Kavitha Arrest: కవితతో 5 నిమిషాల పాటు ప్రత్యేకంగా మాట్లాడిన లాయర్ విక్రమ్ చౌదరి.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..
ABN, Publish Date - Mar 16 , 2024 | 12:25 PM
ఎమ్మెల్సీ కవితను విచారించడానికి రౌస్ అవెన్యూ కోర్టును ఈడీ 10 రోజుల కస్టడీ కోరేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం. ఇప్పటికే కవిత తరుఫు న్యాయవాది విక్రమ్ చౌదరి కోర్టు హాల్‌కి చేరుకున్నారు. రౌస్ అవెన్యూ కోర్టులో కవిత కేసు విచారణ జరిగింది. కవిత అరెస్ట్ కేసును సీబీఐ స్పెషల్ జడ్జ్ ఎం.కె నాగ్ పాల్ విచారిస్తున్నారు.
ఢిల్లీ: ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha)ను విచారించడానికి రౌస్ అవెన్యూ కోర్టు (Rouse Avenue Court)ను ఈడీ (ED) 10 రోజుల కస్టడీ కోరేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం. ఇప్పటికే కవిత తరుఫు న్యాయవాది విక్రమ్ చౌదరి కోర్టు హాల్‌కి చేరుకున్నారు. రౌస్ అవెన్యూ కోర్టులో కవిత కేసు విచారణ జరిగింది. కవిత అరెస్ట్ కేసును సీబీఐ (CBI) స్పెషల్ జడ్జ్ ఎం.కె నాగ్ పాల్ విచారించనున్నారు. కవిత తరుఫున ఇద్దరు లాయర్లు విక్రమ్ చౌదరి, మోహిత్ రావు వాదనలు వినిపిస్తున్నారు.
Mudragada Padmanabham: ఆయన సినిమా హీరో అయితే.. నేను పొలిటికల్ హీరో
ఈడీ తరుఫున ఎన్. కె మట్టా, జోసెబ్ హుస్సేన్ వాదనలు వినిపించనున్నారు. అయితే కవితతో 5 నిముషాలు ప్రత్యేకంగా మాట్లాడేందుకు విక్రమ్ చౌదరి అనుమతి కోరగా.. న్యాయమూర్తి నాగపాల్ అనుమతించారు. కవితతో మాట్లాడిన అనంతరం విక్రమ్ వాదన వినిపించారు. సుప్రీంకోర్టు (Supreme Court)లో ఇచ్చిన హామీని దర్యాప్తు సంస్థ పూర్తి స్థాయిలో ఉల్లంఘించి అరెస్టు చేసిందని విక్రమ్ కోర్టుకు తెలిపారు. సమన్లు ఇచ్చినప్పుడు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశామన్నారు.
CM Revanth: సీఎంగా తొలిసారి ఏపీకి రేవంత్... కామెంట్లపై సర్వత్రా ఆసక్తి
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated Date - Mar 16 , 2024 | 12:47 PM