Big Breaking: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మరో సంచలనం
ABN, Publish Date - Mar 26 , 2024 | 10:37 AM
Phone Tapping Case: తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన ఫోన్ టాపింగ్ (Phone Tapping) వ్యవహారం కీలక మలుపు తిరిగింది. కదిపే కొద్దీ డొంక కదులుతోంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న అధికారుల గురించి షాకింగ్ విషయం బయటికొచ్చింది. ఫోన్ ట్యాపింగ్ ద్వారా..
తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన ఫోన్ టాపింగ్ (Phone Tapping) వ్యవహారం కీలక మలుపు తిరిగింది. కదిపే కొద్దీ డొంక కదులుతోంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న అధికారుల గురించి షాకింగ్ విషయం బయటికొచ్చింది. ఫోన్ ట్యాపింగ్ ద్వారా అధికారులు భారీగానే అక్రమ ఆస్తులు కూడా బెట్టుకున్నారని తెలియవచ్చింది. దీంతో రంగంలోకి దిగిన ఏసీబీ (ACB).. అధికారులపై ఫుల్ ఫోకస్ పెట్టినట్లుగా తెలిసింది. ముఖ్యంగా.. ఈ ట్యాపింగ్ ద్వారా వ్యాపారులు, హవాలా ముఠాలను బెదిరించి వారి నుంచి అధికారులు పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేసినట్లుగా తేలినట్లు సమాచారం. ఈ డబ్బుతో భారీగానే ఆస్తులు కూడబెట్టుకున్నట్లు దర్యాప్తులో తేలిందట. అంతేకాదు.. విలాసవంతమైన విల్లాల్లో ఆ అధికారులు నివాసం ఉంటున్నట్లు ఉన్నతాధికారులు గుర్తించారు. ప్రస్తుతం ఈ వ్యవహారం ఏసీబీ చేతికి వెళ్లింది. ఏసీబీ లిస్టులోకి వెళ్లడంతో అధికారుల చిట్టాను బయటికి తీస్తున్నారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న ఆఫీసర్ల ఆర్థిక పరిస్థితిని ఏసీబీ నిశితంగా విశ్లేషిస్తున్నది. అయితే.. ఆదాయానికికి మించి ఆస్తులు కూడబెట్టుకున్నట్టు ఏసీబీ అనుమానిస్తోంది.
Phone Tapping: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ అప్డేట్!
ఎండ్ కార్డ్ లేదే!
2018, 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికలు, ఉప ఎన్నికలు.. 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనే ఎక్కువగా ఫోన్ ట్యాప్ జరిగినట్లు అధికారులు నిగ్గు తేల్చారు. ఓ పార్టీకి చెందిన డబ్బులను ఈ ట్యాపింగ్ బ్యాచ్ రూట్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇతర పార్టీలకు చెందిన డబ్బుల ఫ్లోటింగ్‌ను ఎప్పటికప్పుడు మానిటర్ చేసినట్లుగా తేలింది. చూశారుగా.. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో రోజుకో సంచలన విషయం వెలుగుచూస్తూనే ఉంది. సోమవారం నాడు.. రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసుకుని ఆయన ఇంట్లో ఏం మాట్లాడుకుంటున్నారో విన్నట్లు దర్యాప్తు అధికారుల దృష్టికి రాగా.. తాజాగా ఆస్తుల వ్యవహారం వెలుగుచూసింది. మున్ముందు ఇంకా ఎన్ని షాకింగ్ విషయాలు వెలుగుచూస్తాయో ఏంటో మరి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..
Updated Date - Mar 26 , 2024 | 12:39 PM