TS Politics: బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్‌లో చేరడానికి కారణమదే..?: పల్లా రాజేశ్వర్ రెడ్డి
ABN, Publish Date - Mar 04 , 2024 | 04:26 PM
బీజేపీ(BJP), కాంగ్రెస్(Congress) పార్టీల మధ్య చీకటి ఒప్పందం ఈ రోజుతో బయట పడిందని బీఆర్ఎస్(BRS) ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి( Palla Rajeshwar Reddy) అన్నారు. సోమవారం నాడు తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.... నేటి ఆదిలాబాద్ సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(PM Modi), సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) అలై బలై తీసుకున్నారని చెప్పారు. బడే బాయ్, చోటా బాయ్ బంధం మరోసారి బయట పడిందని అన్నారు.
హైదరాబాద్: బీజేపీ(BJP), కాంగ్రెస్(Congress) పార్టీల మధ్య చీకటి ఒప్పందం ఈ రోజుతో బయట పడిందని బీఆర్ఎస్(BRS) ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి( Palla Rajeshwar Reddy) అన్నారు. సోమవారం నాడు తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.... నేటి ఆదిలాబాద్ సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(PM Modi), సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) అలై బలై తీసుకున్నారని చెప్పారు. బడే బాయ్, చోటా బాయ్ బంధం మరోసారి బయట పడిందని అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎఫ్‌ఆర్‌బీఎం(FRBM) పరిధి దాటి లోన్ అడిగితే కేంద్రం ఇబ్బంది పెట్టిందని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక ఈ లోన్ తీసుకోవడానికి ఎలా అనుమతి ఇచ్చారని ప్రశ్నించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీని ఒక్క మాట కూడా సీఎం రేవంత్ అనరని.. కానీ మాజీ సీఎం కేసీఆర్‌పై ఒంటి కాలితో లేస్తారని ధ్వజమెత్తారు.
ప్రధాని మోదీ, అదానీ బంధంపై ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శలు చేస్తుంటే రేవంత్ మాత్రం అదానీతో ఒప్పందం చేసుకుంటున్నారని ఆరోపించారు. గుజరాత్ మోడల్ వద్దని రాహుల్ అంటే రేవంత్ ముద్దు అంటున్నారని.. ఈ విషయంలో రాహుల్‌ను నమ్మాలా లేక రేవంత్‌ని నమ్మాలా అని నిలదీశారు. మోదీ వద్ద రేవంత్ రెడ్డి మోకరిల్లడం ప్రజలంతా చూశారని చెప్పారు. తెలంగాణ ప్రజల చెవిలో రేవంత్ రెడ్డి క్యాలీఫ్లవర్, మోదీ కమలం ఫ్లవర్ పెట్టారని ఎద్దేవా చేశారు కుంగిన మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్‌ను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సరిచేసి రైతులకు నీరివ్వడానికి సత్వర చర్యలు చేపట్టాలని కోరారు. పార్లమెంట్ ఎన్నికల కోసం కాంగ్రెస్, బీజేపీ పార్టీల మధ్య అవగాహన కుదిరిందని అన్నారు. ఉత్తర తెలంగాణలో బీజేపీకి కాంగ్రెస్ సహాయం చేస్తుందని తెలిపారు. దక్షిణ తెలంగాణలో కాంగ్రెస్‌కు బీజేపీ మద్దతు ఇస్తుందని.. ఆ ఒప్పందంలో భాగంగానే బడే భాయ్, చోటే భాయ్ కలిశారని విమర్శించారు. బీఆర్ఎస్ నేతలను బతిమిలాడి కాంగ్రెస్‌లో చేర్చుకుంటున్నారని పల్లా రాజేశ్వర్ రెడ్డి మండిపడ్డారు.
ఇవి కూడా చదవండి
CM Revanth: ప్రధాని మోదీకి కృతజ్ఞతలు.. ఎన్నికల సమయంలోనే రాజకీయాలన్న రేవంత్ రెడ్డి
PM Modi: 41ఏళ్ల తర్వాత ఆదిలాబాద్‌కు ప్రధాని.. సీఎం రేవంత్ స్వాగతం
Babu Mohan: ప్రజాశాంతి పార్టీ తీర్థం పుచ్చుకున్న బాబుమోహన్
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Updated Date - Mar 04 , 2024 | 04:38 PM