Phone Tapping: రాధాకిషన్ రావుకు ఈనెల 12 వరకు రిమాండ్ పొడిగింపు
ABN, Publish Date - Apr 10 , 2024 | 11:33 AM
Telangana: ఫోన్ ట్యాపింగ్ కేసులో టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధా కిషన్ రావుకు ఈనెల 12 వరకు నాంపల్లి కోర్టు రిమాండ్ పొడిగించింది. నేటితో రాధాకిషన్ రావు కస్టడీ ముగియడంతో ఆయనను ఉదయం నాంపల్లి కోర్టులో పోలీసులు హాజరుపరిచారు. దీంతో రాధాకిషన్‌కు ఈ నెల 12 వరకు రిమాండ్ కొనసాగిస్తున్నట్ల కోర్టు తెలిపింది. జైల్‌లో లైబ్రరీకి వెళ్లేందుకు అనుమతించడం లేదని ఈ సందర్భంగా కోర్టుకు రాధా కిషన్ తెలిపారు.
హైదరాబాద్, ఏప్రిల్ 10: ఫోన్ ట్యాపింగ్ కేసులో (Phone Tapping Case) టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధా కిషన్ రావుకు ( Task Force Former DCP Radha Kishan Rao) ఈనెల 12 వరకు నాంపల్లి కోర్టు (Nampally Court) రిమాండ్ పొడిగించింది. నేటితో రాధాకిషన్ రావు కస్టడీ ముగియడంతో ఆయనను ఉదయం నాంపల్లి కోర్టులో పోలీసులు హాజరుపరిచారు. దీంతో రాధాకిషన్‌కు ఈ నెల 12 వరకు రిమాండ్ కొనసాగిస్తున్నట్ల కోర్టు తెలిపింది. జైల్‌లో లైబ్రరీకి వెళ్లేందుకు అనుమతించడం లేదని ఈ సందర్భంగా కోర్టుకు రాధా కిషన్ తెలిపారు. జైల్ సూపరింటెండెంట్‌ను కూడా కలవనీయడం లేదని ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులను కోర్టు ప్రశ్నించింది. లైబ్రరీతో పాటు జైలు సూపరింటెండెంట్‌ను కలిసేలా అనుమతిస్తూ కోర్టు ఆదేశించింది.
BRS: బీఆర్‌ఎస్‌కు ప్రమాద ఘంటికలు.. ఏడాది క్రితమే చెప్పినా..
వారం పాటు కస్టడీలో...
ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ అయిన రాధాకిషన్‌ను దాదాపు వారం రోజుల పాటు పోలీసులు కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించారు. ఆయన ఇచ్చిన సమాచారం ఆధారంగా మరికొంతమందిని ప్రశ్నిస్తున్నారు. ఫోన్ టాపింగ్ వ్యవహారంలో రాధా కిషన్ కాన్వెన్షన్ కీలకంగా మారింది. గత ప్రభుత్వ హయాంలో అప్పటి స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్(ఎస్ఐబీ) చీఫ్ ప్రభాకర్‌రావు కీలక పాత్రధారిగా సాగిన ఈ వ్యవహారంలో సూత్రధారుల డొంక కదిలింది. బీఆర్‌ఎస్‌కు చెందిన 10 మందికి పైగా నేతలు ఫోన్‌ట్యాపింగ్ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించినట్లు రాధాకిషన్‌రావు విచారణలో వెల్లడైనట్లు తెలుస్తోంది. అయితే నాలుగో రోజు కస్టడీలో ఆయన అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను వైద్య పరీక్షల నిమిత్తం గాంధీకి తరలించి ఆ తరువాత కోర్టులో హాజరుపర్చారు.
ఇవి కూడా చదవండి...
Telangana Politics: దూకుడు పెంచిన బీజేపీ.. తగ్గేదేలే అంటున్న ఆ ముగ్గురు..!
CM Kejriwal: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు మరో ఎదురు దెబ్బ
మరిన్ని తెలంగాణ వార్తల కోసం...
Updated Date - Apr 10 , 2024 | 11:43 AM