Crime News: శంషాబాద్‌లో భారీగా గంజాయి పట్టివేత..
ABN, Publish Date - Aug 04 , 2024 | 09:02 AM
శంషాబాద్ మండలం పెద్ద గోల్కొండ ఔటర్ రింగ్ రోడ్ వద్ద ఎస్ఓటీ పోలీసులు భారీగా గంజాయి స్వాధీనం చేసుకున్నారు. పెద్ద అంబర్పేట్ మీదుగా గచ్చిబౌలి వైపు కంటైనర్‌లో తరలిస్తున్న దాదాపు 800కిలోల గంజాయిని పట్టుకున్నారు. కంటైనర్ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఒడిశా నుంచి హైదరాబాద్‌కు తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
రంగారెడ్డి: శంషాబాద్ మండలం పెద్ద గోల్కొండ ఔటర్ రింగ్ రోడ్ వద్ద ఎస్ఓటీ పోలీసులు భారీగా గంజాయి స్వాధీనం చేసుకున్నారు. పెద్ద అంబర్పేట్ మీదుగా గచ్చిబౌలి వైపు కంటైనర్‌లో తరలిస్తున్న దాదాపు 800కిలోల గంజాయిని పట్టుకున్నారు. కంటైనర్ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఒడిశా నుంచి హైదరాబాద్‌కు తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
హైదరాబాద్‌ను పట్టిపీడిస్తున్న డ్రగ్స్..
అయితే తెలంగాణను ముఖ్యంగా హైదరాబాద్ నగరాన్ని మత్తుపదార్థాలు పట్టిపీడిస్తున్నాయి. పోలీసులు, అధికారులు ఎన్ని చర్యలు చేపట్టినా రోజుల వ్యవధిలోనే కొత్తకొత్త డ్రగ్స్ కేసులు నగరంలో వెలుగు చూస్తున్నాయి. ఎస్.ఆర్.నగర్ బాయ్స్ హాస్టళ్ల కేంద్రంగా గంజాయి, డ్రగ్స్ అమ్మకాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. అలాగే నటి రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు సైతం డ్రగ్స్ కేసులో పోలీసులకు చిక్కిన సంఘటన సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అలాగే ర్యాపిడో ద్వారా డ్రగ్స్ సరఫరా చేస్తు్న్న ఘటనలూ ఇటీవల వెలుగులోకి వచ్చాయి. పోలీసులు ఎన్ని కేసులు చేధించినా మత్తుపదార్థాల సరఫరాకు డ్రగ్ పెడ్లర్లు ఎప్పటికప్పుడు కొత్తదారులు వెతుకుతూ సవాల్ విసురుతున్నారు.
డ్రగ్ పెడ్లర్లకు పోలీసుల హెచ్చరిక..
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో తెలంగాణ పోలీసులు డ్రగ్స్ క్రయవిక్రయాలపై ఉక్కుపాదం మోపారు. జూబ్లీహిల్ పబ్బులు సహా పలు ప్రాంతాల్లో తరచూ తనిఖీలు చేస్తున్నారు. ఇటీవల పలువురు బడా పారిశ్రామికవేత్తలు, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు, విద్యార్థులు సైతం మత్తుపదార్థాలు వాడి తనిఖీల్లో పట్టుపడ్డారు. అయితే యువత మత్తుపదార్థాలకు దూరంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. డ్రగ్స్‌కు బానిసై విలువైన జీవితాలను నాశనం చేసుకోవద్దని చెప్తున్నారు. బెంగళూరు నుంచి అధికంగా డ్రగ్స్ దిగుమతి అవుతున్నాయని, దీనిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్లు చెప్తున్నారు. ఇప్పటికే పలువురు డ్రగ్ పెడ్లర్లను అరెస్టు చేసినట్లు తెలిపారు. మత్తుపదార్థాలు సరఫరా చేస్తూ పట్టుపడితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Lavanya: ఆర్జే శేఖర్ బాషాపై జూబ్లీహిల్స్ పీఎస్‌లో నటి లావణ్య ఫిర్యాదు..
Crime News: హైదరాబాద్‌లో చిన్నారి కిడ్నాప్.. ఆటోలో ఎక్కించుకుపోయిన అగంతకుడు
Updated Date - Aug 04 , 2024 | 09:07 AM