Jani Master Case: జానీ మాస్టర్ కేసులో మరో ట్విస్ట్..
ABN, Publish Date - Sep 21 , 2024 | 10:38 AM
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ తనపై అత్యాచారం చేశారని, ఆయన భార్య అయేషా తనపై దాడి చేసిందని జానీ మాస్టర్ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ నార్సింగి పోలీసులను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. అయితే ఆయన భార్య అయేషా తన ఇంటికి వచ్చి దాడి చేసినట్లు యువతి ఫిర్యాదులో పేర్కొంది.
హైదరాబాద్: మహిళా కొరియోగ్రాఫర్‌పై జానీ మాస్టర్(Jani Master) అత్యాచారం కేసులో మరో ట్విస్ట్ నెలకొంది. యువతిపై దాడి చేశారన్న ఆరోపణల నేపథ్యంలో జానీ మాస్టర్ భార్య అయేషా(Ayesha)పైనా చర్యలు తీసుకునేందుకు పోలీసులు సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే యువతిపై అత్యాచారం కేసులో జానీ మాస్టర్‌ను గోవాలో అరెస్టు చేసిన పోలీసులు.. చంచల్ గూడ జైలుకు తరలించారు. ఈ నేపథ్యంలో కేసు మరో కీలక మలుపు తిరిగే అవకాశం కనిపిస్తోంది.
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ తనపై అత్యాచారం చేశారని, ఆయన భార్య అయేషా తనపై దాడి చేసిందని జానీ మాస్టర్ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ నార్సింగి పోలీసులను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. అయితే ఆయన భార్య అయేషా తన ఇంటికి వచ్చి దాడి చేసినట్లు యువతి ఫిర్యాదులో పేర్కొంది. దీంతో ఈ కేసులో ఆమెను నిందితురాలుగా చేర్చాలని పోలీసులు నిర్ణయించినట్లు తెలుస్తోంది. జానీ భార్యతోపాటు మరో ఇద్దరినీ నిందితులుగా చేర్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.
మరోవైపు ఇవాళ(శనివారం) ఉప్పరపల్లి కోర్టులో జానీ మాస్టర్‌ని కస్టడీకి కోరుతూ నార్సింగి పోలీసులు పిటిషన్ వేయనున్నారు. పది రోజులపాటు కస్టడీకి కోరే అవకాశం ఉంది. పూర్తిస్థాయిలో ఆయన్ను విచారించేందుకు పోలీసులు కోర్టుకు వెళ్లనున్నారు. రిమాండ్ రిపోర్టులోని కీలక అంశాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. లేడీ కొరియోగ్రాఫర్ ఇచ్చిన 40పేజీల ఫిర్యాదుపైనా సమగ్ర దర్యాప్తు చేస్తున్నారు. ఈ మేరకు కస్టడీ కోరనున్నారు. అలాగే ఆయన భార్యపై కూడా ఆరోపణలు రావడంతో అరెస్టు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు జానీ మాస్టర్‌పై ఫోక్సో యాక్ట్ కింద కేసు నమోదు కావడంతో ఆయన తరఫు న్యాయవాది బెయిల్ కోసం రంగారెడ్డి జిల్లా కోర్టును ఆశ్రయించనున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Singareni: సింగరేణి కార్మికులకు దసరా బొనాంజా..
KTR: ఆ టెండర్ల అవినీతిపై నిగ్గు తేల్చాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తూ కేటీఆర్ ట్వీట్..
Sridhar Babu: సేమీ కండక్టర్ల రంగంలో ఉపాధి అవకాశాలు..
Updated Date - Sep 21 , 2024 | 10:42 AM