ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Prashanth Reddy: పీఏసీ నియామకంలో కూడా రాజకీయాలా..

ABN, Publish Date - Sep 21 , 2024 | 04:45 PM

రూల్ 250 ప్రకారం పీఏసీ కమిటీని ఎన్నుకోవాలని తమ పార్టీ ఎమ్మెల్యేలం కోరామని బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి, గంగుల కమలాకర్ పేర్లు, మండలి నుంచి ఎల్ రమణ, సత్యవతి రాథోడ్ పేర్లు అసెంబ్లీ స్పీకర్‌ గడ్డం ప్రసాద్ కుమార్‌‌కు ఇచ్చామని చెప్పారు.

హైదరాబాద్: ప్రతిపక్ష పార్టీలకు దశాబ్దాలుగా వస్తున్న ఆనవాయితీని కాంగ్రెస్ పార్టీ తుంగలో తొక్కిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఆరోపించారు. పీఏసీ సమావేశానికి వచ్చాం.. కానీ మీటింగ్ ప్రారంభంలోనే పీఏసీ నియామకంపై అసెంబ్లీ స్పీకర్‌ గడ్డం ప్రసాద్ కుమార్‌ను అడిగామని తెలిపారు. కమిటీని ఎన్నుకున్నారా.. సెలక్షన్ చేశారా అని అడిగామన్నారు.


ALSO Read: CM Revanth Reddy: త్యాగధనుడు కొండా లక్ష్మణ్‌ బాపూజీ

ఇవాళ( శనివారం) అసెంబ్లీ మీడియా పాయింట్ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వేముల ప్రశాంత్ రెడ్డి , గంగుల కమలాకర్ మాట్లాడారు. ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ...రూల్ 250 ప్రకారం పీఏసీ కమిటీని ఎన్నుకోవాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలం కోరామని అన్నారు. అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి, గంగుల కమలాకర్ పేర్లు, మండలి నుంచి ఎల్ రమణ, సత్యవతి రాథోడ్ పేర్లు అసెంబ్లీ స్పీకర్‌ గడ్డం ప్రసాద్ కుమార్‌‌కు ఇచ్చామని చెప్పారు. కానీ హరీష్‌రావు పేరు లేకుండా అరికపూడి గాంధీ ఎలా వచ్చిందని ప్రశ్నించారు.


ALSO Read:KTR: ఏచూరీ సంస్మరణ సభలో కేటీఆర్ హాట్ కామెంట్స్..

పీఏసీ చైర్మన్‌ను ప్రతిపక్ష పార్టీ నియమిస్తుందని గుర్తుచేశారు. తాము అధికారంలో ఉన్నప్పుడు పీఏసీ చైర్మన్‌గా ప్రతిపక్ష పార్టీలకే పీఏసీ చైర్మన్‌ పదవి ఇచ్చినట్లు గుర్తుచేశారు. గతంలో కూడా ప్రతిపక్ష పార్టీలోఉన్న నేతలే పీఏసీ చైర్మన్లు అయ్యారని వివరించారు. కేంద్రంలో కూడా ఇదే ఫార్ములా ఉందన్నారు. ప్రతిపక్ష పార్టీలకే పీఏసీ చైర్మన్‌గా చేశారని అన్నారు. ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ సూచన మేరకే లోక్‌సభలో కేసీ వేణుగోపాల్ పీఏసీ చైర్మన్ అయ్యారని గుర్తుచేశారు.


పీఏసీ నియామకంపై స్పీకర్‌ను అడిగితే ఆయన ఒక్కమాట కూడా ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. అన్నింటికీ మంత్రి శ్రీధర్ బాబు సమాధానం ఎలా చెబుతారని నిలదీశారు. పీఏసీ నియామకంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయాలు చేస్తోందని విమర్శించారు.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసి నిరసన తెలిపామని చెప్పారు. తెలంగాణ ప్రజలు, మేధావులు కాంగ్రెస్ ప్రభుత్వం గురించి ఆలోచించాలని ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

Sridhar Babu: సేమీ కండక్టర్ల రంగంలో ఉపాధి అవకాశాలు..

KTR: ఆ టెండర్ల అవినీతిపై నిగ్గు తేల్చాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తూ కేటీఆర్ ట్వీట్..

For More Telangana News and Telugu News..

Updated Date - Sep 21 , 2024 | 05:05 PM