ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: ఫేక్ సర్టిఫికెట్లు తయారు చేస్తున్న ముఠా గుట్టురట్టు..

ABN, Publish Date - Nov 14 , 2024 | 08:21 PM

ఫేక్ సర్టిఫికెట్లు (Fake Certificates) తయారు చేస్తున్న ముఠాను నార్త్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు (North Zone Task Force Police) అరెస్టు చేశారు. నకిలీ ఓటర్ కార్డులు, ఆధార్ కార్డులు, బర్త్ సర్టిఫికెట్లు తయారు చేస్తున్న ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు.

హైదరాబాద్: ఫేక్ సర్టిఫికెట్లు (Fake Certificates) తయారు చేస్తున్న ముఠాను నార్త్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు (North Zone Task Force Police) అరెస్టు చేశారు. నకిలీ ఓటర్ కార్డులు, ఆధార్ కార్డులు, బర్త్ సర్టిఫికెట్లు తయారు చేస్తున్న ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. మహంకాళి పోలీసులతో కలిసి జాయింట్ ఆపరేషన్ నిర్వహించిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఆరుగురు నిందితులను అరెస్టు చేశారు. వారి నుంచి వందల సంఖ్యలో ఫేక్ సర్టిఫికెట్లు స్వాధీనం చేసుకున్నారు.

TG NEWS: లగచర్ల దాడి కేసులో షాకింగ్ విషయాలు బయటపెట్టిన పట్నం నరేందర్‌రెడ్డి


నిందితులంతా హైదరాబాద్ నగరానికి చెందిన వారిగా గుర్తించామని టాస్క్‌ఫోర్స్ పోలీసులు తెలిపారు. ముఠా సభ్యులు ఫేక్ సర్టిఫికెట్లతో పాస్‌పోర్ట్‌లు సృష్టించి పలువురిని విదేశాలకు పంపిస్తున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే వీరి వద్ద కొందరు యువతీ, యువకులు పాస్‌పోర్టులు తీసుకున్నారని తెలిపారు. నిందితుల నుంచి వందలాది ఓటర్ కార్డులు, ఆధార్ కార్డులు, బర్త్ సర్టిఫికెట్లు స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. గెజిటెడ్ ఆఫీసర్ల పేర్లతో నకిలీ స్టాంప్‌లు సృష్టించారని వాటినీ స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.

BJP: మిడి మిడి జ్ఞానంతో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు: కిషన్ రెడ్డి


నిందితులను ఎలగం రాజ్ కుమార్, మహబూబ్, రాచమల్ల విజయలక్ష్మి, కూరపాటి పల్లవి, బండి శంకర్, గిరిరాజ్ అనిల్ కుమార్‌గా గుర్తించామని టాస్క్‌ఫోర్స్ పోలీసులు తెలిపారు. పట్టుకున్న ఆరుగురు నిందితుల నుంచి ఫేక్ డాక్యుమెంట్లు తయారు చేసే మిషన్లు స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. అలాగే ఆరుగురినీ అరెస్టు చేశామని నార్త్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు తెలిపారు.

ఈ వార్తలు కూడా చదవండి

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు

Hyderabad: ఫోన్ ట్యాపింగ్ కేసు.. చిరుమర్తి లింగయ్య కీలక విషయాలు వెల్లడి..

Read Latest Telangana News and TELUGU NEWS

Updated Date - Nov 14 , 2024 | 08:24 PM