ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Raghunandan Rao: రేవంత్ ప్రభుత్వంపై ఎంపీ రఘునందన్ రావు ధ్వజం

ABN, Publish Date - Oct 21 , 2024 | 03:23 PM

ముత్యాలమ్మ దేవాలయం ఘటనలో అరెస్ట్ చేసిన హిందువులను వెంటనే విడుదల చేయాలని ఎంపీ రఘునందన్ రావు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో బంగ్లాదేశ్ స్లీపర్స్ సెల్స్ కు ట్రైనింగ్ ఇస్తున్నారని ఆరోపించారు. ఇది పోలీసులకు సమాజానికి మంచిది కాదని అన్నారు. రాజకీయ అవసరం కోసం దీనిని డైవర్ట్ చేయొద్దని అన్నారు.

హైదరాబాద్: సికింద్రాబాద్​ మోండా మార్కెట్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలోని ముత్యాలమ్మ ఆలయంలో అమ్మవారి విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయంపై రేవంత్ ప్రభుత్వంపై మెదక్ ఎంపీ రఘునందన్ రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణలో మందిరాలపై జరుగుతున్న దాడులపై సమగ్ర విచారణ జరపాలని రాష్ట్ర డీజీపీకి విజ్ఞప్తి చేశామని అన్నారు. ప్రభుత్వం హిందువుల మనోభావాలు దెబ్బతీస్తుందని ధ్వజమెత్తారు. పర్సనాలిటీ డెవలప్మెంట్ పేరుతో సమాజాన్ని విచ్ఛిన్నం చేసే ట్రైనింగ్ ఇస్తున్నారని ఆరోపించారు. ఇవాళ(సోమవారం) డీజీపీ జితేందర్‌ను ఎంపీ రఘునందన్ రావు కలిశారు. ఈ సందర్భంగా మీడియాతో రఘునందన్ రావు మాట్లాడుతూ.... డీజీపీకి ఆలయాలపై దాడుల విషయం తెలిసిన ఆయన ఎందుకు మౌనంగా ఉంటున్నారని ఎంపీ రఘునందన్ రావు ప్రశ్నించారు.


ముత్యాలమ్మ దేవాలయంపై దాడి చేసిన ఘటనలో అరెస్ట్ చేసిన హిందువులను వెంటనే విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. బంగ్లాదేశ్ స్లీపర్స్ సెల్స్‌కు రాష్ట్రంలో ట్రైనింగ్ ఇస్తున్నారని ఆరోపించారు. ఇది పోలీసులకు సమాజానికి మంచిది కాదని అన్నారు. రాజకీయ అవసరం కోసం దీనిని డైవర్ట్ చేయొద్దని అన్నారు. ప్రజలే పోలీసులపై దాడి చేసినట్లు పోలీసులు కొన్ని వీడియోలు విడుదల చేస్తున్నారని ఇది కరెక్ట్ కాదని ఎంపీ రఘునందన్ రావు తెలిపారు.


ఆలయంపై దాడి చేసిన వారి మీద చర్యలు తీసుకోవాలి: ఏలేటి మహేశ్వర రెడ్డి

ముత్యాలమ్మ దేవాలయంపై దాడి చేసిన వారి మీద చర్యలేందుకు తీసుకోవడం లేదని బీజేపీ నేత ఏలేటి మహేశ్వర రెడ్డి ప్రశ్నించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు వైఫల్యం చెందాయని మండిపడ్డారు. ఆలయంపై దాడి చేసిన నిందితులపై చర్యలు తీసుకోకపోతే బీజేపీ ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తుందని హెచ్చరించారు. తెలంగాణలో ఇలాంటివి పునరావృత్తం అయితే ఊరుకొనే ప్రసక్తే లేదని లేటి మహేశ్వర రెడ్డి వార్నింగ్ ఇచ్చారు.


డీజీపీని కలిసిన బీజేపీ నేతలు

గవర్నర్‌ను కలిసిన అనంతరం బీజేపీ బృందం డీజీపీ ఆఫీసుకు బయలుదేరింది. గవర్నర్ కార్యాలయం నుంచి డీజీపీ ఆఫీస్‌కు ఒకే కారులో ఎంపీలు రఘునందన్ రావు, ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వర రెడ్డి, బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర రెడ్డి, ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు వెళ్లారు. ఈ సందర్భంగా నేతలున్న కారును ఎంపీ రఘునందన్ రావు స్వయంగా నడిపారు. కాసేపటికే డీజీపీ కార్యాలయానికి చేరుకున్న తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీల బృందం.. డీజీపీ జితేందర్‌ను కలిశారు. ముత్యాలమ్మ గుడి ఇష్యూ, హిందూ సంఘాల లాఠీఛార్జ్ అక్రమ కేసులపై ఫిర్యాదు చేశారు. బాధ్యులైన పోలీసులపై చర్యలు తీసుకోవాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి...

TG Ministers: సియోల్‌కు టీ.మినిస్టర్స్.. ఏయే ప్రాంతాల్లో పర్యటించారంటే

CM Revanth: వాటిపై దాడి చేస్తే వదలిపెట్టం.. సీఎం మాస్ వార్నింగ్

Read Latest Telangana News And Telugu News

Updated Date - Oct 21 , 2024 | 03:39 PM