Etela Rajender: అంతా చేసింది పోలీసులే.. ఎంపీ సంచలన ఆరోపణలు
ABN, Publish Date - Oct 21 , 2024 | 02:04 PM
Telangana: ముత్యాలమ్మ గుడి అంశానికి సంబంధించి బీజేపీ నేతల బృందం గవర్నర్ జిష్ణు దేవ్ వర్మను కలిసి ఫిర్యాదు చేశారు. హిందూ దేవాలయాల మీద కొంతమంది దాడి చేస్తున్నారని.. దీనిపై ప్రభుత్వం నిమ్మకునీరేతినట్లు వ్యవహరిస్తోందని ఎంపీ ఈటల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
హైదరాబాద్, అక్టోబర్ 21: హిందూ దేవాలయాల మీద కొంతమంది దాడి చేస్తున్నారని.. దీనిపై ప్రభుత్వం నిమ్మకునీరెతినట్లు వ్యవహరిస్తోందని ఎంపీ ఈటల రాజేందర్ (MP Etela Rajender) ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ఉదయం గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను కలిసిన బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు.. ముత్యాలమ్మ గుడిపై జరిగిన దాడి ఘటనపై ఫిర్యాదు చేశారు. అనంతరం నేతలు రాజ్‌భవన్ వద్ద మీడియాతో మాట్లాడారు. ముత్యాలమ్మ గుడి మీద దాడి చేస్తే నిందితుడిని పిచ్చోడని ముద్ర వేసి వదిలేసే ప్రయత్నం చేశారని ఈటల మండిపడ్డారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా కొంతమంది చేస్తున్నారన్నారు.
Malla Reddy Dance: మల్లా రెడ్డి మాస్ డ్యాన్స్.. మనవరాలి సంగీత్ వేడుకలో అదరగొట్టిన మాజీ మంత్రి..
శాంతియుతంగా ర్యాలీ తీస్తుంటే పోలీసులు దుర్మార్గంగా లాఠీ ఛార్జ్ చేసి అరెస్టులు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉగ్రదాడులకు నగరంలో ఎంతో మంది బలయ్యారన్నారు. మళ్లీ అలాంటి దాడులకే దుర్మార్గులు కుట్ర చేస్తున్నారని.. నిందితులను కఠినంగా శిక్షించాలని గవర్నర్‌ను కోరినట్లు తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకునేలా ప్రభుత్వానికి సూచించాలని గవర్నర్‌ను కోరామన్నారు. పోలీసులే మఫ్టీలో రెచ్చగొట్టి ర్యాలీలో దాడులు, లాఠీఛార్జ్ జరిగేలా చేశారని ఎంపీ ఈటల రాజేందర్ ఆరోపించారు.
BRS: కేటీఆర్ ఇంటి వద్ద పోలీసుల మోహరింపు.. ఎందుకంటే
దాడులను తిప్పికొడతాం: ఏలేటి
హిందూ దేవాలయాల మీద దాడి జరిగితే సీఎం రేవంత్ ఇంత వరకు ఖండించలేదని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజాం నిరంకుశ పాలన రాష్ట్రంలో కొనసాగుతోందన్నారు. హిందూ దేవాలయాల మీద దాడి చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. నిందితుల మీద ప్రభుత్వం కేసు పెట్టకుండా ఏం చేస్తోందని ప్రశ్నించారు. వంద మంది నగరంలో దాడులకు కుట్ర చేసినట్లు తెలుస్తోందని.. రాష్ట్ర ఇంటిలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తోందని నిలదీశారు. ‘‘దేవాలయాల మీద దాడి మా తల్లి మీద దాడిలా భావిస్తాం... తిప్పికొడతాం’’ అని ఏలేటి మహేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు.
డీజీపీని కలిసిన బృందం
గవర్నర్‌ను కలిసిన అనంతరం బీజేపీ బృందం డీజీపీ ఆఫీసుకు బయలుదేరింది. గవర్నర్ కార్యాలయం నుంచి డీజీపీ ఆఫీస్‌కు ఒకే కారులో ఎంపీలు రఘునందన్ రావు, ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వర రెడ్డి, బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర రెడ్డి, ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు వెళ్లారు. ఈ సందర్భంగా నేతలున్న కారును ఎంపీ రఘునందన్ రావు స్వయంగా నడిపారు. కాసేపటికే డీజీపీ కార్యాలయానికి చేరుకున్న తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీల బృందం.. డీజీపీ జితేందర్‌ను కలిశారు. ముత్యాలమ్మ గుడి ఇష్యూ, హిందూ సంఘాల లాఠీఛార్జ్ అక్రమ కేసులపై ఫిర్యాదు చేశారు. బాధ్యులైన పోలీసులపై చర్యలు తీసుకోవాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు.
ఇవి కూడా చదవండి...
TG Ministers: సియోల్‌కు టీ.మినిస్టర్స్.. ఏయే ప్రాంతాల్లో పర్యటించారంటే
CM Revanth: వాటిపై దాడి చేస్తే వదలిపెట్టం.. సీఎం మాస్ వార్నింగ్
Read Latest Telangana News And Telugu News
Updated Date - Oct 21 , 2024 | 02:15 PM