Share News

RS Praveen Kumar: డీజీపీని కలిసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.. శ్రీధర్ హత్య కేసుపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్

ABN , Publish Date - May 27 , 2024 | 03:59 PM

వనపర్తి జిల్లాలో సంచలనం సృష్టించిన బీఆర్ఎస్ సీనియర్ నేత శ్రీధర్ రెడ్డి(Sridhar Reddy) హత్య కేసులో సమగ్ర విచారణ జరపాలని ఆ పార్టీ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్(RS Praveen Kumar) డిమాండ్ చేశారు. హత్య జరిగి రోజులు గడుస్తున్నా పోలీసులు ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ప్రవీణ్ ఆరోపించారు.

RS Praveen Kumar: డీజీపీని కలిసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.. శ్రీధర్ హత్య కేసుపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్

హైదరాబాద్: వనపర్తి జిల్లాలో సంచలనం సృష్టించిన బీఆర్ఎస్ సీనియర్ నేత శ్రీధర్ రెడ్డి(Sridhar Reddy) హత్య కేసులో సమగ్ర విచారణ జరపాలని ఆ పార్టీ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్(RS Praveen Kumar) డిమాండ్ చేశారు. హత్య జరిగి రోజులు గడుస్తున్నా పోలీసులు ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ప్రవీణ్ ఆరోపించారు. ఇదే అంశంపై ఆయన సోమవారం డీజీపీ రవిగుప్తాని కలిశారు.

అనంతరం మాట్లాడుతూ.. "మంత్రి జూపల్లి కృష్ణారావు మీద ఫిర్యాదు చేసిన ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇప్పటి వరకు ఈ కేసులో ఎవ్వరిని అరెస్ట్ చెయ్యలేదు. ప్రధాన నిందితుడు జూపల్లి ఇంట్లోనే ఉన్నాడు. శ్రీధర్ రెడ్డి హత్యను ప్రత్యేక దర్యాప్తు బృందంతో విచారణ జరపాలి. వారం రోజుల్లో ఈ కేసులో న్యాయం జరగకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తాం" అని ప్రవీణ్ కుమార్ అన్నారు.


ఫోన్ ట్యాపింగ్‌పై..

ప్రవీణ్ కుమార్ ఫోన్ ట్యాపింగ్ అంశంపై కూడా మాట్లాడారు. ఫోన్ ట్యాపింగ్ దేశ భద్రతకు సంబంధించినదని.. స్వార్థ ప్రయోజనాల కోసం తనపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారన్నారు. ట్యాపింగ్ వెనక ఎవరున్నా సమగ్ర దర్యాప్తు జరపాలని, నిందితులకు శిక్షలు పడేలా చేయాలని కోరారు.


జరిగిందిదే...

వనపర్తి జిల్లాలో సంచలనం సృష్టించిన బీఆర్‌ఎస్‌ నాయకుడు శ్రీధర్‌ రెడ్డి హత్య వ్యవహారం కొలిక్కి రాలేదు. గత బుధవారం అర్ధరాత్రి చిన్నంబావి మండలం లక్ష్మిపల్లి గ్రామానికి చెందిన బీఆర్‌ఎస్‌ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే హర్షవర్ధన్‌రెడ్డి ప్రధాన అనుచరుడు శ్రీధర్‌ రెడ్డి హత్యకు గురయ్యారు. ఈ హత్యపై ఇప్పటికే బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీల నాయకులు ఒకరిపై ఒకరు పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నారు.

బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ వచ్చి నేరుగా పోలీసులపై, మంత్రి జూపల్లి కృష్ణారావుపై నిందారోపణలు చేయగా, కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పకపోతే పరువు నష్టం దావా వేస్తానని మంత్రి జూపల్లి స్పందించారు. వ్యక్తిగత కారణాలతో జరిగిన హత్యకు రాజకీయ రంగు పులిమి, బీఆర్‌ఎస్‌ శవ రాజకీయాలు చేస్తోందని మంత్రి అన్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు దారి తీసిన పరిణామాలు, వ్యక్తిగత, రాజకీయ కక్షలు, వివాహేతర సంబంధాలు, భూవివాదాలు, కు టుంబ సభ్యుల మధ్య ఉన్న తగవులపై విచారణ జరుపుతున్నారు. అయితే.. శ్రీధర్‌ రెడ్డి వ్యక్తిగత కారణాల వల్లే హత్యకు గురయ్యారని కొందరు అంటున్నారు.


గత కొన్ని సంవత్సరాల నుంచి వారి కుటుంబాల్లో భూ తగాదాల సమస్య ఉందని, వారిలో ఎవరో ఒకరు ఈ హత్యకు పాల్పడి ఉంటారని అనుమానిస్తున్నారు. అలాగే మూడు సంవత్సరాల క్రితం గ్రామంలో ఓ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి భూ సమస్యలో అదే గ్రామానికి చెందిన మాజీ ప్రజాప్రతినిధి అడ్డుగా రావడంతో అతనిపై హ త్యాయత్నం కేసు పెట్టించి జైలుకు పంపించాడని, అతనే మనసులో పెట్టుకుని ఈ హత్య చేయించినట్లు కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. అలాగే శ్రీధర్‌రెడ్డి గ్రా మంలో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని, ఇన్నాళ్లు అధికార పార్టీలో ఉండటంతో అతడిని ఏమీ చేయలేక.. ప్రభుత్వం మారడంతో మాజీ ప్రజాప్రతినిధి అండతో అతని అనుచరులైన కొందరు ఈ హత్య చేశారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి.


గ్రామంలో జరిగే భూ పంచాయతీల విషయంలో బాధితులు శ్రీధర్‌ రెడ్డిని సంప్రదించే వారని, అప్పట్లో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే ఉం డటంతో చాలా వివాదాలను పరిష్కరించే వాడని, ఈ క్రమంలో పాతకక్షలు ఉన్న వారు ఈ హత్య చేసుంటారనే అనుమానాలు వస్తున్నాయి. గ్రామస్థులు మాత్రం శ్రీధర్‌ రెడ్డి హత్య రాజకీయ కోణంలోనే జరిగిందని, ఆయనకు వ్యక్తిగత సమస్యలు ఏవీ లేవని, ఆయన ఏ వివాదంలో తలదూర్చే వ్యక్తి కాదని అంటున్నారు.

ప్రధానంగా.. రాజకీయ కక్షలతో పాటు వివాహేతర సంబంధంపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారని, ఇప్పటికే పలువురు అనుమానితులను విచారిస్తున్నారని స మాచారం. ఈ ఉదాంతం రాజకీయ రంగు పులుముకోవడం, సోషల్‌ మీడియా వేదికగా ఇరు పార్టీల నాయకు లు వారు ఆరోపణలు చేసుకుంటుండటం, కేసు కొలిక్కి రాకపోవడంతో పోలీసులకు తలనొప్పిగా మారింది.

Read Latest National News and Telugu News

Updated Date - May 27 , 2024 | 03:59 PM