ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

TG Highcourt: ప్రణీత్‌ రావు పిటిషన్‌పై కాసేపట్లో తీర్పు..

ABN, Publish Date - Mar 21 , 2024 | 10:18 AM

Telangana: ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎస్‌ఐబీ మాజీ డీఎస్‌పీ ప్రణీత్‌రావు వేసిన పిటిషన్‌పై మరికాసేపట్లో తీర్పు వెలువడనుంది. పోలీస్‌ కస్టడీని సవాల్‌ చేస్తూ హైకోర్టులో ప్రణీత్ రావు పిటిషన్‌పై నిన్న (బుధవారం) హైకోర్టులో విచారణ జరిగింది. కస్టడీకి ఎలాంటి కండిషన్‌లు పెట్టకుండా కింది కోర్ట్ ఆదేశాలు ఇచ్చిందని ప్రణీత్ తరపు న్యాయవాది వాదించారు. గత 4 రోజులుగా బంజారాహిల్స్ పీఎస్‌కు తాళం వేసి అక్కడే ప్రణీత్‌ను పోలీసులు విచారిస్తున్నారు.

హైదరాబాద్, మార్చి 21: ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎస్‌ఐబీ మాజీ డీఎస్‌పీ ప్రణీత్‌రావు (Praneeth Rao) వేసిన పిటిషన్‌పై మరికాసేపట్లో తీర్పు వెలువడనుంది. పోలీస్‌ కస్టడీని సవాల్‌ చేస్తూ హైకోర్టులో (Telangana High Court) ప్రణీత్ రావు పిటిషన్‌పై నిన్న (బుధవారం) హైకోర్టులో విచారణ జరిగింది. కస్టడీకి ఎలాంటి కండిషన్‌లు పెట్టకుండా కింది కోర్ట్ ఆదేశాలు ఇచ్చిందని ప్రణీత్ తరపు న్యాయవాది వాదించారు. గత 4 రోజులుగా బంజారాహిల్స్ పీఎస్‌కు తాళం వేసి అక్కడే ప్రణీత్‌ను పోలీసులు విచారిస్తున్నారు. ప్రణీత్ పిటిషన్‌పై పోలీసులు కౌంటర్ దాఖలు చేశారు. హైకోర్టులో ఇరువురి వాదనలు ముగియగా... ఈరోజు(గురువారం) తీర్పు వెలువడనుంది.

Delhi CM Aravind Kejriwal: మరోసారి న్యాయస్థానాన్ని ఆశ్రయించిన కేజ్రీవాల్


హైకోర్టులో జరిగిన వాదనలు ఇవే..

ఎలాంటి ఆధారాలు లేకుండా ప్రణీత్ రావు ను ఆక్రమంగా అరెస్ట్ చేశారని ప్రణీత్‌రావు న్యాయవాది గండ్ర మోహన్ రావు వాదించారు. ‘‘నాంపల్లి కోర్టు వాస్తవ అంశాలను పరిగణలోకి తీసుకోకుండా పోలీస్ కస్టడీకి అనుమతి ఇచ్చింది. నిబంధనలకు విరుద్ధంగా పోలీసులు కస్టడీ లోకి తీసుకుని విచారిస్తున్నారు. ఉదయం 8 గంటల నుండి రాత్రి 8 వరకు విచారిస్తున్నారు. ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు జరగాలి.. కానీ అలా జరగడం లేదు. ప్రణీత్ రావుకు ప్రతి రోజు మెడికల్ చెక్ అప్ చేయించాలి. కస్టడీలో దర్యాప్తు విషయాలు మీడియాకు చెపుతున్నారు. కస్టడీ ఇప్పటికే నాలుగు రోజులు అయ్యింది. పోలీస్ స్టేషన్‌లో నిద్ర పోవడానికి ఎలాంటి సౌకర్యాలు లేవు’’ అని లాయర్ గండ్ర మోహన్‌రావు కోర్టుకు తెలిపారు.

Banks: మార్చి 31న ఆదివారం కూడా దేశవ్యాప్తంగా బ్యాంకులు ఓపెన్.. కారణమిదే



ప్రభుత్వం తరపు న్యాయవాది వాదనలు

24 గంటలు ప్రణీత్ రావును పోలీస్ కస్టడీలోకి నాంపల్లి కోర్టు అనుమతి ఇచ్చిందని ప్రభుత్వ తరపు న్యాయవాది తెలిపారు. ‘‘పోలీస్ స్టేషన్‌లో అన్ని సౌకర్యాలు ఉన్నాయి. మీడియాకు ఎలాంటి లీకులు ఇవ్వడం లేదు. ప్రణీత్ రావు అరెస్ట్ 13 మార్చి రోజున మాత్రమే డీసీపీ ప్రెస్ నోట్ ఇచ్చాడు. పోలీస్ అధికారులు మీడియాకు లీక్‌లు ఇస్తారని చెప్పడం సరైంది కాదు. జూబ్లీహిల్స్ ఏసీపీ ఈ కేసులో ఐవో అధికారిగా ఉన్నారు. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో విచారణ చేస్తున్నాం. అడిషనల్ ఎస్పీ రమేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు అయ్యింది. అడిషనల్ ఎస్పీ రమేష్ ఎక్కడ కూడా ఈ కేసులో జోక్యం చేసుకోలేదు. ప్రణీత్ రావు బంధువులు అనుదీప్ అతని కౌన్సిల్ వాసుదేవన్ రోజు కలుస్తున్నారు. ఇంకా మూడు రోజులు ప్రణీత్ రావు పోలీస్ కస్టడీ ఉంది. దర్యాప్తు దశలో ఉన్న కేసులో ఇప్పుడు పిటిషన్ వేయ్యడం కరెక్ట్ కాదు. ప్రణీత్ రావు వేసిన పిటిషన్‌ను కొట్టివేయాలి. మీడియాకు ప్రణీత్ వ్యవహారంలో ఎలాంటి లీకులు ఇవ్వ్వడం లేదు. ప్రణీత్ అరెస్ట్ తరువాత డీసీపీ ప్రెస్ రిలీజ్ ఇచ్చారు. మీడియా రాస్తున్న వాటికి మేము బాధ్యులం కాదు. కేస్ తీవ్రత దృష్ట్యా స్పెషల్ టీంను ఏర్పాటు చేశాం. బంజారాహిల్స్ సీఐ కూడా టీంలో ఉన్నారు. అందుకే బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ప్రణీత్‌ను విచారిస్తున్నా ము. అడిషనల్ ఎస్పీ రమేష్ దర్యాప్తులో పాల్గొనడం లేదు. రమేష్ అసలు బంజారాహిల్స్ పీఎస్‌కు రానే లేదు. రాత్రి 8 తరువాత ప్రణీత్‌ను విచారించడం లేదు. ప్రతి రోజు ప్రణీత్ కౌన్సిల్ అనుదీప్, వాసు దేవన్ ప్రణీత్‌ను కలుస్తున్నారు. వీరి ఫోన్‌ల నుంచి వారి తలిదండ్రులతోను ప్రణీత్ మాట్లాడుతున్నాడు’’ అని ప్రభుత్వ న్యాయవాది కోర్టు తెలిపారు. ఇరువురి వాదనలు విన్న హైకోర్టు తీర్పును ఈరోజుకు వాయిదా వేసింది.

ఇవి కూడా చదవండి...

వైద్యశాఖలో కొలువుల జాతర


TG Politics: కాంగ్రెస్ మలి జాబితాపై ఉత్కంఠ!


మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Mar 21 , 2024 | 10:23 AM

Advertising
Advertising