ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Jaggareddy: నువ్వు బాయిలర్ కోడి.. మేము నాటు కోడి.. కేటీఆర్‌పై జగ్గారెడ్డి సెటైర్

ABN, Publish Date - Oct 22 , 2024 | 03:18 PM

Telangana: మాజీ మంత్రి కేటీఆర్‌ను బాయిలర్ కోడితో పోల్చారు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. ‘‘ కేటీఆర్ బాయిలర్ కోడి.. మేము నాటు కోటి. కేటీఆర్‌ను కేసీఆర్ నాజూగ్గా పెంచారు’’ అంటూ సెటైర్ వేశారు. అంతేకాకుండా కేటీఆర్ రాజకీయం నేర్చుకోవాలంటే రేవంత్ వద్ద వెళ్లొచ్చు అంటూ కౌంటర్ ఇచ్చారు.

PCC Working President Jaggareddy

హైదరాబాద్, అక్టోబర్ 22: మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై (Former Minister KTR) పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి (PCC Working President Jaggareddy) విరుచుకుపడ్డారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. మాజీ మంత్రి కేటీఆర్ చిన్న పిల్లల్లా మాట్లాడుతున్నారని... కేటీఆర్‌కు రాజకీయ పరిజ్ఞానం ఉందా అని ప్రశ్నించారు. సీఎం ఏం చేసినా దాన్ని చెడుగా కేటీఆర్, హరీష్ రావు వక్రీకరిస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ సోషల్ మీడియా ద్వారా కన్ఫ్యూజ్ క్రియేట్ చేస్తోందన్నారు.

Gottipati Ravikumar: ఏ సీఎం చేయని పనులు జగన్ చేశారు.. మంత్రి గొట్టిపాటి ఫైర్


‘‘కేటీఆర్ బాయిలర్ కోడి. మేము నాటు కోడి. కేటీఆర్‌ను కేసీఆర్ నాజూగ్గా పెంచారు. అయ్య పేరుతో రేవంత్ రెడ్డి సీఎం కాలేదు. ఢక్కాముక్కీలు తిని రేవంత్ రెడ్డి సీఎం అయ్యారు. కేటీఆర్ రాజకీయం నేర్చుకోవాలంటే రేవంత్ రెడ్డి దగ్గరకి పోయి క్లాస్‌లు తీసుకోవాలి’’ అంటూ హితవుపలికారు. దామగుండం 360 మీటర్ల ఎత్తు ఉండి.. అక్కడ నుంచి సిగ్నల్స్ పంపడానికి ఎటువంటి ఇబ్బందులు లేకపోవడంతో పాటు అనేక సానుకూలతలు ఉండటంతో అక్కడ రాడార్ ఏర్పాటు చేశారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఎత్తు ఉంది కాబట్టి మనం సేఫ్ అన్నారు.


బీఆర్ఎస్ దండుపాళ్యం గ్యాంగ్‌లా తయారయ్యిందని విరుచుకుపడ్డారు. కేటీఆర్ నంబర్ వన్ బేవకూఫ్ అంటూ విమర్శించారు. ఈ దేశంలో రాష్ట్రపతి ఢిల్లీ తరువాత వచ్చి నివసించేది హైదరాబాద్ అన్నారు. దేశ రక్షణ కోసం కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని సీఎం ఇంప్లిమెంట్ చేశారన్నారు. దామగుండంలో రాడార్‌కు జీవో ఇచ్చిందే బీఆర్ఎస్ ప్రభుత్వం అని జగ్గారెడ్డి పేర్కొన్నారు.

UPI Wallet: యూపీఐ చెల్లింపుల కోసం కొత్త విధానం.. వివరాలు ఇవే..


కేటీఆర్‌పై కోమటిరెడ్డి ఫైర్

మాజీ మంత్రి కేటీఆర్‌పై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Minister Komatireddy Venkatreddy) ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ చార్జీల అంశంపై ఈఆర్సీ దగ్గరకు వెళ్ళటం పెద్ద జోక్ అని... ఆయన జోకర్ అంటూ వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్‌లో ఒక్క సీటు రాకున్నా.. అసెంబ్లీలో ఓడించినా బుద్ధి రాలేదంటూ మండిపడ్డారు. 200 యూనిట్ల ఫ్రీ కరెంటు పేద వాళ్ళకు తమ ప్రభుత్వం ఇస్తుందన్నారు. కేంద్ర మంత్రులు సంజయ్, కిషన్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధికి ఎంత నిధులు తెచ్చారని మంత్రి కోమటిరెడ్డి ప్రశ్నించారు.


ఇవి కూడా చదవండి...

ABN Effect: గాంధీలో నీటి కటకటకు తెర

Sanjay: జీవన్ రెడ్డి అనుచురుడి హత్యపై ఎమ్మెల్యే సంజయ్ ఆరా

Read Latest Telangana News And Telugu News

Updated Date - Oct 22 , 2024 | 03:27 PM