Phone Tapping Case.. వెలుగులోకి సంచలన నిజాలు..
ABN, Publish Date - Mar 25 , 2024 | 01:19 PM
హైదరాబాద్: తెలంగాణలో ఫోన్ టాపింగ్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రముఖ జ్యువెలరీ వ్యాపారులు, హవాలా వ్యక్తుల ఫోన్లను ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతన్నలు ట్యాప్ చేసినట్లు పోలీస్ అధికారులు గుర్తించారు.
హైదరాబాద్: తెలంగాణ (Telangana)లో ఫోన్ టాపింగ్ కేసు (Phone Tapping Case)లో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రముఖ జ్యువెలరీ (Jewelry) వ్యాపారులు, హవాలా (Hawala) వ్యక్తుల ఫోన్లను ప్రణీత్ రావు (Praneet Rao), భుజంగరావు (Bhujangarao), తిరుపతన్న (Tirupatanna)లు ట్యాప్ చేసినట్లు పోలీస్ అధికారులు గుర్తించారు. 36 మంది రియల్ ఎస్టేట్ బిల్డర్లు (Real Estate Builders), జ్యువెలరీ వ్యాపారుల ఫోన్లు ట్యాప్ చేసినట్లు విచారణలో తేలింది. అలాగే మాజీ మంత్రి అనుచరుల ఫోన్లు ట్యాప్ చేసి బెదిరించిన అంశంపై అధికారులు ఆరా తీస్తున్నారు.
కాగా తెలంగాణ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ కేసు సంచలనం రేపుతోంది. ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ప్రభాకర్ రావు (Prabhakar Rao), రాధా కిషన్ రావు (Radha Kishan Rao) పేర్లను ఎఫ్ఐఆర్ (Fir) లో పోలీసులు చేర్చారు. ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్‌లో ప్రభాకర్ రావు, రాధా కిషన్ రావులే కీలక సంస్థ దారులు... ఆ ఇద్దరూ చెప్తేనే ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్ చేశారు. ట్యాపింగ్ చేసిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రభాకర్ రావుకు ప్రణీత్ రావు అందించేవారు. రాజకీయ నాయకులు, వ్యాపారుల ఫోన్ నెంబర్లను ప్రణీత్ రావుకు ప్రభాకర్ రావు, రాధా కిషన్ ఇచ్చేవారు. కాగా ప్రణీత్ రావుపై కేసు నమోదు కావడానికి కంటే ముందే ప్రభాకర్ రావు, రాధా కిషన్ రావులు అమెరికా (America)కు వెళ్లిపోయారు.
Updated Date - Mar 25 , 2024 | 01:22 PM