ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

KTR: నేతన్నలపై కాంగ్రెస్‌కు ఎందుకింత కక్ష..?: కేటీఆర్

ABN, Publish Date - Apr 04 , 2024 | 01:02 PM

హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. నేతన్నలపై కాంగ్రెస్ సర్కారు కక్ష కట్టిందని, ఎందుకింత కక్ష అని ప్రశ్నించారు. నేతన్నలు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ఆదుకోరా?... కార్మికులు రోడ్డున పడ్డా కనికరించరా?.. అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.

హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)కి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ (BRS Working President), మాజీ మంత్రి కేటీఆర్ (Ex Minister KTR) బహిరంగ లేఖ (Letter) రాశారు. నేతన్నలపై కాంగ్రెస్ సర్కారు (Congress Govt.) కక్ష కట్టిందని, ఎందుకింత కక్ష అని ప్రశ్నించారు. ఈ సందర్భంగా గురువారం ఆయన హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ.. నేతన్నలు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ఆదుకోరా?... కార్మికులు రోడ్డున పడ్డా కనికరించరా?.. అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. పదేళ్ల తరువాత సమైక్యరాష్ట్రం నాటి సంక్షోభం తెలంగాణలో ఏర్పడిందని అన్నారు. నేతన్నల బతుకులు ఆగం అయ్యేలా కాంగ్రెస్ విధానాలు ఉన్నాయని, నేతన్నలకు కాంగ్రెస్ ప్రభుత్వం అర్డర్లు అపేసిందని మండిపడ్డారు.

గతంలో మాదిరిగా నేతన్నలకు చేతినిండా అర్డర్లు వేంటనే ఇవ్వాలని, బతుకమ్మ చీరల ఆర్డర్లు ఇవ్వడంతోపాటు ఎన్నికల కోడ్ వల్ల ఆపిన పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. చేనేత మిత్రా వంటి పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం పక్కన పెట్టిందని.. ప్రస్తుతం అందుతున్న అన్నీ కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేయాలని కోరారు. అవసరం అయితే మరింత సాయం చేయాలని సూచించారు. కేవలం గత ప్రభుత్వంపై దుగ్దతతో నేతన్నల పొట్ట కొట్టడం సరైంది కాదన్నారు. రైతన్న మాదిరే, నేతన్నలు ఆత్మహత్యలు చేసుకోవడం అత్యంత బాధకరమని, వస్త్ర పరిశ్రమను ఆదుకోకపోతే కాంగ్రెస్ సర్కార్ భారీ మూల్యం చెల్లించక తప్పదని కేటీఆర్ అన్నారు.

Updated Date - Apr 04 , 2024 | 01:04 PM

Advertising
Advertising