TG News: ఆ ప్రాంతంలో వరుసగా కుంగిపోతున్న రోడ్లు.. భయాందోళనలో ప్రజలు
ABN , Publish Date - Oct 23 , 2024 | 12:16 PM
Telangana: హైదరాబాద్‌లో రోడ్లు అకస్మాత్తుగా కుంగిపోతున్నాయి. భూకంపం వచ్చిందా అన్న తీరుగా రోడ్డు కుంగిపోతుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
హైదరాబాద్, అక్టోబర్ 23: నగరంలో వరుసగా రోడ్లు కుంగుబాటుకు గురవుతున్నాయి. ఉన్నట్టుండి ఒక్కసారిగా రోడ్లు కుంగిపోతుండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఎక్కడ, ఎప్పుడు రోడ్డు కుంగిపోతుందో అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నాసిరకం రోడ్లను వేయడం వల్లే ఇలా జరుగుతోందంటూ ప్రజలు ఆరోపిస్తున్నారు. తాజాగా నగరంలోని గోషామహల్‌లో (Goshamahal) రోడ్డు కుంగింది. ఇలా జరగడం ఇది మూడోవసారి. అయితే గతంలో కుంగిన నాలాకు కొద్ది దూరంలోనే మరోసారి భారీగా నాలా కుంగిపోయినట్లు స్థానికులు చెబుతున్నారు.
IPL 2025 LSG: పాపం రాహుల్.. వదిలించుకునే ప్లాన్ లో లక్నో
గోషామహల్‌లో దారుసలామ్ నుంచి చాక్నివాడికి వెళ్లే మార్గంలో బుధవారం ఉదయం భారీగా రోడ్డు కుంగిపోయింది. అయితే ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో పెనుప్రమాదం తప్పినట్లైంది. అతిపురాతనమైన నాలా కావడంతో కుంగినట్లుగా స్థానికులు చెబుతున్నారు. అయితే 200 వందల మీటర్ల దూరంలో గతంలో కూడా అదే నాలా కూలిపోయింది. మరోవైపు 2022 ఏడాదిలోనూ చాక్నవాడిలో నాలాపై ఉన్న రోడ్డు ఒక్కసారిగా కుంగిపోయిన విషయం తెలిసిందే. భూకంపం వచ్చిందేమో అన్నట్లు రోడ్డు కుంగిపోయి... పెద్ద గుంత ఏర్పడింది. అంతే కాదు ఆ సమయంలో వాహనాలు కూడా ఉండటంతో గుంతలో పడిపోయాయి.
పదుల సంఖ్యలో కార్లు, ఆటోలు పడిపోయాయి. ఆ సమయంలో సంత జరుగుతుండడంతో కూరగాయల దుకాణాలు కూడా గోతిలో పడిపోయాయి. దీంతో పలువురు దుకాణదారులకు గాయాలయ్యాయి. ఈ ఘటన అప్పట్లో హాట్ టాపిక్‌గా మారింది. విషయం తెలిసిన అప్పటి బీఆర్ఎస్ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సంఘటనా స్థలానికి చేరుకుని కుంగిన రోడ్డును పరిశీలించారు. పురాతన నాలాలు ఉన్నాయని, స్థానికులు ఆక్రమణలకు పాల్పడి నిర్మాణాలు చేపట్టారని ఆయన వెల్లడించారు. ఈ మొత్తం ఘటనకు సంబంధించిన వీడియోలు అప్పట్లో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి.
KTR: రేవంత్ డబుల్ ఇంజన్‌కు మరో అర్థం ఇదే..
రెండో సారి కూడా...
అలాగే ఈ ఏడాదిలోనూ గోషామహల్‌లోనే రెండోసారి రోడ్డు కుంగిపోయింది. చాక్నవాడి ప్రాంతంలో ఒక్కసారిగా రోడ్డు కుంగిపోయి డీసీఎం వాహనం కిందపడిపోయింది. ఈ ఘటనతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వరుసగా రోడ్లు కుంగిపోతుండటంతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏ క్షణంలో రోడ్లు కుంగిపోతాయో అంటూ ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. నాణ్యతతో కూడిన రోడ్లు వేయాలని జనం కోరుతున్నారు.
అకస్మాత్తుగా కుంగిన రోడ్డు..
ఇక.. ఈ ఏడాది జూలైలో ఉప్పల్ జాతీయ రహదారిపై కూడా రోడ్డు అకస్మాత్తుగా కుంగిపోయింది. ఫ్లైఓవర్ కోసం రోడ్డు మధ్యలో నిర్మించిన పిల్లర్‌కు దగ్గరగా వెళ్లిన డ్రైవర్ కారును ఆపాడు. ఇంతలో అక్కడ మట్టి ఒక్కసారిగి కుంగి, పెద్ద గొయ్యి ఏర్పడింది. కారు ముందు టైరు గుంతలో ఇరుక్కుయింది. వెంటనే అప్రమత్తమైన డ్రైవర్... ఇంజన్‌ను ఆపి, బయటకు వచ్చి ఇతరుల సహాయంతో కారును బయటకు తీశారు. ఈ ప్రమాదంలో ఎవ్వరికీ ఎలాంటి ప్రమాదం జరుగలేదు.
ఇవి కూడా చదవండి...
Jeevanreddy: తీవ్ర మనోవేదనలో జీవన్ రెడ్డి.. ఏ క్షణమైనా
KTR: రేవంత్ డబుల్ ఇంజన్‌కు మరో అర్థం ఇదే..
Read Latest Telangana News And Telugu News