MP Laxman: వారితో కాంగ్రెస్ ప్రభుత్వం లోపాయికారి ఒప్పందం చేసుకుంది
ABN, Publish Date - Feb 24 , 2024 | 02:39 PM
తెలంగాణ సంపద దోచుకున్న బీఆర్ఎస్ నేతలతో కాంగ్రెస్ ప్రభుత్వం లోపాయికారి ఒప్పందం చేసుకుందని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ (MP Laxman) అన్నారు. శనివారం నాడు బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.... తెర వెనుక కుట్రలు, కుమ్మక్కు రాజకీయాలు బీఅర్ఎస్, కాంగ్రెస్‌కు అలవాటు అయ్యాయని ఆరోపించారు.
హైదరాబాద్: తెలంగాణ సంపద దోచుకున్న బీఆర్ఎస్ నేతలతో కాంగ్రెస్ ప్రభుత్వం లోపాయికారి ఒప్పందం చేసుకుందని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ (MP Laxman) అన్నారు. శనివారం నాడు బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.... తెర వెనుక కుట్రలు, కుమ్మక్కు రాజకీయాలు బీఅర్ఎస్, కాంగ్రెస్‌కు అలవాటు అయ్యాయని ఆరోపించారు.
బీజేపీ చెప్పిందే చేస్తుందని.. ఏ విషయనైనా బహిరంగంగా చెబుతుందని అన్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కాళేశ్వరం ప్రాజెక్టు, ధరణిపై సీబీఐతో విచారణ చేయిస్తామని రేవంత్ చెప్పారని.. ఇప్పుడెందుకు కాలయాపన చేస్తున్నారని నిలదీశారు. బీఆర్ఎస్‌తో బీజేపీ ఎప్పటికీ పొత్తు ఉండదని... పార్లమెంట్ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని స్పష్టం చేశారు. గెలిచే గుర్రాలను 17 ఎంపీ స్థానాల్లో నిలపెట్టబోతున్నామని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చరిష్మాతో కేంద్రంలో మళ్లీ బీజేపీ అధికారంలోకి వస్తుందని లక్ష్మణ్ ధీమా వ్యక్తం చేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Updated Date - Feb 24 , 2024 | 02:40 PM