ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Manchu Family: మంచు కుటుంబంలో గొడవలు.. రెండు ఎఫ్ఐఆర్‌లు నమోదు..

ABN, Publish Date - Dec 10 , 2024 | 11:53 AM

మంచు కుటుంబంలో ఊహించని మలుపులు.. నిముషానికొక పరిణామం చోటు చేసుకుంటోంది. ఈ వ్యవహారం ఇప్పుడు రచ్చకెక్కింది. తండ్రీ కొడుకులు ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం పోలీసులు వారి నుంచి స్టేట్‌మెంట్ రికార్డు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.

హైదరాబాద్: మంచు కుటుంబం (Manchu Family)లో వివాదం చినికి.. చినికి గాలివానగా మారోతోంది. మోహన్‌బాబు (Mohan Babu), మంచు మనోజ్ (Manchu Manoj) ఒకరిపై ఒకరు ఫిర్యాదులు (Complaint) చేసుకున్నారు. దీనిపై పహాడి షరీఫ్ పోలీస్ స్టేషన్‌లో రెండు ఎఫ్ఐఆర్‌ (FIRs)లు నమోదయ్యాయి. మంచు మనోజ్ అతని భార్య మౌనికపై కేసు నమోదు చేశారు. మోహన్ బాబు ఇచ్చిన ఫిర్యాదుతో మనోజ్ దంపతులపై కేసు పెట్టారు. మరోవైపు మనోజ్ ఫిర్యదుతో మోహన్‌బాబు, పది మంది అనుచరులపై కేసు నమోదైంది.

మంచు కుటుంబంలో ఊహించని మలుపులు.. నిముషానికొక పరిణామం చోటు చేసుకుంటోంది. ఈ వ్యవహారం ఇప్పుడు రచ్చకెక్కింది. తండ్రీ కొడుకులు ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం పోలీసులు వారి నుంచి స్టేట్‌మెంట్ రికార్డు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. మరోవైపు మోహన్ బాబు పెద్ద కుమారుడు మంచు విష్ణు కాసేపటి క్రితమే దుబాయ్ నుంచి హైదరాబాద్ చేరుకున్నారు. తన కుటుంబసభ్యులతో సమావేశం అయ్యే అవకాశం కనిపిస్తోంది.


కాగా మంచు కుటుంబంలో గొడవల ఎపిసోడ్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. తండ్రి మోహన్‌బాబు (Mohan Babu) తనపై చేసిన ఫిర్యాదుపై మంచు మనోజ్ (Manch Manoj) స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తనతో పాటు భార్య మౌనికపై అసత్య ఆరోపణ చేస్తున్నారని ఫిర్యాదు చేశానన్నారు. కుటుంబ వ్యవహారాల్లో తనకు రక్షణగా నిలబడాలని ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కోరానన్నారు. కుటుంబ ఆస్తుల కోసం తాను ఎప్పుడూ ఆశ పడలేదని, కుటుంబ గౌరవాన్ని కాపాడేందుకు ప్రతిసారి ప్రయత్నం చేశానని చెప్పారు. ఈ వివాదాల్లో తన కూతుర్ని తీసుకు రావడం చాలా బాధాకరమని అన్నారు. గత కొన్నాళ్లగా ఆ ఇంటి నుంచి తన కుటుంబంతో దూరంగానే ఉంటున్నామని, తన ముందే తన కుటుంబ సభ్యుల్ని ఉద్యోగులను తీవ్రంగా తిట్టారని, ఇంటిలో ఉండాల్సిన సిసి ఫుటేజీ కెమెరాలు మాయమయ్యాయని, అన్న విష్ణు దుబాయ్‌కు ఎందుకు వెళ్ళాడో అందరికీ తెలుసునని అన్నారు.

విష్ణు అనుచరులే సిసి ఫుటేజ్ మొత్తాన్ని మాయం చేశారని, ఇంటిలో ఉన్న సీసీ కెమెరాలు అన్నిటిని విజయ రెడ్డి , కిరణ్ రెడ్డి తీసుకొని వెళ్ళిపోయారని మంచు మనోజ్ ఆరోపించారు. తాను ఆస్తుల కోసం ఎప్పుడూ ప్రాకులాడ లేదని..ఆస్తుల కోసం ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదని అన్నారు. తాను, తన భార్య సొంత కాళ్ళ మీద నిలబడి సంపాదించుకుంటున్నామని చెప్పారు. విద్యాసంస్థల్లో కొన్ని అక్రమాలు జరుగుతున్నాయని, విద్యాసంస్థలోని బాధితులకు తాను అండగా ఉన్నానని.. బాధితుల పక్షాన నిలబడినందుకు తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మనోజ్ వ్యాఖ్యానించారు.


