ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

R.P.Patnayak: రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో ఆర్పీ పట్నాయక్ ఫిర్యాదు.. విషయం ఏంటంటే..

ABN, Publish Date - Sep 27 , 2024 | 05:59 PM

ప్రముఖ సంగీత, సినీ దర్శకుడు, నటుడు ఆర్పీ పట్నాయక్ గురువారం రాత్రి రాయదుర్గం పోలీసులను ఆశ్రయించారు. సీనియర్ విద్యార్థులు తరచూ తన కుమారుడిని ర్యాగింగ్ చేస్తూ దాడి చేస్తున్నారంటూ ఆయన ఫిర్యాదు చేశారు.

హైదరాబాద్: తన కుమారుడు వైష్ణవ్‌పై కళాశాలలో సీనియర్ విద్యార్థి దాడి చేయడంపై ప్రముఖ సంగీత, సినీ దర్శకుడు, నటుడు ఆర్పీ పట్నాయక్ గురువారం రాత్రి రాయదుర్గం పోలీసులను ఆశ్రయించారు. సీనియర్ విద్యార్థులు తరచూ ర్యాగింగ్ చేస్తూ దాడి చేస్తున్నారంటూ ఆయన ఫిర్యాదు చేశారు. ఓ ప్రైవేటు కళాశాలలో వైష్ణవ్ ఎంబీఏ చదువుతున్నాడని, కళాశాల బస్సులో ఇంటికి వస్తున్న సమయంలో సీనియర్ విద్యార్థి శ్యామ్ దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడని పోలీసులకు ఆర్పీ తెలిపారు. తీవ్రంగా కొట్టి చెవి కొరికినట్లు ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు.


ఘటనను కళాశాల యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లినా ఫలితం శూన్యమని పట్నాయక్ చెప్పారు. అందుకే పోలీసులను ఆశ్రయించినట్లు వెల్లడించారు. దాడి జరగడంతో వైష్ణవ్ ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నట్లు ఆయన తెలిపారు. ఆర్పీ పట్నాయక్ ఫిర్యాదు స్వీకరించిన రాయదుర్గం పోలీసులు.. నిందితుడు శ్యామ్‌పై కేసు నమోదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తామని పోలీసులు తెలిపారు. కాగా, ఆర్పీ పట్నాయక్ విషయానికి వస్తే.. ఒకప్పుడు టాప్ సంగీత దర్శకుడిగా దూసుకెళ్లిన ఆర్పీ పట్నాయక్ ఆ తర్వాత కొంతకాలం దర్శకుడిగానూ ప్రతిభ కనబరిచారు. ప్రస్తుతం దర్శకుడిగానూ, సంగీత దర్శకుడిగానూ ఆయన బాధ్యతలను నిర్వహిస్తున్నారు. అలాగే హీరోగానూ కొన్ని మెమరబుల్ సినిమాల్లో ఆయన నటించారు.

Also Read:

తిరుమల పర్యటన రద్దు చేసుకున్న వైసీపీ అధినేత

క్లాస్ రూమ్‌లో మమ్మీ సినిమా చూపించిన టీచర్..

తండ్రి, కూతుళ్ల డ్యాన్స్ చూస్తే పరేషాన్

For More Telangana News and Telugu News..

Updated Date - Sep 27 , 2024 | 06:01 PM