Ponguleti: హైదరాబాద్‌కు దీటుగా వరంగల్ అభివృద్ధి
ABN, Publish Date - Aug 15 , 2024 | 10:31 AM
హైదరాబాద్‌కు దీటుగా వరంగల్ నగరాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Ponguleti Srinivasa Reddy) తెలిపారు. 2050 వరకు జనాభా పెరుగుదలకు అనుగుణంగా వరంగల్ నగర అవసరాలకు సరిపోయేలా మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నామని చెప్పారు.
వరంగల్: హైదరాబాద్‌కు దీటుగా వరంగల్ నగరాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Ponguleti Srinivasa Reddy) తెలిపారు. 2050 వరకు జనాభా పెరుగుదలకు అనుగుణంగా వరంగల్ నగర అవసరాలకు సరిపోయేలా మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నామని చెప్పారు. వరంగల్‌ను మాస్టర్ ప్లాన్‌లో ఫార్మసిటీ ఐటీ సర్వీసెస్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ టూరిజం ఎడ్యుకేషన్ ఇన్సిస్టిట్యూషన్స్ స్టేడియం ఎయిర్‌పోర్ట్ లాజిస్టిక్ పార్క్ టూరిజం వంటి అంశాలు ఉండేలా మాస్టర్ ప్లాన్ తయారు చేస్తున్నామని అన్నారు. వరంగల్ నగరంలో ఇన్నర్ రింగ్ రోడ్డు ఔటర్ రింగ్ రోడ్డు పనులు చేపడుతుమని వివరించారు.
వరంగల్ ఎయిర్పోర్ట్ నిర్మాణానికి కృషి చేస్తున్నానని తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని శంకుస్థాపన చేసి వదిలేసిన వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణ పనులు వేగవంతం చేశామని అన్నారు. వరంగల్ పాత బస్టాండ్ స్థానంలో అత్యంత ఆధునాతన సౌకర్యాలతో కొత్త బస్టాండ్ వేగవంతంగా పూర్తి చేయాలనేదే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు.
గత ప్రభుత్వం వరంగల్‌లో నిర్మించి తలపెట్టిన కాళోజీ కళాక్షేత్రానికి శంకుస్థాపన చేసి గాలికి వదిలేసిందని విమర్శించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కళాక్షేత్రం యుద్ధ ప్రాతికమైన పూర్తి చేశామని చెప్పారు. కాళోజి జన్మదిన సందర్భంగా కాళోజి కళాక్షత్రాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు.
Updated Date - Aug 15 , 2024 | 10:31 AM