మంచు కుటుంబంలో మంటలు..

కాగా మంచు కుటుంబంలో అగ్గి రాజుకుంది. సోమవారం అది ఊహించని మలుపులు తిరిగి పెద్ద మంటలా మారింది. మోహన్‌బాబు, ఆయన తనయుడు మనోజ్‌ .. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ పోలీస్‌ స్టేషన్‌ కు వెళ్లడంతో వివాదం మరింత ముదిరింది. ఆస్తుల పంపకాల విషయంలో మోహన్‌బాబుకు, ఆయన చిన్న కొడుకు మనోజ్‌కు మధ్య గొడవ జరిగినట్లు, ఇద్దరూ కొట్టుకున్నట్లు ఆదివారం మీడియా వర్గాల్లో వార్తలు హల్‌చల్‌ చేశాయి. అదంతా నిజం కాదని, అబద్దపు వార్తలు ప్రచారం చేయొద్దని మోహన్‌బాబు ట్విటర్‌లో ప్రకటించిన కొన్ని గంటలకే బంజారాహిల్స్‌లోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో ఎంఎల్‌సీ (మెడికల్‌ లీగల్‌ సర్టిఫికెట్‌) చేయించిన మనోజ్‌ ఆ మెడికల్‌ రిపోర్టులతో సహా.. వెళ్లి పహాడీషరీఫ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనకు, తన కుటుంబానికి ప్రాణహాని ఉందని, ఆదివారం పది మంది గుర్తుతెలియని వ్యక్తులు తమ ఇంటికి (జల్‌పల్లిలోని మోహన్‌బాబు నివాసం) వచ్చి గట్టిగా అరుస్తూ భయబ్రాంతులకు గురిచేశారని, వారిని అడ్డుకునే సమయంలో తనపై దాడి చేశారనీ, ఇంటి ఆవరణలోని సీసీటీవీ ఫుటేజీలు ఎత్తుకెళ్లారని, దుండగులను పట్టుకొని చట్ట ప్రకారం శిక్షించాలని మనోజ్‌ ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.

మనోజ్‌, మౌనికపై సీపీకి ఫిర్యాదు చేసిన మోహన్‌బాబు

ఇదిలా ఉంటే తన కొడుకు మనోజ్‌, ఆయన భార్య మౌనిక, వారి అనుచరుల ద్వారా తనకు ప్రాణ హాని ఉందని, రక్షణ కల్పించాలని రాచకొండ సీపీకి మోహన్‌బాబు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సీపీకి రాసిన లేఖను మోహన్‌బాబు మీడియాకు విడుదల చేశారు. కొంతమంది సంఘ విద్రోహ శక్తులతో కలిసి తన ఇంటిని, ఆస్తులను లాక్కోవాలని చూస్తున్నారని ఆ లేఖలో పేర్కొన్నారు. తన కొడుకు మనోజ్‌, కోడలు మౌనిక ప్లాన్‌ ప్రకారమే ఇదంతా జరుగుతున్నట్లు నమ్ముతున్నానని వెల్లడించారు. తను 78 ఏళ్ల సీనియర్‌ సిటిజన్‌ననీ, తనకు రక్షణ కల్పించాలని అభ్యర్దిస్తున్నట్లు సీపీకి రాసిన లేఖలో మోహన్‌బాబు పేర్కొన్నారు. తన తండ్రి, అన్న విష్ణు అనుచరులు తనపై దాడిచేశారని మనోజ్‌ పోలీసు స్టేషన్‌కు వెళ్లడం, మనోజ్‌ దంపతులు వల్లనే తనకు ప్రాణహాని ఉందని మోహన్‌బాబు సీపీకి లేఖ రాయడం.. వంటి ఊహించని మలుపులతో కథ క్లైమాక్స్‌కు చేరింది. అసలు మోహన్‌ బాబు ఇంట్లో ఏం జరుగుతోందని అటు సినీ అభిమానుల్లో, ఇటు ఇండస్ట్రీలో తీవ్ర చర్చ జరుగుతోంది.

Updated Date - Dec 10 , 2024 | 01:10 PM