising
Advertising