ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Telangana High Court: తెలంగాణ హైకోర్టులో రాజ్ పాకాల కేసు విచారణ

ABN, Publish Date - Oct 28 , 2024 | 05:05 PM

తెలంగాణ హైకోర్టులో రాజ్ పాకాల లంచ్ మోషన్ పిటిషన్‌ను ఈరోజు దాఖలు చేశారు. పోలీసులు తనని అక్రమంగా అరెస్టు చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారన్న సమాచారం నేపథ్యంలో ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తనపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఉండేందుకు వీలుగా ముందుస్తు బెయిల్ మంజూరు చేయాలని హైకోర్టులో రాజ్‌ పాకాల పిటిషన్ వేసినట్లు తెలుస్తోంది.

హైదరాబాద్: జన్వాడ్ ఫామ్‌హౌస్ కేసులో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బావమరిది రాజ్ పాకాల తెలంగాణ హైకోర్టును (Telangana High Court) ఇవాళ(సోమవారం) ఆశ్రయించారు. ఈరోజు హైకోర్టులో రాజ్ పాకాల లంచ్ మోషన్ పిటిషన్‌ను దాఖలు చేశారు. పోలీసులు తనని అక్రమంగా అరెస్టు చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారన్న సమాచారం నేపథ్యంలో ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తనపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఉండేందుకు వీలుగా ముందుస్తు బెయిల్ మంజూరు చేయాలని హైకోర్టులో రాజ్‌ పాకాల పిటిషన్ వేసినట్లు తెలుస్తోంది.


పోలీసులకు సహకరించని విజయ్ మద్దూరి

జన్వాడ ఫామ్‌హౌస్ కేసు మరో మలుపు తిరిగింది. విజయ్ మద్దూరి సహకరించడం లేదని మోకిలా పోలీసులు తెలిపారు. ఫామ్‌హౌస్‌పై రైడ్స్ సమయంలో ఆయన మొబైల్ దాచిపెట్టి మరో మహిళ మొబైల్‌ను విజయ్ మద్దూరి అందజేశారని అన్నారు. తన మొబైల్ దొరికితే డ్రగ్స్ లింక్స్ బయటపడతాయన్న భయంతో వేరే మహిళ ఫోన్ విజయ మద్దూరి అందజేశారని మోకిలా పోలీసులు తెలిపారు. దాడుల సమయంలో విజయ్ మద్దూరి పక్కనే ఆయన సతీమణి ఉన్నారని చెప్పారు. దాడుల సమయంలో పోలీసులకు తెలియకుండా రాజ్ పాకలా పరార్ అయ్యారని అన్నారు. ఈ కేసులో రాజ్ పాకాల, విజయ మద్దూరి విచారణలో నోరు తెరిస్తే కేసు దర్యాప్తు ముందుకు కదిలే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. పార్టీలో డబ్బులు కాకుండా కాయిన్స్ రూపంలో పేకాట అడినట్లు గుర్తించామని మోకిలా పోలీసులు వెల్లడించారు.


అది గృహ ప్రవేశ పార్టీ మాత్రమే: రాజ్ పాకాల న్యాయవాది మాయూర్ రెడ్డి

జన్వాడ రాజ్ పాకాల రిట్ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు ఇవాళ(సోమవారం) విచారణ ప్రారంభించింది. పోలీసులు ఇచ్చిన నోటీసులను రాజ్ పాకాల సవాల్ చేశాడు. రాజ్ పాకాల తరుపు న్యాయవాది మాయూర్ రెడ్డి హైకోర్టులో వాదనలు వినిపించారు. రాజ్ పాకాలకు ఈరోజు 9:30గంటలకు మోకిలా పోలీసులు నోటీసులు ఇచ్చి 11 గంటలకు విచారణకు రమ్మన్నారని రాజ్ పాకాల న్యాయవాది మాయూర్ రెడ్డి తెలిపారు. రాజ్ పాకాల ఇంట్లో పార్టీ చేసుకుంటుంటే అక్రమంగా పోలీసులు వచ్చి దాడి చేశారని అన్నారు. రాజ్ పాకాల ఉద్యోగికి డ్రగ్ పాజిటివ్ వస్తే రాజ్ పాకాలను నిందితుడిగా చేర్చారని వివరించారు. డ్రగ్స్ టెస్ట్‌కు శాంపిల్ ఇవ్వాలని మహిళలను ఇబ్బంది పెట్టారని చెప్పారు. ప్రతిపక్ష నేత కేటీఆర్ బావమరిదిని కనుకనే టార్గెట్ చేశారని అన్నారు. రాజకీయ దురుద్దేశంతోనే కేసులు పెట్టారని రాజ్ పాకాల తరుపు న్యాయవాది మాయూర్ రెడ్డి వెల్లడించారు.


ప్రభుత్వ వాదనలు ఇలా...

ఇప్పటి వరకు ఈ కేసులో ఎవరిని అరెస్ట్ చేయలేదు. అక్రమంగా మద్యం బాటిళ్లు లభించడంతో పాటు ఒక వ్యక్తికి డ్రగ్ పాజిటివ్ వచ్చింది. ఇందులో రాజకీయ జోక్యం లేదు. రాజ్ పాకాలకు నిబంధనల ప్రకారమే 41A నోటీసులు ఇచ్చాం. మాకు అరెస్ట్ చేసే ఉద్దేశం లేదు. మేము అరెస్ట్ చేస్తామని ఎక్కడ చెప్పలేదు ఏఏజీ ఇమ్రాన్ ఖాన్ విచారణకు రాకపోతే అరెస్ట్ చేస్తామని నోటీసులో చెప్పాము. పోలీసుల ముందు హాజరయ్యేందుకు రెండు రోజులు సమయం ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. విచారణలో సమాచారం లేదా ఆధారాలు లభిస్తే చర్యలు తీసుకుంటాం. నిబంధనల ప్రకారమే ముందుకు వెళ్లాలని పోలీసులకు హైకోర్టు ఆదేశించింది.

Updated Date - Oct 28 , 2024 | 05:20 PM