Drugs Case: హైదరాబాద్‌కు డ్రగ్స్ సరఫరా చేస్తూ ఇద్దరు జెప్టో ఉద్యోగులు అరెస్టు..
ABN, Publish Date - Aug 16 , 2024 | 05:55 PM
నగరానికి డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఇద్దరు జెప్టో ఉద్యోగులను అరెస్టు చేసినట్లు ఎక్సైజ్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ జాయింట్ కమిషనర్ ఖురేషి తెలిపారు. బెంగూళూరు నుంచి హైదరాబాద్‌కు ఎండీఎంఏ డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు అందిన పక్కా సమాచారం మేరకు రాహుల్, మహేశ్ అనే ఇద్దరు డ్రగ్ పెడ్లర్లను అరెస్టు చేసినట్లు కమిషనర్ వెల్లడించారు.
హైదరాబాద్: నగరానికి డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఇద్దరు జెప్టో ఉద్యోగులను అరెస్టు చేసినట్లు ఎక్సైజ్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ జాయింట్ కమిషనర్ ఖురేషి తెలిపారు. బెంగూళూరు నుంచి హైదరాబాద్‌కు ఎండీఎంఏ డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు అందిన పక్కా సమాచారం మేరకు రాహుల్, మహేశ్ అనే ఇద్దరు డ్రగ్ పెడ్లర్లను అరెస్టు చేసినట్లు కమిషనర్ వెల్లడించారు. వారి నుంచి 29.6గ్రాముల మత్తుపదార్థాలు స్వాధీనం చేసుకున్నామని, వాటి విలువ రూ.4.50లక్షలు ఉంటుందని ఆయన తెలిపారు. నిందితులిద్దరూ బెంగూళూరులోని జెప్టో అనే ఈ కామర్స్ కంపెనీలో పని చేస్తున్నట్లు వెల్లడించారు. ఉద్యోగం చేస్తూనే బెంగుళూరు, హైదరాబాద్ సహా పలు నగరాలకు మత్తుపదార్థాలు సరఫరా చేస్తున్నట్లు కమిషనర్ వెల్లడించారు. వీరిద్దరూ నితిన్ రెడ్డి, నైజీరియాకు చెందిన వ్యక్తి ద్వారా డ్రగ్స్ సరఫరా చేస్తున్నారని, వారిని కూడా త్వరలో పట్టుకుంటామని కమిషనర్ తెలిపారు.
ఈ సందర్భంగా కమిషనర్ ఖురేషి మాట్లాడుతూ.. "నిందితులు రాహుల్, మహేశ్‌కు డ్రగ్స్ అలవాటు ఉంది. మెుదట వారు కస్టమర్లుగా ఉన్నారు. తర్వాత సప్లై చేయడం మెుదలుపెట్టారు. రాహుల్ మత్తుపదార్థాలకు బానిస కావడంతో కుటుంబ సభ్యులు రిహాబిలిటేషన్ సెంటర్లో చేర్పించారు. అక్కడ్నుంచి పారిపోయి బయటకు వచ్చాక డ్రగ్స్ సరఫరా చేయడం మెుదలుపెట్టాడు. వీరంతా వివిధ రకాల యాప్‌ల ద్వారా ఆర్డర్లు తీసుకుని సప్లై చేస్తుంటారు. అందులో భాగంగానే నగరానికి వచ్చారు. దీంతో వీరిని అరెస్టు చేశాం. ముందుగా రాహుల్, మహేశ్ ఇద్దరూ నైజీరియా వ్యక్తితో కలిసి అనంతపురం వరకు కారులో వచ్చారు. అక్కడ నైజీరియా వ్యక్తి దిగగా.. వీరిద్దరూ హైదరాబాద్ వచ్చారు. ఇక్కడ డ్రగ్స్ అమ్ముతుండగా పట్టుకున్నాం. మిగతా ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసేందుకు ప్రత్యేక టీమ్‌లు ఏర్పాటు చేశాం" అని తెలిపారు.
ఆపరేషన్ దూల్‌పేట్..
ఆపరేషన్ దూల్‌పేట్ పేరిట నెల రోజుల నుంచి ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎక్సైజ్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ జాయింట్ కమిషనర్ ఖురేషి తెలిపారు. ఆగస్టు 31లోపు తెలంగాణ రాష్ట్రంలో గుడుంబా లేకుండా చేస్తామన్నారు. దీని కోసం ప్రత్యేక టీమ్‌లు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఇటీవల చేసిన దాడుల్లో 1,200 కిలోల నల్ల బెల్లం, పటిక బెల్లం, పది లీటర్ల గుడుంబా స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఆ ప్రాంతంలో తనిఖీలు ముమ్మరం కావడంతో సరఫరాదారులు ఇతర ప్రాంతాలకు వెళ్లిపోతున్నారని చెప్పారు. ఇప్పటికే దూల్‌పేట్‌లో గంజాయి, డ్రగ్స్ కేసుల్లో 55మందిని అరెస్ట్ చేశామని, మరో 44మంది పరారీలో ఉన్నట్లు కమిషనర్ వెల్లడించారు.
2024లో పట్టుకున్న డ్రగ్స్ వివరాలు ఇవే..
2024 జనవరి నుంచి జులై 31 వరకూ హైదరాబాద్‌లో 392.84గ్రాముల ఎండీఎంఏ, 0.97గ్రాముల కొకైన్, 37ఎల్ఎస్డీ బ్లాస్ట్, 6.33కేజీల ఓపీఎం, 101.98కిలోల ఎంఎంసీ-3 డ్రగ్స్ సీజ్ చేసినట్లు కమిషనర్ తెలిపారు. అలాగే 40గ్రాముల ఎండీఎంఏ డ్రగ్‌ను ఎస్టీఎఫ్ ఎక్సైజ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు కమిషనర్ ఖురేషి వెల్లడించారు.
ఈ వార్తలు కూడా చదవండి:
DCP Vineeth: మోస్ట్ వాంటెడ్ 53కేసులు.. పది సార్లు జైలుకు..
TG Politics: జనగామ బీఆర్ఎస్‌లో భగ్గుమన్న వర్గపోరు..
MLA Srinivas Reddy: కాంగ్రెస్‌పై కేటీఆర్, హరీశ్ రావు విషం చిమ్ముతున్నారు..
Updated Date - Aug 16 , 2024 | 06:02 PM